...
...
Next Story

Surekha Vani: నటి సురేఖ వాణి ఏజ్ గ్యాప్ రిలేషన్‌షిప్- లీకైన పర్సనల్ వీడియో- డీప్ ఫేక్ కాదు!

Actress Surekha Vani Age Gap Relation Video: తెలుగు పాపులర్ నటి సురేఖ వాణి తనకంటే చిన్న వయసున్న యువకుడితో కనిపిస్తున్న పర్సనల్ వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసి వెంటనే డిలీట్ చేసిన ఈ వీడియోలపై నటి సురేఖ క్లారిటీ కూడా ఇచ్చారు.

Published on: Nov 7, 2026, 12:13:53 IST
Advertisement

Actress Surekha Vani Age Gap Relation Video: ప్రముఖ టాలీవుడ్ నటి సురేఖ వాణిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తనకంటే తక్కువ వయసున్న యువకుడితో ఆమె అత్యంత సన్నిహితంగా ఉన్నట్లు కనిపిస్తున్న కొన్ని వీడియో క్లిప్పులు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

నటి సురేఖ వాణి ఏజ్ గ్యాప్ రిలేషన్‌షిప్- లీకైన పర్సనల్ వీడియో- డీప్ ఫేక్ కాదు!
నటి సురేఖ వాణి ఏజ్ గ్యాప్ రిలేషన్‌షిప్- లీకైన పర్సనల్ వీడియో- డీప్ ఫేక్ కాదు!

ఆమె ఆ వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి, కొద్దిసేపటికే తొలగించడంతో నెటిజన్లలో అనేక అనుమానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఆ క్లిప్పులు వివిధ ఖాతాల ద్వారా డిజిటల్ వేదికలపైకి చేరాయి. తనకంటే చిన్నోడితో ఏ ఏజ్ గ్యాప్ రిలేషన్ ఏంటని నెట్టింట్లో చర్చించుకుంటున్నారు.

డీప్‌ఫేక్ వేధింపులా? వ్యక్తిగత స్వేచ్ఛా?

అయితే, ఈ వీడియోలు వెలుగులోకి రాగానే సోషల్ మీడియా రెండు వర్గాలుగా విడిపోయింది. పెళ్లి ఈడుకొచ్చిన కూతురు ఉన్న సమయంలో ఇలాంటి వీడియోలు ఏమిటంటూ కొందరు విమర్శలు గుప్పిస్తుంటే, మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఒకరి వ్యక్తిగత జీవితం, ఇష్టాయిష్టాలతో ఇతరులకు సంబంధం లేదని, నచ్చినట్లు జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ మధ్యకాలంలో రష్మిక మందన్నా, కత్రినా కైఫ్ వంటి నటీమణులను సైతం వేధించిన డీప్‌ఫేక్ (AI Deepfake) సాంకేతికత మళ్లీ పంజా విసిరిందా అనే కోణంలో కూడా సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను ఉపయోగించి సెలబ్రిటీల ముఖాలను ఇతరుల శరీరాలకు అతికించి ప్రచారం చేయడం ఇటీవల ఎక్కువైంది.

సురేఖ వాణి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్

"నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. నా ప్రేవేట్, పర్సనల్ విషయాలు నా కన్సెంట్ లేకుండా బయటకు వచ్చాయి. ఆ వీడియోలను షేర్ చేయొద్దని, పోస్ట్ చేయొద్దని మీమ్ పేజెస్, మీడియా, ప్రెస్, యూట్యూబ్ ఛానెల్స్ అందరిని కోరుతున్నాను. నా ప్రైవేట్ కంటెంట్‌ను ఎవరైనా షేర్ చేసినట్లు తెలిస్తే మాత్రం లీగల్ యాక్షన్ తీసుకుంటా" అని సురేఖ వాణి రాసుకొచ్చారు.

రీచ్, పబ్లిసిటీ కోసం

"దయచేసి ఈ పరిణామాన్ని వ్యూస్, రీచ్, పబ్లిసిటీ కోసం అడ్వాంటేజ్‌గా తీసుకోకండి. నా ప్రైవసీని గౌరవించండి. ఇది చాలా సీరియస్ విషయం. నేను లీగల్ యాక్షన్ తీసుకోడానికి ఏమాత్రం ఆలోచించను" అని సురేఖ వాణి కోరారు. సురేఖ వాణి పోస్టుతో వైరల్ అవుతోన్న ప్రైవేట్ వీడియో ఫేక్ కాదు నిజమే అని క్లారిటీ వచ్చింది.

కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియా సందడి

ఇదిలా ఉంటే, సురేఖ వాణి తెలుగు వెండితెరపై అక్క, చెల్లి, తల్లి వంటి వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో మెరిసిన ఈ నటి, ఇటీవల వెండితెరపై కాస్త వేగం తగ్గించినప్పటికీ సోషల్ మీడియా ద్వారా మాత్రం అలరిస్తున్నారు.

సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా డిజిటల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తల్లికూతుళ్లు ఇద్దరూ కలిసి చేసే రీల్స్, ఫోటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం సుప్రీత కూడా ఓటీటీ ‌సిరీస్‌లు, సినిమాలతో పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks