Today OTT Release Telugu Movie Aaradhana: ఓటీటీలో ఎప్పటికప్పుడు డిఫరెంట్ తెలుగు సినిమాలు స్ట్రీమింగ్‌కు వస్తూనే ఉన్నాయి. అలా ఈ వారం కూడా ఎన్నో సినిమాలు ఓటీటీ రిలీజ్ కాగా ఇవాళ (మే 3) తెలుగు లవ్ డ్రామా చిత్రం ఒకటి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆ సినిమానే 'ఆరాధన'.
సీనియర్ హీరోయిన్ ఆమనితో సమీర్

ప్రేమకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ, మనసును హత్తుకునే భావోద్వేగాలతో తెరకెక్కిన చిత్రమే ఈ 'ఆరాధన'. సీనియర్ హీరోయిన్ ఆమని, నటుడు సమీర్ జోడీగా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా యువకులుగా విడిపోయిన ప్రేమ జంట 35 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది.
కథా నేపథ్యం: దశాబ్దాల తర్వాత కలిసిన జంట
ప్రేమ అన్నది కేవలం యవ్వనానికే పరిమితం కాదు, అది జీవితాంతం తోడుండే ఒక అనుభూతి అని 'ఆరాధన' కథ చెబుతుంది. ఒకప్పుడు ప్రాణప్రదంగా ప్రేమించుకున్న కృష్ణ, రాధ కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోతారు. సిటీకి వెళ్లి పెళ్లి చేసుకుందామని రాధతో కృష్ణ చెబుతాడు. రాధ సరే అంటుంది. రాధ కోసం కృష్ణ ఎంతగా ఎదురుచూసిన రాధ రాదు.
అలా కాలచక్రం తిరుగుతుంది, దశాబ్దాలు గడిచిపోతాయి. 35 ఏళ్ల తర్వాత మళ్లలీ కృష్ణ, రాధ అనుకోకుండా కలుసుకుంటారు. వృద్ధాప్యానికి దగ్గరగా ఉన్న సమయంలో ఒంటరితనంతో ఆ ఇద్దరు పాత ప్రేమికులు, సమాజం ఏమనుకుంటుందో అన్న భయం కంటే.. మిగిలిన జీవితాన్ని కలిసి గడపడాలనే నిర్ణయించుకుంటారు. ధైర్యంగా తమ రెండో ఇన్నింగ్స్‌ను ప్రేమతో ఎలా మొదలుపెట్టారనేదే ఈ చిత్ర సారాంశం.
ప్రతిభావంతులైన నటీనటులు
ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ ఆమని తనదైన నటనతో రాధ పాత్రకు ప్రాణం పోశారు. గతంలో ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో మెప్పించిన ఆమె, ఈ సినిమాలో ఒక పరిణతి చెందిన ప్రేమికురాలిగా కనిపిస్తారు. ఇక సీరియల్, సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన సమీర్ తన సహజ సిద్ధమైన నటనతో కృష్ణ పాత్రలో ఒదిగిపోయారు.
{{/usCountry}}ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ ఆమని తనదైన నటనతో రాధ పాత్రకు ప్రాణం పోశారు. గతంలో ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో మెప్పించిన ఆమె, ఈ సినిమాలో ఒక పరిణతి చెందిన ప్రేమికురాలిగా కనిపిస్తారు. ఇక సీరియల్, సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన సమీర్ తన సహజ సిద్ధమైన నటనతో కృష్ణ పాత్రలో ఒదిగిపోయారు.
{{/usCountry}}ఆరాధన సినిమాలో ఆమని, సమీర్‌తోపాటు శివ ప్రసన్న, మదన్, ఐశ్వర్య జ్యోతి, వేణు జెట్టి, శివ గడ్డం, అమూల్య వీరబత్తిని, సోమేశ్వర ప్రసాద్, రామ్ వెంకట్, కృష్ణ తేజ, సాయి ధనుష్, రిషిత రెడ్డి, నిఖిల్, రికిత చౌదరి, షాహిద్, ప్రవీణ్, వీరేష్, కావేరి, పీవీ నాగార్జున శర్మ, శ్రీకాంత్ దేవరకొండ ఇతర పాత్రలు పోషించారు.
ఆరాధన ఓటీటీలోకి
ఈ ఓటీటీ సినిమాకు అందులో నటించిన శ్రీకాంత్ దేవరకొండ కథ, దర్శకత్వం వహించారు. మౌర్య ఇలా సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టగా.. రాకేష్ వెంకటాపురం సంగీతం అందించారు. మనసుకు హత్తుకునే సన్నివేశాలు, డైలాగ్స్‌తో తెరకెక్కిన ఆరాధన ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది.
ఈటీవీ విన్ ఓటీటీలో
ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో ఆరాధన ఓటీటీ రిలీజ్ అయింది. కేవలం 39 నిమిషాలతో ఆరాధన ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి వారం ఈటీవీ విన్ ఓటీటీ సిరీస్ కథా సుధలో భాగంగా నేడు ఓటీటీలోకి వచ్చేసింది తెలుగు లవ్ డ్రామా చిత్రం ఆరాధన. ఇలాంటి ప్రేమకథలు ఇష్టపడేవారికి ఈటీవీ విన్ ఓటీటీలోని ఆరాధన మంచి ఛాయిస్.