సీనియర్ నటుడు, సూపర్‌స్టార్ మహేశ్ బాబు సోదరుడు నరేష్ ఇండిగో ఎయిర్ లైన్స్ సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను కుదిపేసిన సాంకేతిక లోపంపై తన అసంతృప్తిని, నిరాశను వ్యక్తం చేశారు. దీంతో ఇండిగో ఎయిర్ లైన్స్ బాధితుల్లో నరేష్ కూడా ఒకరని తెలిసింది.
సాంకేతిక లోపం కారణంగా

ఇండిగో ఎయిర్ లైన్స్ సాంకేతిక లోపం కారణంగా అనేక విమానాలు రద్దు కావడంతో పాటు, భారీగా ఆలస్యం అయ్యాయి. ఈ విషయంపై ఇటీవల నటుడు నరేష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఈ రోజుల్లో విమాన ప్రయాణం ఎంత కష్టంగా మారిందో, '90ల నాటితో పోలిస్తే' ప్రస్తుత సమస్యలు ఎలా ఉన్నాయో ఆయన వివరించారు.
నరేష్‌కు చేదు అనుభవం
తాజాగా నరేష్ ఒక వీడియోను పంచుకున్నారు. అందులో మూసివేసిన బోర్డింగ్ గేట్ల వద్ద భారీగా గుమిగూడిన ప్రయాణీకులు కనిపిస్తున్నారు. మరొక ఫోటోలో ఆయన మాస్క్ ధరించి ఉన్నారు. ఈ వీడియోను ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో పంచుకుంటూ అసంతృప్తి తెలిపారు.
"విమాన ప్రయాణంలో ఉండే సరదా 90ల కాలానికే పరిమితమైపోయింది. ఉదయం 8:15 గంటలకు హైదరాబాద్ ఇండిగో టెర్మినల్‌కు సమయానికి చేరుకున్నాను. కానీ అన్ని ఇండిగో విమానాలు ఆలస్యం అయ్యాయి. అప్పటికే ఫ్లైట్‌లో తినడానికి ఆహారం ప్యాక్ చేసుకున్నాను" అని నరేష్ తెలిపారు.
అపరిశుభ్రత తప్ప
"అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే.. గ్రౌండ్ సిబ్బందికి, ప్రయాణీకులకు మధ్య పూర్తిస్థాయి ఘర్షణ జరుగుతోంది. భయంకరమైన రద్దీ, అపరిశుభ్రత తప్ప మరొకటి లేదు. దుకాణాల దగ్గర షాపింగ్ చేసి తిరిగి రద్దీ దగ్గరకు వెళ్లినప్పుడు కూడా అక్కడ అలాగే గందరగోళంగా ఉంది" అంటూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించారు నరేష్.
సెల్ఫీల కోసం ఫ్యాన్స్ గోల
ఇదే వీడియోలో, కొందరు అభిమానులు సెల్ఫీ కోసం వీగే నరేష్‌ను సమీపించడం కూడా కనిపించింది. ఈ అంశంపై కూడా నరేష్ స్పందించారు. "పరిస్థితి ఇంకా దారుణంగా మారిందంటే.. మనుషుల్లో ఇప్పుడు కొత్త స్కానర్లు అభివృద్ధి అయ్యాయి. వారు సన్ గ్లాసెస్, మాస్క్‌లు ధరించిన నటులను కూడా సులభంగా గుర్తించగలుగుతున్నారు. ఏకాంతానికి అసలు చోటు లేదు" అని నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
{{/usCountry}}ఇదే వీడియోలో, కొందరు అభిమానులు సెల్ఫీ కోసం వీగే నరేష్‌ను సమీపించడం కూడా కనిపించింది. ఈ అంశంపై కూడా నరేష్ స్పందించారు. "పరిస్థితి ఇంకా దారుణంగా మారిందంటే.. మనుషుల్లో ఇప్పుడు కొత్త స్కానర్లు అభివృద్ధి అయ్యాయి. వారు సన్ గ్లాసెస్, మాస్క్‌లు ధరించిన నటులను కూడా సులభంగా గుర్తించగలుగుతున్నారు. ఏకాంతానికి అసలు చోటు లేదు" అని నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
{{/usCountry}}"నాకు ఒక టైమ్ మెషిన్ ఉండి ఉంటే.. నేను తిరిగి 90లకు వెళ్లిపోయేవాడిని. అప్పటి భారతీయ ఎయిర్‌లైన్స్ సురక్షితంగా, బాగుండేవి. ఇప్పుడు విమానాలు అన్నీ బ్యాక్టీరియా కేంద్రాలుగా మారిపోయాయి. అందుకే మాస్క్‌లు తప్పనిసరి" అంటూ తన పోస్ట్‌ను ముగించారు నటుడు వీగే నరేష్.
నరేష్ పర్సనల్ లైఫ్
ఇదిలా ఉంటే, నటుడు నరేష్ తల్లి విజయ నిర్మల, హీరో మహేష్ బాబు తండ్రి సూపర్ కృష్ణకు రెండో భార్య అని తెలిసిన విషయమే. నరేష్ పూర్తి పేరు విజయ కృష్ణ నరేష్. నరేష్ మొదటి భార్య రమ్య రఘుపతి కాగా నటి పవిత్ర లోకేష్‌ను 2023లో మరో వివాహం చేసుకున్నారు.
హీరోగా సినిమాల్లోకి అడుగుపెట్టిన నరేష్ ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. చివరిగా రవితేజ-శ్రీలీల జంటగా నటించిన మాస్ జాతర సినిమాలో కనిపించారు నటుడు నరేష్.