తెలుగులో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి. హీరోగానే కాకుండా విలన్‌గా కూడా రాణిస్తున్నాడు ఈ హీరో. అల్లు అర్జున్ సరైనోడు సినిమాతో విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆది పినిశెట్టి ఆ తర్వాత ది వారియర్ మూవీలో కూడా ప్రతినాయకుడిగా అలరించాడు.
డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్

ఇప్పుడు మరోసారి ఆది పినిశెట్టి విలన్‌గా చేసిన సినిమా అఖండ 2 తాండవం. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. ఇందులో హీరోయిన్‌గా సంయుక్త మీనన్ యాక్ట్ చేసింది. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న హర్షాలి మల్హోత్రా కీలక పాత్ర పోషించింది.
అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్
డిసెంబర్ 5న థియేటర్లలో అఖండ 2 విడుదల అవుతున్న నేపథ్యంలో ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆది పినిశెట్టి, హీరోయిన్ సంయుక్త మీనన్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.
సరైనోడు సినిమాలో
ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం నేను ఇక్కడ ఉండడానికి కారణం బోయపాటి గారు. సరైనోడు సినిమాలో నన్ను అద్భుతమైన విలన్ పాత్రలో చూపించారు. ఈ సినిమా గురించి చెప్తున్నప్పుడు నిజంగా నేను బాలయ్య గారి పక్కన సరిపోతానా అని భావించాను" అని అన్నాడు.
కారణం బాలయ్య గారే
"నాకు ఇంత అద్భుతమైన ఆఫర్ ఇచ్చిన బోయపాటి గారికి థాంక్యూ. మా ప్రొడ్యూసర్స్ ఈ సినిమాని అద్భుతమైన కాన్వాస్‌లో నిర్మించారు. అందరూ కూడా చాలా హ్యాపీగా ఆనందంగా పని చేసాం. దీనికి కారణం బాలయ్య గారే. ఆయన చాలా పాజిటివ్ పర్సన్. ఆయనతో మళ్లీ మళ్లీ పని చేయాలని ఆశగా ఉంది" అని ఆది పినిశెట్టి తెలిపాడు.
10 వేల వాట్స్ కరెంట్ షాక్
{{/usCountry}}"నాకు ఇంత అద్భుతమైన ఆఫర్ ఇచ్చిన బోయపాటి గారికి థాంక్యూ. మా ప్రొడ్యూసర్స్ ఈ సినిమాని అద్భుతమైన కాన్వాస్‌లో నిర్మించారు. అందరూ కూడా చాలా హ్యాపీగా ఆనందంగా పని చేసాం. దీనికి కారణం బాలయ్య గారే. ఆయన చాలా పాజిటివ్ పర్సన్. ఆయనతో మళ్లీ మళ్లీ పని చేయాలని ఆశగా ఉంది" అని ఆది పినిశెట్టి తెలిపాడు.
10 వేల వాట్స్ కరెంట్ షాక్
{{/usCountry}}"డిసెంబర్ 5న అఖండ తాండవం. అందరూ థియేటర్స్‌కి వచ్చేయండి. బాలయ్య గారి ఎనర్జీ, బోయపాటి గారి మాస్, తమన్ బీజీఎమ్‌తో థియేటర్‌లో కూర్చున్న ప్రతిక్షణం 10,000 వాట్స్ కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఉంటుంది. అందరం థియేటర్స్‌లో కలుద్దాం" అని ఆది పినిశెట్టి చెప్పుకొచ్చాడు.
నాకు శివుడంటే భక్తి
సంయుక్త మాట్లాడుతూ.. "బాలయ్య బాబు గారి అభిమానులందరికీ నమస్కారం. నాకు శివుడు అంటే భక్తి, ప్రేమ. అఖండ నాకు ఎంతో ఇష్టమైన సినిమా. అఖండ 2 నేను భాగమవుతానని ఎప్పుడు అనుకోలేదు" అని అన్నారు.
జాజికాయ సాంగ్‌ను ఎంజాయ్ చేస్తారు
"బాలయ్య గారితో పనిచేయడం అద్భుతమైన అనుభూతి. ఎంతో ఆనందంగా కలిసి పనిచేశాం. ఆయన ఆయన సినిమా మీద ఉన్న ప్యాషన్ అద్భుతం. ఆయన ఎనర్జీ టీమ్ అందరికీ వస్తుంది. జాజికాయ సాంగ్ మీరందరూ స్క్రీన్ మీద చాలా ఎంజాయ్ చేస్తారు. అందరు కూడా థియేటర్స్‌లో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను" అని సంయుక్త మీనన్ తెలిపింది.