...
...
Next Story

Ravi Kishan: కాల్పులు జరుగుతాయని హీరోయిన్లు రామనేవారు, ఇప్పుడు జుట్టుకు రంగు వేసుకుని వచ్చారు: తెలుగు విలన్ రవి కిషన్

మాధురీ దీక్షిత్ ఇటీవల గోరఖ్ పూర్ లో మూడు రోజులు గడిపిన తీరు గురించి లోక్ సభ ఎంపీ, నటుడు రవి కిషన్ మాట్లాడారు.

Published on: Mar 28, 2026, 15:11:38 IST
Advertisement

ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌లో షూటింగులకు వెళ్లాలంటే హీరోయిన్లు భయపడేవారని.. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని టాలీవుడ్ విలన్, గోరఖ్ పూర్ ఎంపీ రవి కిషన్ వ్యాఖ్యానించారు. ఇటీవల గోరఖ్‌పూర్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్న ఒక కార్యక్రమంలో రవి కిషన్ ప్రసంగిస్తూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

అప్పట్లో షూటింగ్ అంటే భయం.. ఇప్పుడు అభయం!

కాల్పులు జరుగుతాయని హీరోయిన్లు రామనేవారు, ఇప్పుడు జుట్టుకు రంగు వేసుకుని వచ్చారు: తెలుగు విలన్ రవి కిషన్
కాల్పులు జరుగుతాయని హీరోయిన్లు రామనేవారు, ఇప్పుడు జుట్టుకు రంగు వేసుకుని వచ్చారు: తెలుగు విలన్ రవి కిషన్

వేదికపై నటుడు, ఎంపీ రవి కిషన్ మాట్లాడుతూ.. "ఉత్తరప్రదేశ్‌కు ఇప్పుడు జయజయధ్వానాలు వినిపిస్తున్నాయి. గతంలో యూపీ అంటేనే వద్దనేవారు. అక్కడ కాల్పులు జరుగుతాయని, షూటింగులకు రామని హీరోయిన్లు అనేవారు. కానీ, తాజాగా మాధురి దీక్షిత్ గారు ఇక్కడికి వచ్చి మూడు రోజుల పాటు గోరఖ్‌పూర్‌లో ఉండి వెళ్లారు. ఆమె ఇక్కడ ఎంతో సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండి ముంబైకి తిరిగి వెళ్లారు" అని తెలిపారు.

అంతేకాకుండా, మాధురీ దీక్షిత్‌ను కలవడానికి వచ్చిన జనాన్ని ఉద్దేశించి రవికిషన్ సరదాగా కొన్ని కామెంట్లు కూడా చేశారు. మాధురి దీక్షిత్‌ను కలిసేందుకు చాలామంది జుట్టుకు డై (రంగు) వేసుకుని వచ్చారని, కొందరికైతే ఆ డై కారిపోతున్నా పట్టించుకోలేదని నవ్వుతూ చెప్పారు.

తొలిసారి మాధురీతో కలిసి..

కాగా, త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ సినిమా ‘మా బెహన్’ (Maa Behen)లో రవికిషన్, మాధురీ దీక్షిత్ కలిసి నటించారు. ‘తుమ్హారీ సులు’ ఫేమ్ సురేష్ త్రివేణి దర్శకత్వం వహించిన ఈ డార్క్ కామెడీ చిత్రంలో ఈ ఇద్దరితోపాటు తృప్తి డిమ్రి, ధర్నా దుర్గా కూడా నటించారు.

ఈ ఏడాది రవికిషన్ ‘మామ్లా లీగల్ హై సీజన్ 2’, ‘టాక్స్ డిపార్ట్‌మెంట్ స్టోరీ’, ‘మీర్జాపూర్: ది ఫిల్మ్’, ‘ధమాల్ 4’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. రవికిషన్ తెలుగులో రేసుగుర్రం, కిక్ 2, సుప్రీమ్ వంటి పలు తెలుగు సినిమాల్లో నటించారు. రేసుగుర్రం చిత్రంలో విలన్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు నటుడు రవికిషన్.

ఇక మాధురీ దీక్షిత్ గతేడాది ‘భూల్ భులయ్యా 3’లో కీలక పాత్రలో మెరిశారు. అంతకుముందు జియో హాట్‌స్టార్ ఓటీటీ సిరీస్ ‘మిసెస్ దేశ్‌పాండే’లో సీరియల్ కిల్లర్‌గా నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం మాధురి, రవి కిషన్ కలిసి నటించిన మా బెహన్ ఓటీటీ మూవీ టీజర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks