...
...
Next Story

Bobby Deol: ఒకేసారి ఏకంగా 5 ఆఫీస్‌లు కొన్న యానిమల్ విలన్ బాబీ డియోల్, ఆయన భార్య- ఆ హీరో ఫ్యామిలీ పక్కనే కొనుగోలు!

Bobby Deol And His Wife Bought 5 Offices In Mumbai: బాలీవుడ్ నటుడు, యానిమల్, డాకు మహారాజ్ విలన్ బాబీ డియోల్ ముంబైలోని అంధేరీలో కోట్ల విలువ జేసే ఐదు కమర్షియల్ ఆఫీస్ యూనిట్లను కొనుగోలు చేశారు. అదే బిల్డింగ్‌లో హృతిక్ రోషన్ కుటుంబానికి కూడా ఆఫీసులు ఉండటం విశేషంగా మారింది.

Published on: Mar 7, 2026, 20:41:09 IST
Advertisement

బాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి 'యానిమల్' సినిమాతో విలన్‌గా భారీ విజయాన్ని అందుకున్న నటుడు బాబీ డియోల్. బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలోనూ విలన్‌గా అదరగొట్టిన బాబీ డియోల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోనూ తన జోరు చూపిస్తున్నారు.

గ్రీన్‌స్టోన్ ఇన్వెస్ట్‌మెంట్స్

ఒకేసారి ఏకంగా 5 ఆఫీస్‌లు కొన్న యానిమల్ విలన్ బాబీ డియోల్, ఆయన భార్య- ఆ హీరో ఫ్యామిలీ పక్కనే కొనుగోలు!
ఒకేసారి ఏకంగా 5 ఆఫీస్‌లు కొన్న యానిమల్ విలన్ బాబీ డియోల్, ఆయన భార్య- ఆ హీరో ఫ్యామిలీ పక్కనే కొనుగోలు!

ముంబైలోని అంధేరీ వెస్ట్‌లో గల ఒక ప్రముఖ బిజినెస్ పార్క్‌లో బాబీ డియోల్, ఆయన భార్య తాన్యా డియోల్ భారీ పెట్టుబడి పెట్టారు. వీరిద్దరి భాగస్వామ్యంలో ఉన్న 'గ్రీన్‌స్టోన్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్' సంస్థ ద్వారా సుమారు 3,400 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఐదు కమర్షియల్ ఆఫీస్ యూనిట్లను కొనుగోలు చేశారు.

రూ. 15 కోట్ల డీల్..

ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం, అంధేరీ వెస్ట్‌లోని లింక్ రోడ్‌లో ఉన్న 'యురా బిజినెస్ పార్క్ - ఫేజ్ 2' లోని రెండో అంతస్తులో ఈ 5 ఆఫీసులను బాబీ డియోల్ దంపతులు కొన్నారు. ఈ డీల్ విలువ దాదాపు రూ. 15.05 కోట్లు కాగా, దీని కోసం సుమారు రూ. 90 లక్షలకు పైగా స్టాంప్ డ్యూటీ, రూ. 1.50 లక్షల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లు తెలుస్తోంది.

రోషన్ ఫ్యామిలీ పక్కనే!

ఫిబ్రవరి 27, 2026న ఈ లావాదేవీ రిజిస్టర్ అయింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, బాబీ డియోల్ కొన్న అదే బిల్డింగ్‌లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కుటుంబానికి కూడా ఆఫీసులు ఉన్నాయి. హృతిక్ రోషన్, ఆయన తండ్రి రాకేష్ రోషన్ (HRX డిజిటెక్ LLP), తల్లి ప్రమీల రోషన్ (ఫిల్మ్‌కుంజ్ బాంబే) కలిసి ఇదే భవనంలోని మూడు, నాలుగో అంతస్తుల్లో మొత్తం 10 ఆఫీస్ యూనిట్లను గతంలోనే కొనుగోలు చేశారు.

ప్రస్తుతం ఈ బిజినెస్ పార్క్ నిర్మాణ దశలో ఉంది. డాక్యుమెంట్ల ప్రకారం, 2027 డిసెంబర్ నాటికి ఈ ఆఫీసుల పొసెషన్ (అప్పగింత) జరిగే అవకాశం ఉంది. ఆఫీసులతో పాటు ఐదు కార్ పార్కింగ్ స్థలాలను కూడా బాబీ డియోల్ దంపతులు పొందారు.

ఈ విషయంపై స్పందన కోరుతూ తాన్యా డియోల్ సంస్థలకు మెయిల్ పంపినప్పటికీ, ఇప్పటివరకు వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. బాబీ డియోల్ కూడా ప్రస్తుతం అందుబాటులోకి రాలేదు.

భారీగా ప్రాపర్టీల కొనుగోలు

ఇదిలా ఉంటే, ఇటీవల కాలంలో బాలీవుడ్ సెలబ్రిటీలు తమ సంపాదనను ముంబైలోని కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టడం ఒక ట్రెండ్‌గా మారింది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్, ప్రీతి జింటా వంటి వారు కూడా భారీగా ప్రాపర్టీలు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe