Laya Subbaraju Ala Jarigindi OTT Release Today: ఒకప్పుడు టాలీవుడ్ హోమ్లీ హీరోయిన్‌గా కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్న బ్యూటిఫుల్ నటి లయ మళ్లీ సరికొత్త డిజిటల్ ప్రయాణాన్ని ప్రారంభించింది.
ఓటీటీలోకి లయ ఎంట్రీ

ఇటీవల వెండితెరపై కమ్‌బ్యాక్ ఇచ్చిన లయ తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. నితిన్ తమ్ముడు, బిగ్ బాస్ శివాజీ సాంప్రదాయని సుప్పిని సుద్ధపూసని, జగపతి బాబు వదలా సినిమాలతో సందడి చేసిన లయ టాలీవుడ్ సీనియర్ నటుడు సుబ్బరాజుతో జత కట్టిన ఓటీటీ సినిమా అలా జరిగింది.
డిఫరెంట్ వేరియేషన్స్‌తో హీరో హీరోయిన్
అలా జరిగింది సినిమాలో లయ శాడిస్ట్ కోడలిగా, స్కూల్ టీచర్‌గా, తల్లిగా డిఫరెంట్ వేరియేషన్స్‌తో కనిపించింది. నటుడు సుబ్బరాజు కూడా లయ వెంట పడే లవర్ బాయ్‌గా, బాధ్యతగల కొడుకుగా, తండ్రిగా విభిన్న షేడ్స్‌లో అలరించాడు.
అసలు కథేంటంటే?
సరిత (లయ) ఒక ఆత్మాభిమానం కలిగిన స్కూల్ టీచర్. ఆమె తన టీనేజ్ పిల్లలను మొదటిసారి ప్రేమించిన పార్క్‌కు తీసుకెళ్తుంది. పిల్లలకు ఎప్పుడూ తెలియని తన జీవితంలో జరిగిన ఒక సీక్రెట్ లవ్ స్టోరీ గురించి చెబుతుంది. ఒక విభిన్నమైన ప్రేమతో మొదలైన సరిత ప్రయాణం పెళ్లి, కుటుంబం, త్యాగం, గుండెకోత, నిలదొక్కుకునే మనోధైర్యం వైపు ఎలా సాగింది అనే అంశాలతో కథ నడుస్తుంది.
సుబ్బరాజు ఈ చిత్రంలో లయ భర్తగా కీలక పాత్రలో నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఎమోషనల్‌గా సాగుతూ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి. వినీష, నిఖితా రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు.
టెక్నికల్ అంశాలు- ఓటీటీ స్ట్రీమింగ్
{{/usCountry}}సుబ్బరాజు ఈ చిత్రంలో లయ భర్తగా కీలక పాత్రలో నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఎమోషనల్‌గా సాగుతూ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి. వినీష, నిఖితా రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు.
టెక్నికల్ అంశాలు- ఓటీటీ స్ట్రీమింగ్
{{/usCountry}}అలా జరిగింది చిత్రానికి సంతోష్ అన్నాపర్తి దర్శకత్వం వహించడమే కాకుండా స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూర్చారు. కొవెలకుడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించారు. రవి నిడమర్తి అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలలోని డెప్త్‌ను పెంచగా, సునీల్ కుమార్ నామా కెమెరా పనితనం విజువల్స్‌కు మరింత అందాన్ని తెచ్చింది.
అభినవ్ వి కునాపరెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఇలా మంచి ఫ్యామిలీ ఎమోషనల్ లవ్ స్టోరీ అంశాలతో సాగే అలా జరిగింది ఓటీటీలోకి ఇవాళ (సెప్టెంబర్ 20). ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో అలా జరిగింది ఓటీటీ రిలీజ్ అయింది. ఈటీవీ విన్ కథా సుధలో భాగంగా నేటి నుంచి ఈటీవీ విన్‌లో అలా జరిగింది ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
అలా జరిగింది ఓటీటీ రిలీజ్ ప్రకటన
"ప్రేమ, కుటుంబం, త్యాగం మేళవింపుగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రతి గుండెను తాకుతుంది. 'అలా జరిగింది' చిత్రం సెప్టెంబర్ 20 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ప్రసారం కానుంది" అని చిత్ర బృందం చెప్పుకొచ్చింది.
ఓటీటీలో కుటుంబ కథల వెల్లువ
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ల హోరు ఎక్కువైన ఈ రోజుల్లో ఈటీవీ విన్ కుటుంబ సమేతంగా చూడదగ్గ స్వచ్ఛమైన కథలను అందిస్తోంది. 'కథా సుధ' వేదికపై వస్తున్న ఈ చిత్రం సైతం ప్రతి కుటుంబానికి కనెక్ట్ అయ్యే భావోద్వేగాలతో తెరకెక్కింది. సరితతో పాటు పిల్లల అనుబంధం, గతం తాలూకు జ్ఞాపకాలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా రూపొందించారని తెలుస్తోంది.