2026 Best 5 OTT Crime Thrillers Telugu: సినిమా ప్రియులను థియేటర్లలోనే కాకుండా, ఓటీటీ తెరల ముందు కూడా అత్యధికంగా ఆకట్టుకునే జోనర్లలో 'క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్' ఎప్పుడూ ముందుంటుంది. ప్రతి సన్నివేశంలోనూ ఉత్కంఠ రేకెత్తిస్తూ, ఊహించని ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేసే కథలకు ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది.
టాప్ 5 ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు

మన తెలుగు ప్రేక్షకులకు కూడా క్రైమ్ మిస్టరీలంటే ఎంతో ఆసక్తి. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ప్రేక్షకులను కట్టిపడేసిన టాప్ 5 ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
1. కర్తవ్య (Kartavya): పోలీస్ ఆఫీసర్‌గా సైఫ్ అలీ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో, దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'కర్తవ్య'. ఒక చిన్నారి దారుణ హత్య, దానికి తోడైన సామాజిక మూఢనమ్మకాల చుట్టూ ఈ కథ సాగుతుంది. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్‌గా సైఫ్ తన అద్భుత నటనతో అలరించారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగే ఈ చిత్రం ద్వారా ప్రముఖ జర్నలిస్ట్ సౌరభ్ ద్వివేది నటుడిగా అరంగేట్రం చేశారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలను ఇష్టపడే వారు ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో తెలుగులో కూడా వీక్షించవచ్చు.
2. గజబ్ రాత్ (Gajab Raat): మనోజ్ బాజ్‌పాయ్ మైండ్ గేమ్
విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ నటించిన లేటెస్ట్ క్రైమ్ డ్రామా 'గజబ్ రాత్'. ఒకే ఒక్క రాత్రి జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. అన్యాయంగా ప్రాణాపాయంలో పడ్డ ఒక అమాయక యువతిని రక్షించే క్రమంలో, ఓ అవినీతి పోలీస్ అధికారి మనసు ఎలా మారిందనేది చిత్ర మూలకథ. మనోజ్ బాజ్‌పాయ్ నటనతో సాగే ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ ట్రెండింగ్ లిస్ట్‌లో ఉంది. ఈ మూవీని తెలుగులో చూడొచ్చు.
3. బబితా సింగ్ రిపోర్టింగ్ (Babita Singh Reporting): స్నేహితుడి హత్య మిస్టరీ
{{/usCountry}}విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ నటించిన లేటెస్ట్ క్రైమ్ డ్రామా 'గజబ్ రాత్'. ఒకే ఒక్క రాత్రి జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. అన్యాయంగా ప్రాణాపాయంలో పడ్డ ఒక అమాయక యువతిని రక్షించే క్రమంలో, ఓ అవినీతి పోలీస్ అధికారి మనసు ఎలా మారిందనేది చిత్ర మూలకథ. మనోజ్ బాజ్‌పాయ్ నటనతో సాగే ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ ట్రెండింగ్ లిస్ట్‌లో ఉంది. ఈ మూవీని తెలుగులో చూడొచ్చు.
3. బబితా సింగ్ రిపోర్టింగ్ (Babita Singh Reporting): స్నేహితుడి హత్య మిస్టరీ
{{/usCountry}}మహిళా పోలీస్ అధికారిణి చుట్టూ తిరిగే పవర్ ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ 'బబితా సింగ్ రిపోర్టింగ్'. చిన్ననాటి స్నేహితుడు బన్సీ దారుణ హత్యకు గురికావడంతో, ఆ హంతకుడిని పట్టుకోవడానికి బబితా చేసే శోధన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సస్పెన్స్ తో కూడిన ఇన్వెస్టిగేటివ్ డ్రామాలను ఇష్టపడే వారు ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో చూడవచ్చు. తెలుగులో కూడా బబితా సింగ్ రిపోర్టింగ్ ఓటీటీ రిలీజ్ అయింది.
4. గాంధారి (Gandhari): కూతురి కోసం తాప్సీ పోరాటం
బ్యూటిఫుల్ హీరోయిన్ తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ 'గాంధారి'. తన కుమార్తె అపహరణకు గురైన తర్వాత చూపు కోల్పోయిన ఒక తల్లి, మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) ముఠాపై ఎలా తిరగబడిందనేది ఈ కథ. తాప్సీ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్, భావోద్వేగాలు ఈ సినిమాకు ప్రధాన బలం. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు భాషలో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉంది.
5. మర్దానీ 3 (Mardaani 3): శివాని శివాజీ రావు రీ-ఎంట్రీ
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణీ ముఖర్జీ ప్రతిష్టాత్మకమైన పోలీస్ క్యారెక్టర్ 'శివాని శివాజీ రావు'గా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'మర్దానీ 3'. నగరంలో మాయమవుతున్న చిన్నారుల వెనుక ఉన్న అంతర్జాతీయ నేర ముఠాను ఏరిపారేసే పోలీస్ ఆఫీసర్‌గా రాణీ ముఖర్జీ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ మర్దానీ 3 తెలుగులో నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.