...
...
Next Story

దృశ్యం కథ చెప్పి నయనతారతో సినిమా ఓకే చేయించుకున్న మన శంకర వరప్రసాద్ గారు డైరెక్టర్ అనిల్ రావిపూడి- గుడ్డి నమ్మకమంటూ!

మెగాస్టార్ చిరంజీవి, నయనతార జోడీగా నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 12న థియేటర్లలో విడుదలై రూ. 120 కోట్లకుపైగా కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో మూవీకి నయనతారను ఎలా ఒప్పించారో అనిల్ రావిపూడి చెప్పిన విషయం ఆసక్తిగా మారింది.

Published on: Jan 17, 2026, 13:44:24 IST
Advertisement

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఇద్దరు స్టార్ హీరోలను ఒకటిగా చేసిన సినిమా మన శంకర వరప్రసాద్ గారు. చిరు, వెంకీ ఇద్దరిని ఒకే స్క్రీన్‌పై చూడాలని తహతహలాడిన ఇరు అభిమానుల కలను నిజం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.

మరో సంక్రాంతి సినిమా

దృశ్యం కథ చెప్పి నయనతారతో సినిమా ఓకే చేయించుకున్న మన శంకర వరప్రసాద్ గారు డైరెక్టర్ అనిల్ రావిపూడి- గుడ్డి నమ్మకమంటూ!
దృశ్యం కథ చెప్పి నయనతారతో సినిమా ఓకే చేయించుకున్న మన శంకర వరప్రసాద్ గారు డైరెక్టర్ అనిల్ రావిపూడి- గుడ్డి నమ్మకమంటూ!

ఇప్పటివరకు బాక్సాఫీస్ పరంగా ఒక్క ఫెయిల్యూర్ దర్శకుడిగా రికార్డ్ క్రియేట్ చేసిన అనిల్ రావిపూడి తెరకెక్కించిన మరో సంక్రాంతి సినిమానే మన శంకర వరప్రసాద్ గారు. ఈ మూవీలో హీరోయిన్‌గా లేడి సూపర్ స్టార్ నయనతార చేసిన విషయం తెలిసిందే.

దృశ్యం కథ చెప్పి

అయితే, మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో నటించేందుకు నయనతారను ఎలా ఒప్పించారో రీసెంట్‌గా దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో నయనతారకు దృశ్యం కథ చెప్పి ఓకే చేయించుకున్నట్లు డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పడం ఆసక్తిగా మారింది.

"నయనతారను గారి సెలక్షన్ విషయంలో ఆమెతోనే చేద్దామా లేదా అల్టర్‌నేటివ్‌కి వెళ్దామా అంటే.. లేదు లేదు.. ఆల్టర్‌నేట్ వద్దు. నేను నయనతారను తెచ్చుకుంటా అని వెళ్లిపోయారంటా.. ఏంటా ధైర్యం మీకు" అని ఇంటర్వ్యూలో అనిల్‌ను జర్నలిస్ట్ అడిగారు.

3 పాత్రలు ఇంపార్టెంట్

"ఈ సినిమాలో మూడు పాత్రలు చాలా ఇంపార్టెంట్. చిరంజీవి గారు, జీవీఆర్ అనే పాత్ర సచిన్ ఖేడ్‌కర్, శశిరేఖ.. సచిన్ ఖేడ్‌కర్ కూతురు పాత్ర. కథ ఈ మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంటుంది. ఇంకో ఇంపార్టెంట్ రోల్ వెంకీ గారిది. అది ఎలాగు ఉంటది" అని అనిల్ రావిపూడి చెప్పారు.

"సో నయనతార గారిదే ఒక నెల ప్రాసెస్ జరిగింది. రెమ్యూనరేషన్‌లు అవి ఇవి డిస్కషన్స్ జరుగుతుంటే.. నేనే టచ్‌లోకి వెళ్లిపోయి ఫోన్ మాట్లాడా. ఒకరోజు ఆవిడ అనిల్ ఐ లైక్ యువర్ స్టోరీ మ్యాన్. టెల్, ఏం చేద్దామో చెప్పు అన్నారు" అని అనిల్ రావిపూడి వివరించారు.

నయనతారకు ఫోన్ చేయలేదు

"మేడమ్ మీరు చేస్తే ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. చేయలేదనుకోండి.. దృశ్యం సినిమా ఒకసారి చూసి పడుకుంటా అన్నా. అదేంటీ అంది. దృశ్యంలో వెంకటేష్ గారు చెబుతారు కదా ఆరోజు మనం పూజకు వెళ్లలేదు అని.. సో అలా నేను ఆరోజు నయనతారకు ఫోన్ చేయలేదు, నేను తనతో మాట్లాడలేదు, అసలు నయనతారను నేనెప్పుడు మా సినిమా గురించి అడిగాను.. అలా మర్చిపోతానండి అంటే.. ఆ అమ్మాయి గట్టిగా నవ్వి డోంట్ వర్రీ నేను ఈ సినిమా చేస్తున్నాను అంది" అని అనిల్ రావిపూడి తెలిపారు.

దానికి యాంకర్ కూడా నవ్వారు. "మరి అల్టర్‌నేటివ్ చూసి పెట్టుకున్నారా" అని జర్నలిస్ట్ అడిగారు. "లేదు. గుడ్డి నమ్మకం (బ్లైండ్ బిలీఫ్) ఏంటంటే ఈ సినిమా అందరిని తెచ్చుకుంటుందని ఒక నమ్మకం ఉంది. సో అలాగే నయనతారని కథ తెచ్చుకుంది. శశిరేఖ పాత్రలో ఆమెను తప్పా ఇంకెవరిని నేను అస్సలు ఊహించుకోలేను" అని అనిల్ రావిపూడి హీరోయిన్ నయనతారను ఒప్పించిన విధానాన్ని వెల్లడించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe