Kayadu Lohar About Women Objectification: తెలుగులో కూడా హీరోయిన్‌గా ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది బ్యూటిఫుల్ కయాదు లోహర్. రీసెంట్‌గా వరుసపెట్టి సినిమాలతో దూసుకుపోతోంది ఈ ఫంకీ భామ. ఇటీవల దుల్కర్ సల్మాన్ ఐయామ్ గేమ్ సినిమాలో అలరించిన కయాదు లోహర్ నేచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే.
సంగీత దర్శకుడు హీరోగా

అయితే, తాజాగా సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన 'ఇమ్మోర్టల్' చిత్రం విడుదల తర్వాత హీరోయిన్ కయాదు లోహర్ ఇండస్ట్రీలోని ఒక సున్నితమైన అంశంపై నోరు విప్పారు.
గ్లామర్ బొమ్మలుగా చూపించడం
ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో సినిమాల్లో మహిళలను కేవలం ఆకర్షణీయమైన వస్తువుగా (Objectification) చూపించడంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమవుతున్నాయి. సినిమాల్లో హీరోయిన్ల పాత్రలను చిత్రీకరించే తీరుపై కయాదు తన మనసులోను మాటను బయటపెట్టారు.
అలా చూపించడం నాకు నచ్చదు!
"కేవలం ఆకర్షణ కోసం నటీమణులను వస్తువుగా చూపించడం నాకు ఎప్పటికీ నచ్చదు. కథకు, పాత్రకు నిజంగా అవసరమైతే ఒక పరిమితి వరకు ఓకే. కానీ కేవలం సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కోసం మాత్రమే గ్లామర్ ప్రదర్శన చేయమంటే నేను కచ్చితంగా నో చెప్తాను" అని కాయదు లోహర్ తెగేసి చెప్పారు.
షూటింగ్ సెట్స్‌లో పోరాటం కష్టం!
తాత్కాలికంగా వచ్చే ఫేమ్ కోసం తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రసక్తే లేదని కయాదు లోహర్ స్పష్టం చేశారు. సినిమా చిత్రీకరణ సమయంలో ఇటువంటి సన్నివేశాలను వ్యతిరేకించడం ఎంత కష్టమో కూడా కయాదు లోహర్ వివరించారు.
ఒక్కరమే పోరాడాల్సి వస్తుంది
"ఇలాంటి సీన్ల గురించి దర్శకులు లేదా మేకర్స్‌తో మాట్లాడటం చాలా కష్టమైన విషయం. సెట్లో మిగతా వాళ్లంతా ఇది మామూలే కదా అని సమర్థిస్తుంటే.. ఒక్కరమే (హీరోయిన్స్) దానిపై పోరాడాల్సి వస్తుంది. కానీ, మన సిద్ధాంతానికి కట్టుబడి ఉండక తప్పదు. ఇప్పుడు ప్రేక్షకుల ఆలోచనా విధానం కూడా మారుతోంది. కథకు సంబంధం లేని గ్లామర్ సీన్లను వీక్షకులు తిరస్కరిస్తున్నారు" అని కయాదు లోహర్ పేర్కొన్నారు.
'పెద్ది' వివాదాన్ని గుర్తుచేసిన కయాదు?
{{/usCountry}}"ఇలాంటి సీన్ల గురించి దర్శకులు లేదా మేకర్స్‌తో మాట్లాడటం చాలా కష్టమైన విషయం. సెట్లో మిగతా వాళ్లంతా ఇది మామూలే కదా అని సమర్థిస్తుంటే.. ఒక్కరమే (హీరోయిన్స్) దానిపై పోరాడాల్సి వస్తుంది. కానీ, మన సిద్ధాంతానికి కట్టుబడి ఉండక తప్పదు. ఇప్పుడు ప్రేక్షకుల ఆలోచనా విధానం కూడా మారుతోంది. కథకు సంబంధం లేని గ్లామర్ సీన్లను వీక్షకులు తిరస్కరిస్తున్నారు" అని కయాదు లోహర్ పేర్కొన్నారు.
'పెద్ది' వివాదాన్ని గుర్తుచేసిన కయాదు?
{{/usCountry}}కయాదు లోహర్ ఏ సినిమా పేరు సూటిగా చెప్పకపోయినప్పటికీ, ఇటీవల రామ్ చరణ్ - బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వచ్చిన 'పెద్ది' సినిమా వివాదాన్ని ఆమె పరోక్షంగా ప్రస్తావించారని నెటిజన్లు భావిస్తున్నారు. ఆ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను చూపించిన విధానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
పెద్ది సినిమా గురించేనంటూ
ప్రేక్షకులలో వచ్చిన వ్యతిరేకత కారణంగా మేకర్స్ ఆ సన్నివేశాలను విడుదలైన రెండు వారాల తర్వాత సినిమా నుంచి తొలగించిన విషయం తెలిసిందే. కయాదు చేసిన వ్యాఖ్యలు సరిగ్గా ఈ ఘటనను ఉద్దేశించినవేనని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కయాదు లోహర్ సినిమాలు
ఇటీవల దుల్కర్ సల్మాన్ 'ఐయామ్ గేమ్', అలాగే విశ్వక్ సేన్ 'ఫంకీ' వంటి చిత్రాలతో అలరించిన ముద్దుగుమ్మ కయాదు లోహర్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. సూర్య 48వ ప్రాజెక్ట్‌తో పాటు 'ది ప్యారడైజ్', 'తారమ్', 'మంజనాత్తి' వంటి క్రేజీ చిత్రాలలో కయాదు లోహర్ కీలక పాత్రలు పోషిస్తోంది.