తీహార్ జైలు పోలీసులకు లొంగిపోయిన కిక్ 2 కమెడియన్- 2018 నాటి కేసులో షాక్- తప్పని జైలు శిక్ష, సాధారణ ఖైదీలానే జీవితం!

ప్రముఖ బాలీవుడ్ అగ్ర కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ గురువారం (ఫిబ్రవరి 5) ఢిల్లీలోని తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. చెక్ బౌన్స్ కేసులో జైలు శిక్ష అనుభవించాల్సి ఉండగా, లొంగుబాటు గడువును పెంచాలన్న ఆయన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.

Published on: Feb 6, 2026, 09:03:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ సీనియర్ నటుడు, స్టార్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ చిక్కుల్లో పడ్డారు. గత కొంతకాలంగా ఆయన్ని వేధిస్తున్న చెక్ బౌన్స్ కేసులో ఎట్టకేలకు రాజ్‌పాల్ యాదవ్ జైలు బాట పట్టాల్సి వచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం (ఫిబ్రవరి 5) సాయంత్రం 4 గంటలకు రాజ్‌పాల్ యాదవ్ తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. లొంగుబాటు గడువును పొడిగించేందుకు హైకోర్టు నిరాకరించడంతో రాజ్‌పాల్ యాదవ్‌కు జైలు శిక్ష తప్పలేదు.

తీహార్ జైలు పోలీసులకు లొంగిపోయిన కిక్ 2 కమెడియన్- 2018 నాటి కేసులో షాక్- తప్పని జైలు శిక్ష, సాధారణ ఖైదీలానే జీవితం!
తీహార్ జైలు పోలీసులకు లొంగిపోయిన కిక్ 2 కమెడియన్- 2018 నాటి కేసులో షాక్- తప్పని జైలు శిక్ష, సాధారణ ఖైదీలానే జీవితం!

న్యాయస్థానం ఏమందంటే?

బుధవారం జరిగిన విచారణలో రాజ్‌పాల్ యాదవ్ తరపు న్యాయవాది కోర్టుకు ఒక అభ్యర్థన చేశారు. తన క్లయింట్ రూ. 50 లక్షలు సిద్ధం చేశారని, మిగిలిన మొత్తాన్ని చెల్లించేందుకు మరో వారం రోజుల సమయం కావాలని కోరారు. అయితే, దీనిపై న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు.

"కేవలం ఒక వ్యక్తి ప్రత్యేక నేపథ్యం లేదా సినిమా రంగానికి చెందిన వాడు అన్న కారణంతో కోర్టు ప్రత్యేక నిబంధనలను సృష్టించలేదు. లౌక్యం లేదా ఉదారత చూపడం అవసరమే కావొచ్చు, కానీ నిరంతరం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించే వారికి ఆ గడువును అంతులేకుండా పొడిగించలేము" అని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

అసలేమిటీ కేసు?

ఫిబ్రవరి 2నే ఆయనకు లొంగిపోవాలని ఆదేశాలు ఇచ్చినా, గడువు కోరడాన్ని కోర్టు తప్పుబట్టింది. కాగా, మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ రాజ్‌పాల్ యాదవ్, ఆయన భార్యపై ఈ చెక్ బౌన్స్ కేసు పెట్టింది. వారు తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడంలో విఫలమవ్వడమే కాకుండా, ఇచ్చిన పలు చెక్కులు బౌన్స్ అయ్యాయని ఆ సంస్థ ఫిర్యాదు చేసింది.

కేసు ప్రక్రియ

2018: ఢిల్లీలోని మెజిస్ట్రియల్ కోర్టు రాజ్‌పాల్ దంపతులను దోషులుగా తేల్చి, నటుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

2019: సెషన్స్ కోర్టు కూడా ఈ శిక్షను సమర్థించింది.

2024 (జూన్): హైకోర్టు ఈ శిక్షపై తాత్కాలిక స్టే ఇచ్చి, బాధితులతో రాజీ పడాలని సూచించింది.

2026 (ఫిబ్రవరి 2): పదే పదే హామీలు ఇచ్చి కూడా డబ్బు చెల్లించకపోవడంతో, రాజ్‌పాల్ లొంగిపోవాలని హైకోర్టు తుది ఆదేశాలు జారీ చేసింది.

సాధారణ ఖైదీలకు వర్తించే నిబంధనలే

జైలు వర్గాల సమాచారం ప్రకారం.. గురువారం సాయంత్రం 4 గంటలకు రాజ్‌పాల్ జైలుకు చేరుకోగా, ఇప్పుడు ఆయనకు సాధారణ ఖైదీలకు వర్తించే నిబంధనలే అమలు కానున్నాయి. వెండితెరపై నవ్వులు పూయించే నటుడు రాజ్‌పాల్ యాదవ్ ఇప్పుడు 2018 నాటి పాత కేసులో ఇలా జైలు పాలవ్వడం ఆయన అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.

కిక్ 2 కమెడియన్

తీహార్ జైలులో సాధారణ ఖైదీలాంటే జీవితం గడపనున్న స్టార్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ జోడీగా నటించిన కిక్ 2 మూవీలో నటించారు. ఈ సినిమాతో ఆయన తెలుగులో పరిచయం అవడం విశేషం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More