Sobhita Dhulipala About Telugu People Psychology: తెలుగు మూలాలున్న హీరోయిన్స్ టాలీవుడ్‌లో రాణించడం అరుదనే భావన చాలాకాలంగా ఉంది. అలాంటి పరిమితులను అధిగమించి, బాలీవుడ్ నుంచి హాలీవుడ్ ప్రాజెక్టుల వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అక్కినేని వారి ఇంటి కోడలు, నటి శోభిత ధూళిపాళ.
అసలేం జరిగింది?

అయితే, మన సొంత సమాజంలో ఉన్న ఒక ప్రతికూల ధోరణిపై తాజాగా శోభిత ధూళిపాళ చేసిన వ్యాఖ్యలు డిజిటల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. హైదరాబాద్‌కు చెందిన అహల్య అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఇటీవల ఒక వీడియో పోస్ట్ చేశారు.
ప్రోత్సహించుకునే అలవాటు చాలా తక్కువ
"తెలుగువారికి ఇంకొక తెలుగువారే అతిపెద్ద శత్రువు. మన సమాజంలో ఒకరినొకరు ప్రోత్సహించుకునే అలవాటు చాలా తక్కువ. ఎవరైనా కొత్త వ్యాపారం ప్రారంభించినా, వినూత్నంగా ఏదైనా ప్రయత్నించినా.. వారికి మద్దతు ఇవ్వడం మానేసి, అందులో గొప్పతనం ఏముంది అని ప్రశ్నించడమే ఎక్కువ" అని ఆ వీడియోలో అహల్య పేర్కొన్నారు.
16 ఏళ్లకే ఇల్లు వదిలి వెళ్లాను: శోభిత ఆవేదన
సినిమాలు, సంస్కృతి గురించి గొప్పగా చెప్పుకునే మనం, తోటి వారి ఎదుగుదలను మాత్రం మనస్ఫూర్తిగా కోరుకోమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్టుపై నటి శోభిత ధూళిపాళ స్పందిస్తూ '100' పర్సెంట్ ఎమోజీతో పూర్తిగా మద్దతు తెలిపారు. అంతటితో ఆగకుండా తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు.
ఆడపిల్లల విషయంలో ఒత్తిడి రెట్టింపు ఉంటుంది
"మా ఊరి వాతావరణం కొత్తగా కలలు కనేవారిని, ప్రత్యేకించి వేరే రంగాల నుంచి వచ్చేవారిని తీవ్రంగా నిరుత్సాహపరిచేది. పైగా ప్రతీ విషయానికి తీర్పులు చెప్పే మనస్తత్వం ఎక్కువగా ఉండేది. ఆడపిల్లల విషయంలో ఈ ఒత్తిడి రెట్టింపు ఉంటుంది. అందుకే ఏ గ్యారంటీ లేకపోయినా 16 ఏళ్లకే నా బ్యాగ్ సర్దుకుని ముంబైకి వెళ్లిపోయాను" అని శోభిత వ్యాఖ్యానించారు.
కాస్త వెన్నుముకతో నిలబడాలని
అప్పట్లో తనకు ఎదురైన పరిస్థితులను వివరిస్తూ.. "ఇప్పుడు పరిస్థితులు మారాయని ఆశిస్తున్నాను. మన తెలుగు సమాజం తన రెక్కలను విప్పుకుని, కాస్త వెన్నుముకతో నిలబడాలని కోరుకుంటున్నాను" అని ఘాటు వ్యాఖ్యలు చేశారు శోభిత ధూళిపాళ.
తెనాలి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు..
{{/usCountry}}అప్పట్లో తనకు ఎదురైన పరిస్థితులను వివరిస్తూ.. "ఇప్పుడు పరిస్థితులు మారాయని ఆశిస్తున్నాను. మన తెలుగు సమాజం తన రెక్కలను విప్పుకుని, కాస్త వెన్నుముకతో నిలబడాలని కోరుకుంటున్నాను" అని ఘాటు వ్యాఖ్యలు చేశారు శోభిత ధూళిపాళ.
తెనాలి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు..
{{/usCountry}}ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో జన్మించిన శోభిత, విశాఖపట్నంలో పెరిగారు. తండ్రి వేణుగోపాలరావు మర్చంట్ నేవీ ఇంజినీర్ కాగా, తల్లి శాంత కామాక్షి ఉపాధ్యాయురాలు. కార్పొరేట్ లా చదివిన శోభిత, 2013లో మిస్ ఎర్త్ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.
రామన్ రాఘవ్ 2.0 సినిమాతో
ఆ తర్వాత అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన 'రామన్ రాఘవ్ 2.0' సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేశారు శోభిత ధూళిపాళ. అనంతరం అడవి శేష్ హీరోగా వచ్చిన 'గూఢచారి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ, 'మేడ్ ఇన్ హెవెన్', 'ది నైట్ మేనేజర్' వంటి అంతర్జాతీయ స్థాయి ఓటీటీ వెబ్ సిరీస్‌లు చేశారు.
హైదరబాదీ కోడలిగా
అలాగే మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' చిత్రంలో కీలక పాత్ర పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు శోభిత ధూళిపాళ. ఇక శోభిత ధూళిపాళ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే, 2024 డిసెంబర్‌లో హీరో అక్కినేని నాగ చైతన్యను వివాహం చేసుకుని హైదరాబాదీ కోడలిగా స్థిరపడ్డారు.