OTT War: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో 460 కోట్ల సూపర్ హిట్ మూవీ- యుద్ధ వీరుల గాథ, 7.1 రేటింగ్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT War Action Drama Border 2 Release: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో రూ. 460 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టిన సూపర్ హిట్ మూవీ బోర్డర్ 2 స్ట్రీమింగ్ కానుంది. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహన్ శెట్టి నటించిన ఈ సినిమాకు 7.1 రేటింగ్ ఉంది. మరి బోర్డర్ 2 ఓటీటీ రిలీజ్ ఎక్కడో తెలుసుకుందాం.

Published on: Mar 19, 2026, 14:30:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ జేపీ దత్తా క్లాసిక్ ‘బోర్డర్’ మూవీకి సీక్వెల్‌గా ఈ ఏడాది జనవరిలో విడుదలైన ‘బోర్డర్ 2’ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం, ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని చూసేందుకు ఓటీటీ రిలీజ్ అవుతోంది.

ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో 460 కోట్ల సూపర్ హిట్ మూవీ- యుద్ధ వీరుల గాథ, 7.1 రేటింగ్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో 460 కోట్ల సూపర్ హిట్ మూవీ- యుద్ధ వీరుల గాథ, 7.1 రేటింగ్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బోర్డర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్

ఈ యుద్ధ వీరుల గాథను థియేటర్లలో మిస్ అయిన వారు లేదా మళ్లీ మళ్లీ చూడాలనుకునే వారి కోసం మరికొన్ని గంటల్లో బోర్డర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన బోర్డర్ 2 మూవీ వార్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కింది.

బోర్డర్ 2 మూవీలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, అహాన్ శెట్టి, దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. వీరితోపాటు సోమన్ బజ్వా, మేధా రాణా, మోనా సింగ్, ఆన్యా సింగ్, పరమ్‌వీర్ చీమ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

అత్యధిక వసూళ్లు సాధించిన యుద్ధ చిత్రం

2026 జనవరి 23న థియేటరల్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 464.5 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో హృతిక్ రోషన్ ‘ఫైటర్’, విక్కీ కౌశల్ ‘ఉరి’, అక్షయ్ కుమార్ ‘కేసరి’ వంటి చిత్రాలను అధిగమించి భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన వార్ ఫిల్మ్‌గా నిలిచింది.

1971 ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో సాగే ఈ కథలో.. ఆర్మీ మేజర్ హోషియార్ సింగ్ దహియాగా వరుణ్ ధావన్, నేవీ లెఫ్టినెంట్ కమాండర్ ఎంఎస్ రావత్‌గా అహాన్ శెట్టి, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ నిర్మల్ జిత్ సింగ్‌గా దిల్జీత్ దోసాంజ్ నటించారు. వారికి సీనియర్‌గా లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ కాలేర్ పాత్రలో సన్నీ డియోల్ మరోసారి తన గంభీరమైన నటనతో ఆకట్టుకున్నారు.

ఐఎమ్‌డీబీ రేటింగ్

రూ. 275 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన బోర్డర్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా ఐఎమ్‌డీబీలో పదికి 7.1 రేటింగ్ సైతం సాధించింది. ఇంత హిట్ అయిన బోర్డర్ 2 ఓటీటీలోకి వచ్చేయనుంది. మార్చి 20 నుంచి బోర్డర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

మార్చి 20 అర్థరాత్తి 12 గంటల నుంచే బోర్డర్ 2 ఓటీటీ ప్రీమియర్ అవనుంది. అంటే, దానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో బోర్డర్ 2 మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తాజాగా ఇవాళ (మార్చి 19) నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించేసింది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

దాంతోపాటు ఆసక్తికరమైన వీడియోను సైతం పంచుకుంది నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ. పాత ‘బోర్డర్’ మూవీలోని క్లాసిక్ సాంగ్ ‘ఘర్ కబ్ ఆవోగే’ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుండగా.. నెట్‌ఫ్లిక్స్ అని రాసి ఉన్న ఒక కవరు (Envelope) కనిపిస్తున్న వీడియోను షేర్ చేశారు.

నెట్‌ఫ్లిక్స్‌కు వచ్చేసింది

"చిల్టీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌కు వచ్చేసింది.. మార్చి 20 నుంచి ‘బోర్డర్ 2’ను వీక్షించండి" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్‌పై అభిమానులు క్రేజీగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా దిల్జీత్ దోసాంజ్ నటనను మళ్లీ లూప్‌లో చూస్తామంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వార్ డ్రామాలు ఇష్టపడేవారు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ మూవీ బోర్డర్ 2పై లుక్కేయవచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More