Anil Ravipudi: కామెడీకి బ్రేక్- సరికొత్త జోనర్‌తో రానున్న అనిల్ రావిపూడి- తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పిన డైరెక్టర్

Anil Ravipudi Announces His Dream Project With New Genre: సంక్రాంతికి ఫ్యామిలీ కామెడీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించే దర్శకుడు అనిల్ రావిపూడి తన రూట్ మార్చారు. గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (IFFI) వేదికగా తన తదుపరి డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

Published on: Nov 28, 2026, 11:07:29 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Anil Ravipudi Announces His Dream Project With New Genre: టాలీవుడ్‌లో అపజయమెరుగని దర్శకుడిగా, సంక్రాంతి బాక్సాఫీస్ రారాజుగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి తన కెరీర్‌లో సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఇప్పటివరకు అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆయన, తొలిసారిగా పౌరాణిక (మైథాలజీ) జోనర్‌లోకి అడుగుపెడుతున్నారు.

కామెడీకి బ్రేక్- సరికొత్త జోనర్‌తో రానున్న అనిల్ రావిపూడి- తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పిన డైరెక్టర్
కామెడీకి బ్రేక్- సరికొత్త జోనర్‌తో రానున్న అనిల్ రావిపూడి- తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పిన డైరెక్టర్

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా

గోవాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేదికగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి అనిల్ రావిపూడి ఆసక్తికర ప్రకటన చేశారు.

మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం ఇఫ్ఫీ (IFFI) ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శితమైంది.

చిన్ననాటి కల 'యానిమేటెడ్ రామాయణం'

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అనిల్ రావిపూడి రామాయణం ఆధారంగా ఓ భారీ యానిమేషన్ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కేవలం ఒకే రకమైన సినిమాలకు పరిమితం కాకుండా విభిన్న జోనర్లలో తనను తాను ఆవిష్కరించుకోవాలని అనిల్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ యానిమేషన్ సినిమా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని ఆయన తెలిపారు.

"నా రాబోయే ప్రాజెక్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. విభిన్న జోనర్లలో సినిమాలు చేయాలన్నది నా కోరిక. అందుకే రామాయణం ఆధారంగా ఓ యానిమేషన్ సినిమా చేస్తున్నాను. ప్రస్తుతం ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. చిన్నప్పటి నుంచి మన పురాణాలంటే నాకు ఎంతో గౌరవం, ఇష్టం. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ప్రేక్షకులకు కచ్చితంగా ఓ చిన్న సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాను. త్వరలోనే నాలోని మరో కోణాన్ని జనం చూస్తారు" అని అనిల్ రావిపూడి తన మనసులోని మాటను పంచుకున్నారు.

సంక్రాంతి సినిమాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు

మైథాలజీ వైపు అడుగులు వేస్తున్నప్పటికీ, తనకు గుర్తింపు తెచ్చిన ఫ్యామిలీ కామెడీ సినిమాలకు దూరమయ్యే ఆలోచన లేదని అనిల్ తేల్చిచెప్పారు. నిత్యం ఒత్తిడితో కూడిన జీవితంలో వారాంతంలో థియేటర్లకు వచ్చే ప్రేక్షకులను నవ్వించడమే తనకు అత్యంత సంతృప్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు.

"మీరు ఎప్పుడూ కామెడీ సినిమాలే ఎందుకు చేస్తారు? ఒకే తరహా కథలనే ఎందుకు ఎంచుకుంటారు అని చాలా మంది అడుగుతుంటారు. ఆ సినిమాలకు ప్రేక్షకుల నుంచి వచ్చే ఆదరణ, ప్రేమే అందుకు కారణం. వారం పొడవునా పని ఒత్తిడితో అలసిపోయిన జనం థియేటర్లకు వచ్చినప్పుడు, వారికి కాస్త ఉపశమనం ఇచ్చి చిరునవ్వుతో ఇంటికి పంపితే చాలు. నాకు అంతకంటే ఏం కావాలి? అందుకే సంక్రాంతి ఫ్రాంచైజీని నేను ఎప్పటికీ వదిలిపెట్టను. ప్రజలు నాపై ఇంత ప్రేమ, గౌరవం చూపిస్తున్నప్పుడు ఈ ఆట నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు" అని అనిల్ రావిపూడి స్పష్టం చేశారు.

ఎన్టీఆర్‌తో నవ్వుల విందు.. సంక్రాంతికి 'విడుదల'

ఇదిలా ఉండగా, ఈ నెల ఆరంభంలోనే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయబోతున్నట్లు అనిల్ ప్రకటించి అభిమానుల్లో జోష్ నింపారు. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోను పంచుకుంటూ, "ఇది నవ్వుల సునామీ కాబోతోంది" అని ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దీనికి అనిల్ స్పందిస్తూ, "తారక్ సర్‌తో మా కాంబినేషన్ ఎప్పటినుంచో బాకీ ఉంది. ఫుల్ ఆన్ ఎంటర్‌టైనర్ రాబోతోంది. త్వరలోనే షూటింగ్.. కాదు కాదు త్వరలోనే నవ్వుల జాతర మొదలవుతుంది" అంటూ ట్వీట్ చేశారు.

జనవరి 12 విడుదల

నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మరోవైపు విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో అనిల్ తెరకెక్కించిన 'జనవరి 12 విడుదల' చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో సందడి చేయనుంది.

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.