...
...
Next Story

దీపావళికి రిలీజ్ అయిన 4 సినిమాలతో పోటీ.. అయిన 'అరి'కి అద్భుతమైన రెస్పాన్స్.. థియేటర్‌లో డైరెక్టర్ జయశంకర్

థియేటర్లలో విడుదలై పది రోజులు కావొస్తున్న ఇంకా మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న సినిమా అరి. అనసూయ భరద్వాజ్, వినోద్ వర్మ, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ నటించిన అరి సినిమాకు జయశంకర్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 10న విడుదలైన అరి దివాళీకి రిలీజైన 4 సినిమాలతో పోటీ పడుతోంది.

Published on: Oct 20, 2025, 13:31:48 IST
Advertisement

కంటెంట్ బాగుంటే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ఇది చాలా సార్లు నిజమైంది. ఇప్పుడు మరో సినిమా విషయంలో కూడా ఇదే నిరూపితమైంది. ఆ సినిమానే అరి. పేపర్ బాయ్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ జయశంకర్ తెరకెక్కించిన సినిమా అరి.

ఏడేళ్ల కృషితో తీర్చిదిద్ది

దీపావళికి రిలీజ్ అయిన 4 సినిమాలతో పోటీ.. అయిన అరిగి అద్భుతమైన రెస్పాన్స్.. థియేటర్‌లో డైరెక్టర్ జయశంకర్
దీపావళికి రిలీజ్ అయిన 4 సినిమాలతో పోటీ.. అయిన అరిగి అద్భుతమైన రెస్పాన్స్.. థియేటర్‌లో డైరెక్టర్ జయశంకర్

ఏడేళ్ల కృషితో జయశంకర్ తీర్చిదిద్దిన అరి సినిమాలో అనసూయ భరద్వాజ్, వినోద్ వర్మ, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, సురభి ప్రభావతి, వైవా హర్ష తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలైన అరి సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

రాజకీయ, సినీ ప్రముఖుల ప్రశంసలు

రాజకీయ, సినీ ప్రముఖులు సైతం అరి సినిమాను ప్రశంసించారు. అరిషడ్వర్గాలు అనే కాన్సెప్ట్‌తో వచ్చిన అరి సినిమా పాజిటివ్ మౌత్ టాక్‌తో పది రోజులు పూర్తి చేసుకుంది. పది రోజుల తర్వాత కూడా అద్భుతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది అరి సినిమా. అయితే, ఇతర సినిమాలతో పోటీ పడుతూ కూడా రెండో వారంలోకి అడుగుపెట్టడం విశేషంగా మారింది.

బాక్సాఫీస్ బరిలోకి 4 కొత్త సినిమాలు

ఇక ఈ వారం దీపావళి సీజన్ సందర్భంగా నాలుగు కొత్త చిత్రాలు బాక్సాఫీస్ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. వాటిలో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా, ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్, ప్రియదర్శి మిత్ర మండలి, కిరణ్ అబ్బవరం కె ర్యాంప్‌ సినిమాలు ఉన్నాయి. ఈ నాలుగు చిత్రాలతో పాటు అరి సినిమా కూడా మంచి జోరు చూపిస్తోంది.

డైరెక్టర్ సంతోషం

పదో రోజు సినిమాని వీక్షిస్తున్నట్టు జయ శంకర్ వేసిన పోస్ట్ వైరల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పది రోజుల తర్వాత అరి సినిమా థియేటర్లలో ప్రేక్షకులు ఉండటంపై డైరెక్టర్ జయశంకర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అందుకే పోస్ట్‌తో తన సంతోషాన్ని పంచుకున్నారు.

ప్రమోషన్స్‌కు రాని ఆర్టిస్ట్స్

అరి కంటెంట్ బేస్డ్ మూవీ కావడంతో రెండో వారం కూడా కొనసాగించాలని మేకర్లు ఫిక్స్ అయ్యారు. అసలు ఈ మూవీ కోసం ఆర్టిస్టులంతా కలిసి ముందుకు వచ్చి ప్రమోట్ చేస్తే నెక్ట్స్ లెవెల్‌లో ఉండేది. ఆడియెన్స్‌లోకి మరింత ఎక్కువగా వెళ్లే అవకాశం ఉండేది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks