...
...
Next Story

JUONE App: ఆహారం నుంచి ఆరోగ్యం వరకు- ఒకే యాప్‌లో అన్ని రకాల సేవలు- జూవన్ సూపర్ యాప్ లాంచ్ చేసిన సీనియర్ హీరోయిన్ ఇంద్రజ

Actress Indraja Launch JUONE App: ఫుడ్ నుంచి డాక్టర్ సేవల వరకు అన్నీ రకాల సర్వీసులు ఒకే చోట ఉంటే.. అదే జూవన్ యాప్. హైదరాబాద్‌లోని పీర్‌లెస్ హోటల్‌లో జూవన్ సూపర్ యాప్‌ని నటి ఇంద్రజ లాంచ్ చేశారు. ‘కనెక్ట్‌, సర్వీసెస్‌, గ్రో’.. ‘వన్‌ యాప్‌, మెనీ సొల్యూషన్స్‌’ అంటూ వచ్చిన జూవన్ యాప్‌పై లుక్కేద్దాం.

Published on: Oct 26, 2026, 11:10:48 IST
Advertisement

Actress Indraja Launch JUONE App: రోజువారీ జీవితంలో ఎదురయ్యే అనేక అవసరాలకు వేర్వేరు యాప్‌లను ఉపయోగించే రోజులకు స్వస్తి పలుకుతూ.. అన్ని రకాల సేవలను ఒకే వేదికపై అందించాలనే లక్ష్యంతో రూపొందించిన ‘జూవన్’ (JUONE) సూపర్ యాప్‌ ఘనంగా ప్రారంభమైంది.

సీనియర్ హీరోయిన్ ఇంద్రజతోపాటు

ఆహారం నుంచి ఆరోగ్యం వరకు- ఒకే యాప్‌లో అన్ని రకాల సేవలు- జూవన్ సూపర్ యాప్ లాంచ్ చేసిన సీనియర్ హీరోయిన్ ఇంద్రజ
ఆహారం నుంచి ఆరోగ్యం వరకు- ఒకే యాప్‌లో అన్ని రకాల సేవలు- జూవన్ సూపర్ యాప్ లాంచ్ చేసిన సీనియర్ హీరోయిన్ ఇంద్రజ

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని పీర్‌లెస్ హోటల్‌లో ఈ గ్రాండ్ లాంచ్ కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రముఖ సీనియర్ హీరోయిన్, నటి ఇంద్రజ, ఏఎన్‌ఎన్ మీడియా గ్రూప్ వ్యవస్థాపకులు కంది రామచంద్రారెడ్డి, జబర్దస్త్ రాము, యాప్ బ్రాండ్ అంబాసిడర్ రాధిక ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో పాటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో కూడా ఈ యాప్ లాంచ్ అయింది. నగరాల్లో మాత్ర‌మే కాకుండా, సెమీ-అర్బన్, పట్టణ ప్రాంతాల్లో ‘జూవన్’ సూప‌ర్ యాప్ సేవలు అందుబాటులో వ‌చ్చాయి.

ఒకే యాప్‌.. ఎన్నో సేవలు!

‘కనెక్ట్‌, సర్వీసెస్‌, గ్రో’.. ‘వన్‌ యాప్‌, మెనీ సొల్యూషన్స్‌’ అనే నినాదాలతో ముందుకొచ్చిన జూవన్.. వినియోగదారుల రోజువారీ అవసరాలను సులభతరం చేసే లక్ష్యంతో విభిన్న సేవలను ఒకే డిజిటల్‌ వేదికపైకి తీసుకొచ్చింది. ఆహారం ఆర్డర్‌ చేయడం నుంచి నిత్యావసర సరుకులు తెప్పించుకోవడం వరకు, ప్రయాణాల కోసం క్యాబ్‌లు బుక్‌ చేసుకోవడం నుంచి హోటళ్లు, రిసార్టులు రిజర్వ్‌ చేసుకోవడం వరకు అనేక సౌకర్యాలను ఒకే యాప్‌ ద్వారా పొందేలా దీన్ని రూపొందించారు.

ఏఎన్‌ఎన్‌ మీడియా గ్రూప్‌ వ్యవస్థాపకులు కంది రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సాంకేతికతను ప్రజల అవసరాలకు అనుసంధానిస్తూ రూపొందించిన జూవన్ సూపర్‌ యాప్‌ ఆధునిక జీవనశైలికి అనుగుణంగా ఉందని అన్నారు. వివిధ సేవలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా వినియోగదారుల సమయాన్ని ఆదా చేయడంతో పాటు డిజిటల్‌ సేవలకు మరింత చేరువ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

జుఒన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ రాధిక మాట్లాడుతూ.. ఫుడ్‌ డెలివరీ, షాపింగ్‌, ప్రయాణం, ఆరోగ్యం, గృహ సేవలు వంటి అనేక అవసరాలకు ఒకే యాప్‌ అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు. 25 రకాల సర్వీసులు ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా రూపొందించిన జూవన్ సూపర్‌ యాప్‌ను ప్రజలు ఆదరించాలని, ఈ యాప్‌ మరింత అభివృద్ధి చెంది విస్తృత ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.

ఇంట్లో ఏ అవసరమొచ్చినా.. జూవన్!

ఫుడ్‌ డెలివరీ, గ్రాసరీ, ఫార్మసీ సేవలతో పాటు క్యాబ్‌ బుకింగ్‌, కార్లు–బైక్‌ల అద్దె, లాజిస్టిక్స్‌, ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌ సేవలు ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. హోటళ్లు, రిసార్టులు, ఈవెంట్లు, పర్యాటక సేవలు, హాస్టళ్లు, పీజీ వసతి బుకింగ్‌ సౌకర్యాలు కూడా ఉన్నాయి. షాపింగ్‌, బ్యూటీ పార్లర్‌, ఇంటి శుభ్రత, పెస్ట్‌ కంట్రోల్‌, ప్లంబింగ్‌, ఎలక్ట్రికల్‌, ఏసీ సర్వీసులతో పాటు కంప్యూటర్‌, మొబైల్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాల మరమ్మతు సేవలను పొందవచ్చు.

ఆరోగ్యానికి సంబంధించిన అవసరాల కోసం డాక్టర్‌ కన్సల్టేషన్‌, ల్యాబ్‌ టెస్టులు, నర్సింగ్‌ సేవలను కూడా అందించేలా యాప్‌ను రూపొందించారు. ఇలా వ్యక్తిగత అవసరాల నుంచి కుటుంబ అవసరాల వరకు 25 రకాల సేవలను ఒకే చోట అందించడం జూవన్ ప్రత్యేకతగా నిలవనుంది.

ఫుడ్ నుంచి డాక్టర్ సేవల వరకు

ఆహారం, ప్రయాణం, ఆరోగ్యం, ఇంటి అవసరాలు.. ఇలా జీవితంలోని విభిన్న అవసరాలకు ఒకే డిజిటల్‌ చిరునామాగా నిలవాలనుకుంటున్న జూవన్ సూపర్‌ యాప్‌, వినియోగదారులకు మరింత సులభమైన, సౌకర్యవంతమైన సేవల అనుభవాన్ని అందించే దిశగా అడుగులు వేస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks