...
...
Next Story

TV Show: బుల్లితెరపైకి సరికొత్త గేమ్ షో- కోటి గెలుచుకునే ఛాన్స్, 1% తెలివితేటలు ఉంటే చాలు- టీవీ, ఓటీటీలో స్ట్రీమింగ్!

TV Show India Ke Top 1% OTT Streaming: బుల్లితెరపైకి సరికొత్త గేమ్ షో రానుంది. అదే ఇండియా కే టాప్ 1%. ఈ టీవీ షోకి సీనియర్ హీరో, యానిమల్ నటుడు అనిల్ కపూర్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఏకంగా రూ. కోటి గెలుచుకునే అవకాశంతో రూపొందిన ఇండియా కే టాప్ 1% టీవీ ప్రీమియర్, ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు చూద్దాం.

Published on: Aug 8, 2026, 06:29:59 IST
Advertisement

TV Show India Ke Top 1% OTT Start Date: బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరో, యానిమల్ నటుడు అనిల్ కపూర్ మరోసారి హోస్ట్‌గా రానున్నారు. బిగ్ బాస్ ఓటీటీ 3 విజయం తర్వాత ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సరికొత్త రియాలిటీ గేమ్ షో 'ఇండియా కే టాప్ 1%' (India Ke Top 1%).

క్విజ్ షోల మాదిరిగా కాకుండా

బుల్లితెరపైకి సరికొత్త గేమ్ షో- కోటి గెలుచుకునే ఛాన్స్, 1% తెలివితేటలు ఉంటే చాలు- టీవీ, ఓటీటీలో స్ట్రీమింగ్!
బుల్లితెరపైకి సరికొత్త గేమ్ షో- కోటి గెలుచుకునే ఛాన్స్, 1% తెలివితేటలు ఉంటే చాలు- టీవీ, ఓటీటీలో స్ట్రీమింగ్!

బ్రిటన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన 'ది 1% క్లబ్' (The 1% Club) ఫార్మాట్‌కు ఇది భారతీయ వెర్షన్. సాధారణంగా టీవీల్లో వచ్చే క్విజ్ షోల మాదిరిగా ఇది సాధారణ జ్ఞానం (General Knowledge) లేదా కరెంట్ అఫైర్స్‌పై ఆధారపడి ఉండదు. కేవలం సమయస్ఫూర్తి, తార్కిక ఆలోచన (Logic), పరిశీలనా శక్తి, ప్యాటర్న్ రికగ్నిషన్ ఆధారంగా సాగుతుంది.

100 మంది పోటీదారులు.. 1% మైండ్ పవర్!

గేమ్ షోలో ప్రతి ఎపిసోడ్‌లో 100 మంది పోటీదారులు పాల్గొంటారు. సాధారణంగా 90 శాతం మంది సమాధానం చెప్పగలిగే సులువైన ప్రశ్నతో ఆట ప్రారంభమవుతుంది. రౌండ్ రౌండ్‌కు ప్రశ్నల తీవ్రత పెరుగుతూ, చివరకు కేవలం 1 శాతం మంది మాత్రమే సమాధానం చెప్పగల అత్యంత కష్టమైన ప్రశ్నకు చేరుకుంటుంది. ఈ ప్రశ్నలను భారత్‌ వ్యాప్తంగా సర్వేలు నిర్వహించి ప్రత్యేకంగా రూపొందించారు.

ఎంత సమాచారం తెలుసనేది కాదు

"ఈ షో ప్రేక్షకులు ఇప్పటివరకు చూసిన వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. మీకు ఎంత సమాచారం తెలుసనేది ఇక్కడ ముఖ్యం కాదు, మీరు ఎలా ఆలోచిస్తున్నారనేదే అసలు పాయింట్. ప్రతి సవాలు మీ పరిశీలన, లాజిక్, సమయస్ఫూర్తిని పరీక్షిస్తుంది" అని అనిల్ కపూర్ తెలిపారు.

1 శాతం తెలివితేటలు ఉన్నాయని భావిస్తే

ఈ షో ప్రత్యేకత ఏంటంటే.. టీవీ చూస్తున్న కుటుంబ సభ్యులంతా ఇంట్లో కూర్చునే కలిసి ఆడుకోవచ్చు. 14 ఏళ్ల కుర్రాడి నుంచి 40 ఏళ్ల పెద్దవారి వరకు ఎవరైనా తమ లాజిక్‌తో చివరి ప్రశ్న వరకు వెళ్లే అవకాశం ఉండటం దీని ప్రత్యేకత.

రూ. కోటి జాక్‌పాట్.. సెప్టెంబర్ 5 నుంచి ప్రసారం

అంతర్జాతీయంగా 15కు పైగా దేశాల్లో ఎనలేని విజయాన్ని సాధించిన ఈ ఫార్మాట్‌ను భారతదేశంలో బనిజయ్ ఆసియా సంస్థ నిర్మిస్తోంది. యుకేలో గత ఐదేళ్లలో అత్యంత విజయం సాధించిన క్విజ్ షోగా ఇది రికార్డు సృష్టించింది.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో

ఈ పోటీలో విజేతగా నిలిచిన వారికి రూ.1 కోటి నగదు బహుమతి లభిస్తుంది. 'ఇండియా కే టాప్ 1%' షో సెప్టెంబర్ 5 నుంచి ప్రముఖ హిందీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ స్టార్ ప్లస్‌తో పాటు జియో హాట్‌స్టార్ (JioHotstar) ఓటీటీ వేదికగా ఒకేసారి ప్రసారం కానుంది.

టీవీ, ఓటీటీ రెండింట్లో

అటు టీవీ, ఇటు ఓటీటీలో సరికొత్త గేమ్ షోగా ఇండియా కే టాప్ 1% ప్రారంభం కానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks