Adbhut OTT Release After 2 Years From TV Premiere: విలక్షణ నటుడు, సైంధవ్ విలన్ నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన క్రైమ్, హారర్ చిత్రాలకు ఓటీటీల్లో ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. తెలుగు ఓటీటీ ప్రియులు మిస్టరీ, సూపర్ నేచురల్, హారర్ అంశాలతో కూడిన కథలను అమితంగా ఇష్టపడతారు.
ఓటీటీలోకి టీవీ ప్రీమియర్ హారర్ థ్రిల్లర్

ఈ క్రమంలోనే గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తూ వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీ అద్భుత్ ఓటీటీలోకి ఎట్టకేలకు వచ్చేసింది. రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అద్భుత్ ఓటీటీ రిలీజ్ అయింది. మొదట థియేటర్లలో కాకుండా నేరుగా బుల్లితెరపై టీవీ ప్రీమియర్ అయిన అద్భుత్ ఓటీటీ స్ట్రీమింగ్ అయింది.
అద్భుత్ చిత్రానికి 'హీరోపంతి', 'బాఘి', 'మున్నా మైఖేల్' వంటి విజయవంతమైన మాస్ యాక్షన్ చిత్రాలను తెరకెక్కించిన సబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. సాధారణంగా భారీ థియేట్రికల్ రిలీజ్‌లకే ప్రాధాన్యం ఇచ్చే సబ్బీర్ ఖాన్, ఈసారి పూర్తి భిన్నమైన సూపర్ నేచురల్ మిస్టరీ కథాంశాన్ని ఎంచుకున్నారు.
'సోనీ మ్యాక్స్' టీవీ ఛానెల్‌లో నేరుగా ప్రసారం అయిన అద్భుత్ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీతో పాటు డయానా పెంటీ, శ్రేయా ధన్వంతరి, రోహన్ మెహ్రా ప్రధాన పాత్రలు పోషించారు.
అసలు కథేంటంటే?
ఇక అద్భుత్ కథ విషయానికి వస్తే, ప్రైవేట్ డిటెక్టివ్ గజరాజ్ అవస్థి (నవాజుద్దీన్ సిద్ధిఖీ) పోలీస్ శాఖ నుంచి సన్మానం అందుకునే ఘట్టంతో సినిమా ప్రారంభమవుతుంది. తన కెరీర్‌లోనే అత్యంత క్లిష్టమైన కేసు గురించి అడిగినప్పుడు, ఐదేళ్ల క్రితం షిమ్లా కొండల్లో జరిగిన ఒక విచిత్రమైన సంఘటనను అతను గుర్తుచేసుకుంటాడు.
గుడ్ లైఫ్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ ఆదిత్య రావత్ (రోహన్ మెహ్రా), అతని భార్య డాక్టర్ శ్రుతి రావత్ (శ్రేయా ధన్వంతరి) షిమ్లా సమీపంలోని కొండ ప్రాంతంలో ఉన్న ఒక ఇంట్లోకి షిఫ్ట్ అవుతారు. శ్రుతి తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతూ మెడిసిన్ వాడుతుంటుంది. మరోవైపు కొత్త ఇంట్లోకి వెళ్లిన కొద్ది రోజులకే అక్కడ ఊహించని భయానక సంఘటనలు మొదలవుతాయి.
{{/usCountry}}గుడ్ లైఫ్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ ఆదిత్య రావత్ (రోహన్ మెహ్రా), అతని భార్య డాక్టర్ శ్రుతి రావత్ (శ్రేయా ధన్వంతరి) షిమ్లా సమీపంలోని కొండ ప్రాంతంలో ఉన్న ఒక ఇంట్లోకి షిఫ్ట్ అవుతారు. శ్రుతి తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతూ మెడిసిన్ వాడుతుంటుంది. మరోవైపు కొత్త ఇంట్లోకి వెళ్లిన కొద్ది రోజులకే అక్కడ ఊహించని భయానక సంఘటనలు మొదలవుతాయి.
{{/usCountry}}ఒక అదృశ్య శక్తి ఆ దంపతులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. పరిణామాలు చేయి దాటిపోతుండటంతో ఆదిత్య, శ్రుతి కలిసి ప్రైవేట్ డిటెక్టివ్ గజరాజ్ అవస్థిని ఆశ్రయిస్తారు. రంగంలోకి దిగిన గజరాజ్ విచారణ ప్రారంభించినప్పటికీ, ఆ ఇంట్లో జరుగుతున్న భయానక పరిణామాల వెనుక అసలు కారణం ఏంటో వెంటనే కనిపెట్టలేకపోతాడు.
రహస్య మహిళ 'మేరీ' ఎవరు?
హాస్పిటల్‌కు సంబంధించిన ఒక వేడుకలో ఆదిత్య, శ్రుతి ప్రాణాలు తృటిలో తప్పించుకునే ప్రమాదం జరుగుతుంది. ఆ ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన గజరాజ్‌కు మేరీ మ్యాథ్యూస్ (డయానా పెంటీ) అనే అనుమానాస్పద మహిళ కనిపిస్తుంది. ఆమె సోషల్ మీడియా ఖాతాలు కానీ, వివరాలు కానీ ఎక్కడా లభించవు. అసలు ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలు గజరాజ్‌ను తీవ్ర గందరగోళానికి గురిచేస్తాయి.
లోతుగా పరిశోధించగా, గతంలో కొమాలో ఉన్న అమీ ఆర్. మ్యాథ్యూస్ అనే పేషెంట్ మృతికి డాక్టర్ ఆదిత్య, శ్రుతి కారణమనే షాకింగ్ నిజం బయటపడుతుంది. ఆ పాత ఘటనకు, ఇప్పుడు జరుగుతున్న పారానార్మల్ దాడులకు ఉన్న సంబంధం ఏంటి? మేరీ మ్యాథ్యూస్ అసలు నిజమా లేక ఆత్మ రూపమా? అనే ఉత్కంఠభరిత ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
అద్భుత్ ఓటీటీ స్ట్రీమింగ్
నవాజుద్దీన్ సిద్ధిఖీ మార్క్ సీరియస్ యాక్టింగ్, ఉత్కంఠ రేకెత్తించే స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన బలం. సాధారణంగా వచ్చే దెయ్యం సినిమాలాగ కాకుండా, సైకలాజికల్ థ్రిల్లర్, మిస్టరీ కోణంలో సబ్బీర్ ఖాన్ ఈ చిత్రాన్ని మలిచారు. ట్విస్టులు, సస్పెన్స్‌తో భయపెట్టే అద్భుత్ జియో హాట్‌స్టార్ ఓటీటీలో రిలీజ్ అయింది.
అక్టోబర్ 9 నుంచి జియోహాట్‌స్టార్‌లో అద్భుత్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో హారర్ థ్రిల్లర్ కంటెంట్‌ను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు జియో హాట్‌స్టార్ ఓటీటీలోని అద్భుత్ సినిమా మంచి వీకెండ్ వాచ్‌గా నిలుస్తుంది.