...
...
Next Story

Aamir Khan Sonam: 3 ఇడియట్స్ సినిమా ఆయన కథ కాదు, సోనమ్ వాంగ్‌చుక్ త్వరలో దీక్ష ముగించాలి.. ఆమీర్ ఖాన్ కామెంట్స్

Aamir Khan On Sonam Wangchuk Hunger Strike: బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ '3 ఈడియట్స్' సినిమాలోని ఐకానిక్ 'రాంచో' పాత్రపై లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆమిర్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. లడఖ్ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను త్వరగా విరమించాలని అమీర్ ఖాన్ కోరారు.

Published on: Jul 17, 2026, 10:50:33 IST
Advertisement

Aamir Khan On Sonam Wangchuk Hunger Strike: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఎట్టకేలకు ఒక సంచలన నిజాన్ని బయటపెట్టారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన '3 ఈడియట్స్' సినిమాలో ఆయన పోషించిన 'రాంచో' (ఫున్సుఖ్ వాంగ్డు) పాత్రకు, లడఖ్‌కు చెందిన ప్రసిద్ధ విద్యా సంస్కర్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

19 రోజులుగా ఆమరణ నిరాహర దీక్ష

3 ఇడియట్స్ సినిమా ఆయన కథ కాదు, సోనమ్ వాంగ్‌చుక్ త్వరలో దీక్ష ముగించాలి.. ఆమీర్ ఖాన్ కామెంట్స్
3 ఇడియట్స్ సినిమా ఆయన కథ కాదు, సోనమ్ వాంగ్‌చుక్ త్వరలో దీక్ష ముగించాలి.. ఆమీర్ ఖాన్ కామెంట్స్

ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా గత 19 రోజులుగా సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షపై స్పందించిన అమీర్ ఖాన్, ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ (LIFF) ముగింపు వేడుకల్లో ఆమిర్ ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఆమిర్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన 'లగాన్' సినిమా ప్రదర్శనను ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ చిత్రం విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన చర్చా కార్యక్రమంలో ప్రేక్షకులతో ముచ్చటించిన ఆమిర్ ఖాన్‌కు.. సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష, '3 ఈడియట్స్' సినిమాతో ఆయనకున్న లింక్‌పై ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఆ ప్రచారం కేవలం అపోహే: ఆమిర్ ఖాన్

"రాంచో పాత్రను సోనమ్ వాంగ్‌చుక్ జీవితం ఆధారంగానే సృష్టించారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అది కేవలం ఒక అపోహ మాత్రమే. '3 ఈడియట్స్' సినిమా తీసే సమయంలో మాకు సోనమ్ వాంగ్‌చుక్ గురించి కనీసం తెలియదు" అని ఆమిర్ ఖాన్ స్పష్టం చేశారు. సినిమాలో చతుర్ రామలింగం పాత్ర పోషించిన ఓమి వైద్య ఇటీవల సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్‌ను ప్రస్తావిస్తూ ఆమిర్ మాట్లాడారు.

సినిమా పాత్రతో సంబంధం లేకపోయినా సోనమ్ వాంగ్‌చుక్ సమాజం కోసం చేస్తున్న పనులు ఎంతో గొప్పవని ఆమిర్ ఖాన్ కొనియాడారు. మన గౌరవాన్ని అందుకోవడానికి, ఆయన చేసే మంచి పనులను గుర్తించడానికి '3 ఈడియట్స్' సినిమా పాత్రతో లింక్ ఉండాల్సిన అవసరం లేదని, వాస్తవాలను చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని క్లియర్ చేస్తున్నానని పేర్కొన్నారు.

క్షీణిస్తున్న ఆరోగ్యం.. ఆందోళనలో చిత్ర పరిశ్రమ

ప్రస్తుతం ఢిల్లీలో సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న దీక్షపై ఆమిర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నీట్-యూజీ (NEET-UG) పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు తేవాలని డిమాండ్ చేస్తూ 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఆధ్వర్యంలో జూన్ 28 నుంచి ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, పరీక్షల నిర్వహణలో 5 అంశాల రోడ్‌మ్యాప్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. "ఆయన ఆరోగ్యం, ప్రాణం గురించి మేమంతా చాలా ఆందోళన చెందుతున్నాం. ఈ దీక్ష ప్రశాంతంగా ముగియాలని, ఆయన త్వరగా దీక్ష విరమించాలని కోరుకుంటున్నాం" అని ఆమిర్ ఖాన్ ఆకాంక్షించారు.

సినీ సెలబ్రిటీల మద్దతు

జులై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శాంతియుతంగా నిర్వహించ తలపెట్టిన 'చలో సంసద్' మార్చ్‌కు సోనమ్ పిలుపునిచ్చారు. ఈ ఉద్యమానికి ఇప్పటికే ప్రకాష్ రాజ్, అభయ్ డియోల్, అనురాగ్ కశ్యప్, సోనాక్షి సిన్హా, సయాజీ షిండే వంటి ఎందరో సినీ ప్రముఖులు మద్దతు ప్రకటించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe