...
...
Next Story

Pearle Maaney: ఒక్క పోస్టుతో 3 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ను కోల్పోయిన పాపులర్ యాంకర్- ఆమె ఎవరో గుర్తుపట్టారా?

Anchor Pearle Maaney Loses 3 Lakh Instagram Followers: ప్రముఖ టీవీ యాంకర్ పెర్లీ మానీ చేసిన ఒక వివాదాస్పద సోషల్ మీడియా పోస్ట్ తీవ్ర దుమారం రేపుతోంది. అందుకు ఫలితంగా ఏకంగా 3 లక్షల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ను ఆమె కోల్పోయేలా చేసింది. అంతేకాకుండా దిగ్గజ దర్శకుడిపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేసింది పెర్లీ.

Published on: Jul 26, 2026, 20:39:54 IST
Advertisement

Anchor Pearle Maaney Loses 3 Lakh Instagram Followers: సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ ఏళ్ల తరబడి సంపాదించుకున్న గుర్తింపును, లక్షలాది మంది ఫాలోవర్లను క్షణాల్లో ఆవిరి చేసేస్తుందని నిరూపించే సంఘటన ఇది. మలయాళ బిగ్ బాస్ రన్నరప్, ప్రసిద్ధ టీవీ యాంకర్, యూట్యూబర్ పెర్లీ మానీ (Pearle Maaney) ప్రస్తుతం నెటిజన్ల ఆగ్రహజ్వాలల్లో చిక్కుకున్నారు.

విద్యార్థి నిరసనలపై పోస్ట్

ఒక్క పోస్టుతో 3 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ను కోల్పోయిన పాపులర్ యాంకర్- ఆమె ఎవరో గుర్తుపట్టారా?
ఒక్క పోస్టుతో 3 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ను కోల్పోయిన పాపులర్ యాంకర్- ఆమె ఎవరో గుర్తుపట్టారా?

ఈ నెల 24న కేరళలో చోటుచేసుకున్న విద్యార్థుల నిరసనలపై పెర్లీ మానీ స్పందించిన తీరు, ఆ తర్వాత అనుసరించిన వైఖరి తీవ్ర వివాదాస్పదంగా మారింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఆమె ఏకంగా 3 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను కోల్పోవడం పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

అసలు వివాదం ఏమిటి?

కేరళలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలపై పెర్లీ మానీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సుదీర్ఘమైన సందేశాన్ని రాసుకొచ్చారు. "ఏ లక్ష్యం కూడా ప్రాణాలు తీసేంత గొప్పది కాదు. మీ ప్రాణాలకు ప్రమాదం అనిపిస్తే నిరసనలు ఆపి ఇళ్లకు వెళ్లిపోండి" అని పెర్లీ మానీ రాసుకొచ్చారు.

విద్యార్థులకు మంచి విద్యావ్యవస్థ దక్కాలని కోరుకుంటున్నానని చెబుతూనే, ఉద్యమం దారి తప్పకూడదని హితవు పలికారు. అయితే, ఈ పోస్ట్‌కు బ్యాక్‌గ్రౌండ్‌లో కాషాయం కలర్ ఉండటంతోపాటు "కామెంట్స్ సెక్షన్ నా స్వేచ్ఛ స్వాతంత్య్రానికి ప్రతీక" అని క్యాప్షన్ పెట్టడం, ఎవరూ కామెంట్లు చేయకుండా డిసేబుల్ చేశారు.

ఈ వైఖరిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. "సిల్వర్ స్పూన్‌తో పుట్టిన నీకు సామాన్యుల కష్టాలు, ప్రవేశ పరీక్షల కోసం పడే పోరాటాలు ఏం తెలుస్తాయి?" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామెంట్లు నిలిపివేయడంతో ఆగ్రహించిన వీక్షకులు ఆమె పాత పోస్టుల కింద ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.

3 లక్షల ఫాలోవర్ల లాస్..

ఈ వ్యవహారంపై మలయాళ చలనచిత్ర రంగానికి చెందిన దిగ్గజ దర్శకుడు సిబి మలయిల్ (మోహన్ లాల్ 'కిరీటం', 'దేవాసురం' వంటి ఆల్‌టైమ్ క్లాసిక్స్ అందించిన దర్శకుడు) పెర్లీ వైఖరిని బహిరంగంగా తప్పుపట్టారు. దీంతో పెర్లీ మానీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆయనపై పరోక్షంగా నిప్పులు చెరిగారు.

సీనియర్ డైరెక్టర్‌పై వ్యాఖ్యలు!

"ఒక ఫ్లాప్ డైరెక్టర్ నా నాలుగు పేజీల పోస్ట్‌పై 10 పేజీల స్క్రిప్ట్ రాస్తున్నారు. దానికి కారం, అజినోమోటో జోడించి మరీ ప్రచారం చేస్తున్నారు. నా ఇష్టమైన రంగు కాషాయం, అది మన జాతీయ జెండాపై ఉంటే నాకు ఇంకా ఇష్టం" అని వ్యాఖ్యానించారు.

వెన్నెముక లేని కొడుకును పెంచలేదు.. డైరెక్టర్ కుమారుడి వార్నింగ్!

తన తండ్రిని 'ఫ్లాప్ డైరెక్టర్' అని సంబోధించడంతో సిబి మలయిల్ కుమారుడు జో మలయిల్ తీవ్రంగా స్పందించారు. పెర్లీ మానీని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఘాటు కౌంటర్ ఇచ్చారు.

"నువ్వు ఫ్లాప్ డైరెక్టర్ అని అంటున్నది మా నాన్నను. ఎవరితో పెట్టుకుంటున్నావో సరిగ్గా చూసుకో. నీ అరకొర దౌత్యనీతి సందేశాలను 57 లక్షల మంది చదవాలని కోరుకునే నువ్వు, 7 స్లైడ్లు చదవడానికి అంత బద్ధకించాలా? ఆ 'ఫ్లాప్ డైరెక్టర్' వెన్నెముక లేని కొడుకును పెంచలేదు. కానీ నీ తండ్రి ఒక పిరికిపందను పెంచాడు. ధైర్యముంటే ముందడుగు వేయ్" అని జో మలయిల్ సవాల్ విసిరారు.

వ్యక్తిగత పోరుగా

సామాజిక అంశంపై మొదలైన ఈ చర్చ కాస్తా, ఇప్పుడు ఇండస్ట్రీలోని ప్రముఖుల మధ్య వ్యక్తిగత పోరుగా మారడంతో మలయాళ డిజిటల్ మీడియాలో ఈ వార్త తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఆర్ఆర్ఆర్ ఇంటర్వ్యూ బ్యూటీ

ఇదిలా ఉంటే, ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళిలను పెర్లీ మానీ ఇంటర్వ్యూ చేసి క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ ఇంటర్వ్యూలో పెర్లీ మానీ పేరును రామ్ చరణ్ గుర్తుపెట్టుకోకపోవడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe