Anirudh Ravichander Kavya Maran Wedding Tarot Card Prediction: ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. గత కొన్ని వారాలుగా ప్రచారంలో ఉన్న ఈ వార్తపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెళ్లి, రిసెప్షన్ ఆహ్వాన పత్రిక గురించి చేసిన ప్రకటనతో అధికారికంగా స్పష్టత వచ్చింది.
అనిరుధ్‌కు రాబోయే భార్య లక్షణాలు

ఈ శుభవార్త బయటకు రాగానే అనిరుధ్ అభిమానులు పదేళ్ల క్రితం నాటి ఒక ఆసక్తికర వీడియోను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఒక టారో కార్డ్ రీడర్ (కార్డ్సుతో జాతకం చెప్పే వ్యక్తి) అనిరుధ్ పెళ్లి, ఆయనకు రాబోయే భార్య లక్షణాల గురించి పదేళ్ల క్రితమే చెప్పిన జోస్యం, జాతకం ఇప్పుడు అక్షరాలా నిజమైందంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్‌తో ఖాయమైన పెళ్లి వార్త
సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్, ఆయన భార్య కావేరీ మారన్ ఇటీవల హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను కలిశారు. నవంబర్ 21న చెన్నైలో జరగనున్న కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ పెళ్లి రిసెప్షన్‌కు సీఎంను ఆహ్వానించారు.
అనిరుధ్, కావ్యపెళ్లి వార్త తెలంగాణ సీఎంవో సోషల్ మీడియా ఖాతా ద్వారా బయటకు రావడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో పాటు పలువురు ప్రముఖులకు కూడా ఈ వివాహ ఆహ్వాన పత్రికలను ఇప్పటికే అందజేశారు.
పదేళ్ల క్రితం నాటి ఆసక్తికర జోస్యం
వివాహ నిశ్చయ వార్త వైరల్ అయిన వెంటనే, దాదాపు పదేళ్ల క్రితం 'తంతి టీవీ'లో ప్రసారమైన ఒక కార్యక్రమం వీడియో నెట్లో హల్చల్ చేయడం ప్రారంభించింది. అప్సర రెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఆ షోలో, ప్రముఖ ఆస్ట్రాలజర్ జయశ్రీ టారో కార్డ్స్ ఆధారంగా అనిరుధ్ భవిష్యత్తు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు.
{{/usCountry}}వివాహ నిశ్చయ వార్త వైరల్ అయిన వెంటనే, దాదాపు పదేళ్ల క్రితం 'తంతి టీవీ'లో ప్రసారమైన ఒక కార్యక్రమం వీడియో నెట్లో హల్చల్ చేయడం ప్రారంభించింది. అప్సర రెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఆ షోలో, ప్రముఖ ఆస్ట్రాలజర్ జయశ్రీ టారో కార్డ్స్ ఆధారంగా అనిరుధ్ భవిష్యత్తు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు.
{{/usCountry}}అనిరుధ్ చేసుకోబోయే అమ్మాయి మీడియా, బ్రాడ్‌కాస్టింగ్ లేదా టెలికమ్యూనికేషన్ రంగానికి చెందినదై ఉంటుందని ఆ రోజు జయశ్రీ చెప్పారు. ఆ అమ్మాయి ఉన్నత చదువులు చదివిన తెలివైన మహిళ అయి ఉంటుందని, వారిద్దరూ ఒక పార్టీలో కలుసుకుంటారని జోస్యం చెప్పారు. అనిరుధ్ ఇల్లు, ఆ అమ్మాయి ఇల్లు కేవలం రెండు కిలోమీటర్ల లోపే ఉంటాయని, అలాగే, లవ్ మ్యారేజ్ అవుతుందని ఆనాడే అనిరుధ్ జాతకం చెప్పారు ఆమె.
కావ్య మారన్ ప్రొఫైల్‌తో అక్షరాలా సరిపోలిన వివరాలు
జ్యోతిష్కురాలు ఆ రోజు చెప్పిన ప్రతీ అంశం కావ్య మారన్ ప్రొఫైల్‌తో సరిగ్గా మ్యాచ్ కావడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కావ్య మారన్ ప్రస్తుతం సన్ టీవీ నెట్వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బ్రాడ్‌కాస్టింగ్, మీడియా రంగంలోనే ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.
లండన్ పరిధిలోని ప్రసిద్ధ వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఆమె ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు. చెన్నైలోని అనిరుధ్ నివాసానికి, కావ్య మారన్ నివాసానికి మధ్య దూరం కూడా చాలా తక్కువగానే ఉండటం ఈ జోస్యానికి మరింత బలాన్ని చేకూర్చింది. మళ్లీ లవ్ చేసుకుని, పెద్దలను ఒప్పించడం వంటి విషయాలు అన్నీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయని అభిమానులు డీకోడ్ చేస్తున్నారు.
నెటిజన్ల ఆశ్చర్యం, కామెంట్ల వర్షం
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్టర్) లో వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. "పదేళ్ల క్రితం చెప్పిన జోస్యం ఇంత అచ్చంగా నిజమవుతుందని ఊహించలేదు" అని ఒక నెటిజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ధనుష్, శివ కార్తికేయన్ సంగతేంటీ?
బ్రాడ్‌కాస్టింగ్ రంగం, ఇళ్ల మధ్య దూరం వంటి నిర్దిష్ట విషయాలు కూడా పొంతన కుదరడం నిజంగా అద్భుతమని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ధనుష్, శివ కార్తికేయన్ వంటి ఇతర సినీ ప్రముఖుల గురించి కూడా ఆ జ్యోతిష్కురాలు నాడు ఏం చెప్పారో వెతికే పనిలో అభిమానులు నిమగ్నమయ్యారు.