100 Of K Drama OTT Release In Telugu: తెలుగు రాష్ట్రాల్లో కొరియన్ డ్రామాలకు (K-Dramas) ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు ఓటీటీల్లో కే-డ్రామాల మోజులో మునిగితేలుతున్నారు.
సౌత్ కొరియా సంస్థతో ఒప్పందం

ఈ క్రేజ్‌ను గమనించిన ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' భారతీయ వీక్షకులకు ఊహించని వినోదాల విందు అందించడానికి సిద్ధమైంది. దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ 'సీజే ఈఎన్ఎమ్' (CJ ENM)తో ప్రైమ్ వీడియో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
తెలుగు డబ్బింగ్‌తో 100కు పైగా కే-డ్రామాలు
ఈ భాగస్వామ్యంలో భాగంగా రాబోయే రెండేళ్లలో 100కు పైగా పాపులర్ కొరియన్ ఓటీటీ షోలను అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫామ్‌పైకి తెస్తున్నారు. ఇందులో 26 సరికొత్త సిరీస్‌లతో పాటు గతంలో సంచలనం సృష్టించిన అనేక హిట్ డ్రామాలు ఉన్నాయి.
ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో డబ్బింగ్ చేసి 100కిపైగా కొరియన్ డ్రామాలను ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుండటం విశేషం. కేవలం సబ్‌టైటిల్స్ ఆధారంగానే చూసే పరిస్థితి లేకుండా, సొంత భాష తెలుగులోనే వీక్షించే వెసులుబాటు కలగడంతో తెలుగు కే-డ్రామా ప్రియులు పండగ చేసుకుంటున్నారు.
ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ప్రముఖ సిరీస్‌లు ఇవే
ఈ ఒప్పందంలో భాగంగా రాబోతున్న జాబితాలో 'యుమీస్ సెల్స్ సీజన్ 3' (Yumi's Cells Season 3) ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీంతో పాటు సీజన్ 1, సీజన్ 2 కూడా స్ట్రీమింగ్ కానున్నాయి. ఆగస్టు 3 నుంచి 'మై బయాస్, మై బాస్' అనే కొత్త షో ఓటీటీ రిలీజ్ అవనుంది.
వీటితో పాటు 'ఫైలింగ్ ఫర్ లవ్', 'ది లెజెండ్ ఆఫ్ కిచెన్ సోల్జర్', 'డియర్ ఎక్స్', 'లా ఇన్ ది సిటీ', 'స్టడీ గ్రూప్', 'మై డియరెస్ట్ నెమెసిస్', 'సెర్చ్: డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' లాంటి ఎన్నో సూపర్‌హిట్ సిరీస్‌లు త్వరలోనే వరుసగా అలరించబోతున్నాయి. ఎవర్ గ్రీన్ హిట్లయిన 'లెజెండ్ ఆఫ్ ది బ్లూ సీ', 'ప్రిజన్ ప్లేబుక్', 'మదర్' వంటి ప్రముఖ ఓటీటీ షోలను కూడా తెలుగులో అందుబాటులోకి తీసుకురానున్నారు.
తెలుగు ప్రేక్షకుల ఆదరణపై ప్రైమ్ వీడియో సంతోషం
{{/usCountry}}వీటితో పాటు 'ఫైలింగ్ ఫర్ లవ్', 'ది లెజెండ్ ఆఫ్ కిచెన్ సోల్జర్', 'డియర్ ఎక్స్', 'లా ఇన్ ది సిటీ', 'స్టడీ గ్రూప్', 'మై డియరెస్ట్ నెమెసిస్', 'సెర్చ్: డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' లాంటి ఎన్నో సూపర్‌హిట్ సిరీస్‌లు త్వరలోనే వరుసగా అలరించబోతున్నాయి. ఎవర్ గ్రీన్ హిట్లయిన 'లెజెండ్ ఆఫ్ ది బ్లూ సీ', 'ప్రిజన్ ప్లేబుక్', 'మదర్' వంటి ప్రముఖ ఓటీటీ షోలను కూడా తెలుగులో అందుబాటులోకి తీసుకురానున్నారు.
తెలుగు ప్రేక్షకుల ఆదరణపై ప్రైమ్ వీడియో సంతోషం
{{/usCountry}}ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రతినిధులు భారతీయ మార్కెట్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. "తెలుగు వీక్షకులు ఇతర భాషా చిత్రాలతో పాటు కొరియన్ కంటెంట్‌ను విపరీతంగా ఆదరిస్తున్నారు. అందుకే ఈ కొరియన్ షోలను తెలుగులోకి డబ్బింగ్ చేసి అందిస్తున్నాం" అని ప్రైమ్ వీడియో ఇండియా ఎస్‌వోడీ బిజినెస్ హెడ్ శిలాంగి ముఖర్జీ తెలిపారు.
భాషా పరిమితులను దాటి కథలు ప్రజల హృదయాలను తాకుతున్నాయని, ప్రాదేశిక భాషల్లో డబ్బింగ్ చేయడం వల్ల మరింత మందికి డిజిటల్ వినోదం చేరువవుతుందని ఆమె వివరించారు. "భారత్‌లో కే-డ్రామాలకు లభిస్తున్న ఆదరణ అద్భుతం. అన్ని ప్రాంతాల, అన్ని వయసుల వీక్షకులు ఈ షోలను ఇష్టపడుతున్నారు" అని ప్రైమ్ వీడియో కంటెంట్ లైసెన్సింగ్ హెడ్ మనీష్ మేంఘానీ పేర్కొన్నారు.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
ప్రపంచంలోనే అత్యంత కీలకమైన వినోద మార్కెట్ అయిన భారత్‌లో తమ కంటెంట్‌ను అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద్వారా విస్తరించడం ఎంతో సంతోషంగా ఉందని సీజే ఈఎన్ఎమ్ ఈవీపీ జాంగ్ హో సో హర్షం వ్యక్తం చేశారు.
ఈ లెక్కన వచ్చే రెండేళ్లలో 100కిపైగా కొరియన్ డ్రామాలు ఓటీటీలో తెలుగు భాషలో సందడి చేయనున్నాయని తెలుస్తోంది.