Venkatesh Trivikram Aadarsha Kutumbam OTT Streaming: టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. గతంలో 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' వంటి చిత్రాలకు రచయితగా వెంకటేష్‌కు సూపర్ హిట్స్ అందించిన త్రివిక్రమ్, తొలిసారి దర్శకుడిగా మెగాఫోన్ పట్టడంతో 'ఆదర్శ కుటుంబం - హౌస్ నెంబర్ 47'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
నెల కాకముందే ఓటీటీలోకి

హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన ఆదర్శ కుటుంబం ఇప్పుడు నెల తిరగకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది.
శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేశ్, వెన్నెల కిశోర్, సత్య, బ్రహ్మాజీ, రఘుబాబు, యువీనా, రాజ్ ప్రజ్వల్, ఉదయ్‌భీర్ సంధూ కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించగా, రవి కే చంద్రన్ ఛాయాగ్రహణం, నవీన్ నూలీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.
110 కోట్ల బడ్జెట్-76 కోట్ల కలెక్షన్స్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు, నిర్మాణ, ప్రచార ఖర్చులు కలిపి దాదాపు రూ. 110 కోట్ల వ్యయంతో ఆదర్శ కుటుంబం సినిమాను తెరకెక్కించారు. విడుదలకు ముందే ఓటీటీ, శాటిలైట్, డబ్బింగ్, ఆడియో హక్కుల రూపంలో నిర్మాతలకు రూ. 70 కోట్ల వరకు వెనక్కి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా రూ. 65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగడంతో, ట్రేడ్ వర్గాలు రూ. 130 కోట్ల గ్రాస్ వసూళ్లను బ్రేక్-ఈవెన్ లక్ష్యంగా నిర్ణయించాయి.
కానీ, వరల్డ్ వైడ్‌గా ఆదర్శ కుటుంబం సినిమాకు రూ. 76 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. త్రివిక్రమ్ కెరీర్లోనే అతిపెద్ద పరాజయంగా నిలిచిన ఈ సినిమా, బయ్యర్లకు రూ. 30 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చినట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే మధ్యతరగతి కష్టాలు, అనూహ్య మలుపుల చుట్టూ 'ఆదర్శ కుటుంబం' కథ నడుస్తుంది.
ఆదర్శ కుటుంబం కథేంటి?
{{/usCountry}}కానీ, వరల్డ్ వైడ్‌గా ఆదర్శ కుటుంబం సినిమాకు రూ. 76 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. త్రివిక్రమ్ కెరీర్లోనే అతిపెద్ద పరాజయంగా నిలిచిన ఈ సినిమా, బయ్యర్లకు రూ. 30 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చినట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే మధ్యతరగతి కష్టాలు, అనూహ్య మలుపుల చుట్టూ 'ఆదర్శ కుటుంబం' కథ నడుస్తుంది.
ఆదర్శ కుటుంబం కథేంటి?
{{/usCountry}}చిట్టిబాబు (వెంకటేష్) ఒక ప్రైవేటు ఉద్యోగి. ఆయన భార్య స్వర్ణ (శ్రీనిధి శెట్టి) చిట్టీల వ్యాపారం పేరుతో అప్పుల ఊబిలో కూరుకుపోయి, అప్పుల వాళ్లకు భయపడి ఇంట్లోనే దాక్కుంటుంది. కాలేజీకి వెళ్లే కూతురు సంపూర్ణ (యువీనా) బైక్ మెకానిక్, ఆటో డ్రైవర్ వంటి వారితో ప్రేమలో పడుతూ తండ్రికి నిత్యం తలనొప్పి తెప్పిస్తుంది.
మరోవైపు కొడుకు శర్వ (రాజా ప్రజ్వల్) చదువులో వెనుకబడటమే కాకుండా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుంటాడు. అతని ఆపరేషన్‌కు రూ. 2 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెబుతారు. ఇలాంటి ఆర్థిక ఇబ్బందుల నడుమ చిట్టిబాబు ఉన్న ఉద్యోగం కూడా కోల్పోతాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక సతమతమవుతున్న తరుణంలో ఆయనకు ఏకంగా రూ. 100 కోట్ల లాటరీ తగులుతుంది.
రూ. 100 కోట్ల లాటరీ తెచ్చిన తిప్పలు
ఆ తర్వాత ఏమైంది? కరుడుగట్టిన బీహార్ గ్యాంగ్ చిట్టిబాబు కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేసింది? ఆ గ్యాంగ్ నుంచి చిట్టిబాబు కుటుంబం బయటపడిందా? అసలు చిట్టిబాబు గతం ఏమిటి? రూ. 100 కోట్ల లాటరీ వెనుక దాగిన అసలు రహస్యం ఏమిటి? దాడికి వచ్చిన బీహారీ గ్యాంగ్ అకస్మాత్తుగా కనిపించకుండా పోవడానికి కారణమేంటి? ఈ కేసును ఎస్పీ (నారా రోహిత్) ఎలా ఛేదించాడు? అన్నది ఇప్పుడు ఓటీటీలోనే చూడాలి.
నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్
ఆదర్శ కుటుంబం ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ. 40 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. నిజానికి థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీలోకి తీసుకురావాలని నిర్మాతలు, నెట్‌ఫ్లిక్స్ మధ్య ఒప్పందం కుదిరింది.
కానీ థియేట్రికల్ రన్ త్వరగా ముగియడంతో నెల రోజులు పూర్తి కాకముందే స్ట్రీమింగ్‌కు మార్గం సుగమమైంది. నవంబర్ 27న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ 5 భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో ఆదర్శ కుటుంబం ఓటీటీ రిలీజ్ అవనుంది.
ABOUT THE AUTHOR
చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.