...
...
Next Story

OTT Horror : ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ జాంబీ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సిరీస్ సీజన్ 2- ఏకంగా 560 మిలియన్ గంటల వ్యూస్!

All of Us Are Dead 2 OTT Streaming: ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సూపర్ హిట్ కొరియన్ జాంబీ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సిరీస్ ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్ సీజన్ 2 ఓటీటీలోకి వచ్చేయనుంది. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఆల్ అఫ్ అజ్ ఆర్ డెడ్ 2 ఓటీటీ స్ట్రీమింగ్‌పై లుక్కేద్దాం.

Published on: Oct 6, 2026, 12:59:58 IST
Advertisement

All of Us Are Dead Season 2 OTT Release: డిజిటల్ తెరపై ఓటీటీ ప్రియులను, కే-డ్రామా అభిమానులను తీవ్ర ఉత్కంఠకు గురిచేసిన కొరియన్ జాంబీ హారర్ సర్వైవల్ థ్రిల్లర్ 'ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్' రెండో సీజన్‌పై ఒక కీలక అప్‌డేట్ వచ్చింది. నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఊరటనిస్తూ ఈ ఓటీటీ సిరీస్ చిత్రీకరణ పూర్తయినట్లు ప్లాట్‌ఫామ్ వర్గాలు స్పష్టం చేశాయి.

ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ జాంబీ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సిరీస్ సీజన్ 2- ఏకంగా 560 మిలియన్ గంటల వ్యూస్!
ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ జాంబీ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సిరీస్ సీజన్ 2- ఏకంగా 560 మిలియన్ గంటల వ్యూస్!

ప్రస్తుతం ఈ ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్ 2 ఓటీటీ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మన దేశంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యధిక ఆదరణ పొందిన ఈ కొరియన్ వెబ్ సిరీస్ కొత్త సీజన్ విశేషాలు పరిశీలిద్దాం.

ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు? విడుదల ఆలస్యానికి కారణమేంటి?

2022 జనవరిలో నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అయిన ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్ సీజన్ 1 అంతర్జాతీయంగా భారీ విజయాన్ని సాధించింది. ఆ వెంటనే జూన్ 2022లో నెట్‌ఫ్లిక్స్ రెండో సీజన్‌ను అధికారికంగా ప్రకటించింది. జులై 2025లో చిత్రీకరణ ప్రారంభించారు.

2026 ఫిబ్రవరి నాటికి షూటింగ్ పూర్తయినప్పటికీ, భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ (VFX), గ్రాఫిక్స్, జాంబీ యాక్షన్ సీన్లు ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పడుతోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం నెట్‌ఫ్లిక్స్ ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ఇంకా ప్రకటించలేదు.

కానీ, 8 ఎపిసోడ్లతో రూపుదిద్దుకున్న ఈ రెండో సీజన్ 2027 ప్రారంభంలో, అంటే జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ప్రముఖ సినీ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. అంటే జనవరి ఎండింగ్, ఫిబ్రవరి స్టార్టింగ్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్ సీజన్ 2 ఓటీటీ రిలీజ్ కానుందని తెలుస్తోంది.

ఈసారి ప్లేస్ మార్చేశారు.. కథ సాగేది ఇక్కడే!

అదే సమయంలో సీయోల్ నగరంలో జాంబీ వైరస్ మళ్లీ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తుంది. విశ్వవిద్యాలయంలో ఓన్-జోకు యోంగ్ మా-రూ, సో జూ-రాన్, లీ జోంగ్-ఆ పరిచయమవుతారు. కొత్త వైరస్ నుంచి తమ ప్రాణాలను దక్కించుకోవడానికి వారు చేసే పోరాటమే ఈ సీజన్ 2 ప్రధానాంశం. దీనికి తోడు దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (NIS) టీమ్ లీడర్ హాన్ దూ-సోక్ పాత్ర కథలోకి ప్రవేశించడంతో కథనం మలుపు తిరుగుతుంది.

పాత గ్యాంగ్‌తో పాటు కొత్త ముఖాలు!

ఈ కొత్త సీజన్‌లో పాత నటీనటులతో పాటు కొందరు కొత్త నటులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. నామ్ ఓన్-జోగా పార్క్ జీ-హు, లీ చియాంగ్-సన్ పాత్రలో యూన్ చాంగ్-యాంగ్, చోయ్ నామ్-రాగా చో ఈ-హ్యూన్, లీ సు-హ్యేక్‌గా లోమోన్ తిరిగి అలరించనున్నారు.

వీరితో పాటు లీ మిన్-జే, కిమ్ సీ-యున్, రో జే-వోన్, యూన్ గా-ఈ కొత్త క్యారెక్టర్లలో కనిపించనున్నారు. రో జే-వోన్ ఎన్ఐఎస్ అధికారిగా నటించారు. ఈ ఓటీటీ సిరీస్‌కు లీ జే-క్యూ, కిమ్ నామ్-సూ దర్శకత్వం వహించగా, చున్ సుంగ్-ఇల్ రచయితగా వ్యవహరించారు.

రెండో సీజన్‌పై ఎందుకింత క్రేజ్?

ఒక సైన్స్ టీచర్ చేసిన ప్రయోగం వికటించి పాఠశాల అంతటా జాంబీ వైరస్ వ్యాపించడం, విద్యార్థులు ప్రాణాల కోసం పోరాడటం చుట్టూ సీజన్ 1 సాగింది. సగం మనుషులుగా, సగం జాంబీలుగా మారే 'హ్యాంబీ' కాన్సెప్ట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంటే, ఈ వైరస్ సోకితే పూర్తిగా జాంబీలుగా మారిపోతారు. కానీ, ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్‌లో మాత్రం మనిషికున్న తెలివితేటలు, సాధారణ మనిషిలా ప్రవర్తించే నైపుణ్యం కూడా జాంబీలకు ఉన్నట్లు చూపించిన తీరు ఆకట్టుకుంటుంది.

అందుకే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైన మొదటి 28 రోజుల్లోనే ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్ సీజన్ 1 ఏకంగా 560 మిలియన్ గంటల వీక్షణ సమయాన్ని నమోదు చేసుకుంది. అంతేకాకుండా 90కి పైగా దేశాల్లో టాప్ 10 ఓటీటీ ట్రెండింగ్‌లో నిలిచింది. దీంతో రెండో సీజన్‌పై అంచనాలు భారీగా పెరిగాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks