...
...
Next Story

OTT Horror Telugu: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన రివేంజ్ హారర్ థ్రిల్లర్- 8.1 రేటింగ్- దెయ్యం చేతికి చిక్కే ఫ్యామిలీ- ఎక్కడంటే?

OTT Horror Thriller Telugu Today: ఓటీటీలోకి ఇవాళ తెలుగు రివేంజ్ హారర్ థ్రిల్లర్ మూవీ అమరావతికి ఆహ్వానం స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ముగ్గురు ముద్దుగుమ్మలు ఎస్తేర్‌ నొరోన్హా, ధ‌న్య బాల‌కృష్ణ‌, సుప్రిత‌ నటించిన ఈ మూవీకి 8.1 రేటింగ్ ఉంది. మరి అమరావతికి ఆహ్వానం ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Mar 20, 2026, 05:21:01 IST
Advertisement

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు ప్రతి వారం సరికొత్త సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తూనే ఉంటాయి. వాటిలో ఎన్నో జోనర్స్, ఇతర భాషా సినిమాలు ఉన్నప్పటికీ తెలుగు కంటెంట్ మూవీస్, అందులోనూ హారర్ థ్రిల్లర్స్‌కు ఇచ్చే ఇంపార్టెన్స్ వేరు.

ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన రివేంజ్ హారర్ థ్రిల్లర్- 8.1 రేటింగ్- దెయ్యం చేతికి చిక్కే ఫ్యామిలీ- ఎక్కడంటే?
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన రివేంజ్ హారర్ థ్రిల్లర్- 8.1 రేటింగ్- దెయ్యం చేతికి చిక్కే ఫ్యామిలీ- ఎక్కడంటే?

పైగా హారర్ థ్రిల్లర్‌కు రివేంజ్, ఫ్యామిలీ, ఎమోషన్ అంశాలతో పాటు గ్లామర్ కూడా యాడ్ చేసి పర్‌ఫెక్ట్‌గా తెరకెక్కిస్తే అవి బాగా క్లిక్ అవుతాయి. దాదాపుగా అలాంటి తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీనే ఇవాళ (మార్చి 20) ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమానే అమరావతికి ఆహ్వానం.

ముగ్గురు ముద్దుగుమ్మలతో

తెలుగులో రివేంజ్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన అమరావతికి ఆహ్వానం సినిమాలు ముగ్గురు ముద్దుగుమ్మలు ఎస్తేర్‌ నొరోన్హా, ధ‌న్య బాల‌కృష్ణ‌, సుప్రిత‌ (నటి సురేఖ వాణి కూతురు) ప్రధాన పాత్రలు పోషించారు. వీరితోపాటు శివ కంఠమనేని హీరోగా అలరించారు. అలాగే, అశోక్ కుమార్‌, హ‌రీష్‌, భ‌ద్ర‌మ్‌, జెమినీ సురేష్ , నాగేంద్ర ప్రసాద్ ఇతర కీ రోల్స్ చేశారు.

దెయ్యం చేతిలో యూట్యూబర్ ఫ్యామిలీ

రివేంజ్, హారర్, ఫ్యామిలీ డ్రామా, సస్పెన్స్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. అలాగే, ఓ వైపు భయపెడుతూనే మరోవైపు ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్‌తో కాస్తా గ్లామర్ టచ్ కూడా అద్దారు. దెయ్యం చేతిలో ఓ యూట్యూబర్ ఫ్యామిలీ చిక్కే కథగా ఈ సినిమా సాగుతుంది.

ఐఎమ్‌డీబీ రేటింగ్

సస్పెండ్ అయిన సీఐ భార్యకు ఇద్దరు సిస్టర్స్ ఉంటారు. అందులో ఓ సిస్టర్ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తూ ఫేమస్ అవ్వాలనుకుంటుంది. ఈ క్రమంలో ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి వచ్చిన కాల్ ద్వారా అమరావతికి ఫ్యామిలీతో సహా చేరుకుంటుంది. ఆ గ్రామంలో దెయ్యాలనున్నాయనే బంగ్లాలోకి వెళ్తారు.

అమరావతికి ఆహ్వానం ఓటీటీ రిలీజ్

ఆ తర్వాత ఏమైంది? దెయ్యం చేతిలో చిక్కిన ఆ యూట్యూబర్ ఫ్యామిలీ ఏమైంది? సీఐ కుటుంబానికి ఆ దెయ్యానికి ఉన్న సంబంధం ఏంటీ? అనే విషయాలు తెలియాలంటే ఈ అమరావతికి ఆహ్వానం చూడాల్సిందే. ఇలాంటి ట్విస్టులు, హారర్ ఎలిమెంట్స్ ఉన్న అమరావతికి ఆహ్వానం ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది.

ఆహా ఓటీటీలో

థియేట్రికల్ రిలీజ్ అయిన సుమారు నెల తర్వాత అమరావతికి ఆహ్వానం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఆహాలో నేడు అమరావతికి ఆహ్వానం ఓటీటీ రిలీజ్ అయింది. ఫ్యామిలీ, రివేంజ్, హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇష్టపడే తెలుగు వారు ఆహా ఓటీటీలో అమరావతికి ఆహ్వానం సినిమాను ఎంచక్కా చూసేయొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks