Ali Baba Aur 40 Bhoot OTT Streaming Today: మిస్టరీ, హర్రర్ అంశాలకు కాస్త హాస్యం తోడైతే వచ్చే థ్రిల్లే వేరు. డిజిటల్ తెరపై అలాంటి సరికొత్త వినోదాన్ని పంచేందుకు ఇవాళ (సెప్టెంబర్ 11) ఒక క్రేజీ హారర్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రతీ విషయానికి విజ్ఞాన శాస్త్ర ఆధారాలను మాత్రమే వెతికే ఒక సైకాలజిస్ట్, దెయ్యాలు-ఆత్మలు ఉన్నాయని గట్టిగా నమ్మే ఒక చిన్న ఊరి సీఐ కలిసి చేసే భయానక అన్వేషణ ఆధారంగా 'అలీ బాబా ఔర్ 40 భూత్' (Ali Baba aur 40 Bhoot) అనే వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంది.
కథ నేపథ్యం ఏంటి?
మధ్య భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న జానపద కథలు, రహస్య ఆధారంగా ఈ కథను మలిచారు. ఆశా నేగి ‘అలీషా అలియాస్ అలీ’ అనే న్యూరో-సైకాలజిస్ట్ పాత్ర పోషించగా, విశాల్ వశిష్ట ‘బాబారావ్ దేశ్‌ముఖ్ అలియాస్ బాబా’ అనే ధైర్యవంతుడైన పోలీస్ అధికారిగా కనిపించనున్నారు.
హఠాత్తుగా మాయమైన తన తండ్రి ఆచూకీ కోసం వెతుకుతూ అలీ ఒక మాయా ప్రపంచంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఆమెకు స్థానిక పోలీస్ అధికారి బాబా పరిచయమవుతాడు. సైన్స్‌తో ప్రతీ దాన్ని విశ్లేషించే అలీ ఒకవైపు, దెయ్యాల ఉనికిపై నమ్మకం ఉన్న బాబా మరోవైపు ఉంటారు.
40 దెయ్యాలను ఎదుర్కొనే జంట
పూర్తిగా భిన్నమైన ఆలోచనా ధోరణులు కలిగిన ఈ ఇద్దరూ కలిసి ఒక శతాబ్దాల నాటి రహస్యాన్ని ఛేదించే క్రమంలో 40 వేర్వేరు దెయ్యాలను ఎదుర్కొంటారు. ప్రతీ దెయ్యానికి ఒక నేపథ్యం, దానికి ముడిపడి ఉన్న రహస్యం ఉండటంతో కథనం ఉత్కంఠభరితంగా సాగుతుంది.
అలాగే, ఆ 40 దెయ్యాలు 40 బొమ్మల్లో ఉంటాయి. ఒక్కో బొమ్మ నుంచి వచ్చే కథగా 40 ఎపిసోడ్లను ప్లాన్ చేశారు. ఇప్పటివరకు అలీబాబా 40 దొంగల కథ విన్నాం. ఇదే క్రమంలో 40 అనే నెంబర్ కథకు కొత్తగా దెయ్యాలతో సాగే హారర్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
అలీ బాబా ఔర్ 40 భూత్ ఓటీటీ స్ట్రీమింగ్
{{/usCountry}}అలాగే, ఆ 40 దెయ్యాలు 40 బొమ్మల్లో ఉంటాయి. ఒక్కో బొమ్మ నుంచి వచ్చే కథగా 40 ఎపిసోడ్లను ప్లాన్ చేశారు. ఇప్పటివరకు అలీబాబా 40 దొంగల కథ విన్నాం. ఇదే క్రమంలో 40 అనే నెంబర్ కథకు కొత్తగా దెయ్యాలతో సాగే హారర్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
అలీ బాబా ఔర్ 40 భూత్ ఓటీటీ స్ట్రీమింగ్
{{/usCountry}}ఇలాంటి అలీబాబా ఔర్ 40 భూత్ ఓటీటీలోకి నేడు వచ్చేసింది. జియో హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 11 నుంచి అలీబాబా ఔర్ 40 భూత్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. హిందీలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం వంటి నాలుగు భాషల్లో హాట్‌స్టార్‌లో అలీబాబా ఔర్ 40 భూత్ ఓటీటీ రిలీజ్ అయింది.
అయితే, మొత్తం 40 ఎపిసోడ్స్ ఉన్న ఈ ఓటీటీ సిరీస్ నుంచి ఇవాళ మాత్రం కేవలం నాలుగింటిని రిలీజ్ చేశారు. ప్రతీ శుక్రవారం 4 కొత్త ఎపిసోడ్లను విడుదల చేసేలా ప్లాన్ చేశారు. ఇలా 10 వారాల పాటు అలీబాబా ఔర్ 40 భూత్ సిరీస్ సరికొత్తగా ఓటీటీ ప్రీమియర్ కానుందన్నమాట.
హీరో హీరోయిన్ల కామెంట్స్
అలీ బాబా ఔర్ 40 భూత్ ఓటీటీ రిలీజ్ సందర్భంగా తన పాత్ర విశేషాలను హీరోయిన్ ఆశా నేగి పంచుకుంది. "నేను ఇప్పటివరకు చేసిన పాత్రలకు అలీ పూర్తిగా భిన్నమైనది. ప్రతీ దానికి ఒక లాజిక్ కారణం వెతికే ఆలోచనా విధానం ఉన్న అమ్మాయి. అలాంటి వ్యక్తి ఒక అలౌకిక ప్రపంచంలోకి అడుగుపెడితే ఎలా ఉంటుందో ఇందులో చూపించాం" అని ఆశా నేగి చెప్పుకొచ్చింది.
అలాగే, హీరో విశాల్ వశిష్ట మాట్లాడుతూ.. "బాబా పాత్రను పోషించడం నాకు మంచి ఉపశమనాన్ని ఇచ్చింది. మానసిక ఒత్తిడిని దూరం చేసేలా అతడి పాత్రలో ఒక ప్రత్యేకమైన ఎనర్జీ, వినోదం ఉంటాయి" అని పేర్కొన్నారు.
జియో హాట్‌స్టార్ ఓటీటీలో
భువనేష్ శ్రీవాస్తవ క్రియేటర్‌గా వ్యవహరించిన ఈ హారర్ కామెడీ సిరీస్‌లో ఆశా నేగి, విశాల్ వశిష్టలతో పాటు రామ్‌దీప్ యాదవ్, మీనాక్షి సేఠీ, ఆశిష్ కౌల్, ఉజ్వల్ చోప్రా, మానసి సెహగల్, మృదుల్ దాస్ ముఖ్య పాత్రల్లో నటించారు. థ్రిల్‌తో పాటు నవ్వులు కోరుకునే ఓటీటీ ప్రియులకు జియో హాట్‌స్టార్ ఓటీటీలో అలీబాబా ఔర్ 40 భూత్ మంచి ఎంటర్‌టైనర్‌గా నిలవనుంది.