Alia Bhatt Alpha 1st Day Worldwide Box Office Collection: భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత భారీ ఫ్రాంచైజీగా గుర్తింపు తెచ్చుకున్న వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఆల్ఫా' (Alpha) జూలై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మొదటిసారి మహిళా గూఢచారిగా

ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అలియా భట్, ఈ క్రేజీ స్పై యూనివర్స్‌లో మొదటిసారి మహిళా గూఢచారిగా నటించడంతో ఆల్ఫా సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ఆశించిన స్థాయిలో సానుకూల స్పందన రాలేదు.
ఈ మిశ్రమ టాక్ ప్రభావం సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లపై స్పష్టంగా కనిపించింది. వైఆర్ఎఫ్ స్పై ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యంత తక్కువ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఆల్ఫా నిలిచింది.
ఇండియా కలెక్షన్స్
ప్రముఖ ట్రేడ్ విశ్లేషణ వెబ్‌సైట్ 'శాక్నిల్క్' అందించిన ప్రాథమిక గణాంకాల ప్రకారం.. ఆల్ఫా సినిమా మొదటి రోజు ఇండియా వ్యాప్తంగా రూ. 9.25 కోట్ల నెట్ కలెక్షన్స్‌ను సాధించింది. దేశవ్యాప్తంగా మొత్తం 7,534 షోలలో ఈ చిత్రం విడుదలైంది. భారీ స్థాయిలో థియేటర్లు దొరికినప్పటికీ, కథలో పెద్దగా కొత్తదనం లేకపోవడం, ఎమోషన్స్ పండకపోవడంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి అంతగా ఆసక్తి చూపించలేదు.
ఇండియాలో రూ. 9.25 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిన ఆల్పా సినిమాకు రూ. 11.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 5 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా అలియా భట్, శార్వరి వాఘ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆల్ఫా సినిమాకు తొలి రోజున రూ. 16.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి.
వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో మిగతా సినిమాల పరిస్థితి ఏంటి?
ఈ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో గతంలో వచ్చిన సినిమాలతో పోలిస్తే ఆల్ఫా వసూళ్లు చాలా తక్కువని చెప్పాలి. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో వచ్చిన 'వార్ 2' సినిమాకు కూడా నెగెటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ.. కేవలం ఎన్టీఆర్ క్రేజ్, భారీ అంచనాల వల్ల మొదటి రోజే ఇండియాలో ఏకంగా రూ. 52 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది.
{{/usCountry}}ఈ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో గతంలో వచ్చిన సినిమాలతో పోలిస్తే ఆల్ఫా వసూళ్లు చాలా తక్కువని చెప్పాలి. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో వచ్చిన 'వార్ 2' సినిమాకు కూడా నెగెటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ.. కేవలం ఎన్టీఆర్ క్రేజ్, భారీ అంచనాల వల్ల మొదటి రోజే ఇండియాలో ఏకంగా రూ. 52 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది.
{{/usCountry}}ఆ సినిమాను దేశవ్యాప్తంగా 19,455 షోలలో ప్రదర్శించారు. ఇక షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' సినిమా రూ. 57 కోట్ల నెట్ వసూళ్లతో ఈ యూనివర్స్‌లోనే ఆల్‌టైమ్ హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన రికార్డును తన పేరిట ఉంచుకుంది. వీటితో పోల్చి చూస్తే ఆల్ఫా సాధించిన రూ. 9 కోట్లు చాలా తక్కువ మొత్తమనే చెప్పాలి.
'జిగ్రా' కంటే బెటర్ కానీ..
అలియా భట్ గత చిత్రం 'జిగ్రా' (2024) బాక్సాఫీస్ ఓపెనింగ్స్‌తో పోలిస్తే ఆల్ఫా కొంత మెరుగైన ప్రదర్శన కనబరిచింది. జిగ్రా సినిమా మొదటి రోజు 5,779 షోల ద్వారా రూ. 4.55 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే సాధించింది. ఆ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా, దాదాపు రెండేళ్ల తర్వాత అలియా మళ్లీ ఆల్ఫాతో థియేటర్లలోకి అడుగుపెట్టింది.
హృతిక్ రోషన్ మెరుపులు..
జిగ్రా రికార్డును ఆల్ఫా దాటినప్పటికీ ఒక స్టార్ స్టడెడ్ స్పై ఫిల్మ్‌కు ఈ స్థాయి వసూళ్లు రావడం బాలీవుడ్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. శివ్ రావల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది మాత్రం హృతిక్ రోషనే. 'వార్' సిరీస్‌లో తను పోషించిన ఐకానిక్ 'కబీర్' పాత్రలో హృతిక్ ఇందులో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి థియేటర్లలో కాసేపు సందడి చేశారు.
శార్వరి డబుల్ ధమాకా
మరోవైపు హీరోయిన్ శార్వరికి ఈ నెలలోనే ఇది రెండో విడుదల కావడం విశేషం. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో శార్వరి వాఘ్ నటించిన 'మై వాపస్ ఆవుంగా' సినిమా ఇప్పటికీ థియేటర్లలో నడుస్తుండగానే, ఇప్పుడు ఆల్ఫా కూడా బరిలోకి దిగింది.