...
...
Next Story

Bhairavi: టాలీవుడ్‌లోకి మరో రష్మిక మందన్నా? కొత్త మలుపుతో హీరోయిన్‌గా అస్సాం బ్యూటీ భైరవి- సింగర్ సునీత కొడుకు హీరో!

Kotha Malupu Heroine Bhairavi Compared To Rashmika Mandanna: సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా కొత్త మలుపు. కొత్త మలుపు టీజర్, ట్రైలర్లతో అస్సాం భామ భైరవి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. క్యూట్ లుక్స్‌తో కుర్రకారును కట్టిపడేస్తున్న ఈ న్యూ క్రష్ గురించిన ప్రత్యేక విశేషాలు.

Published on: Jun 7, 2026, 21:20:18 IST
Advertisement

Kotha Malupu Heroine Bhairavi: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కొత్త హీరోయిన్లను ఆదరించడం, వారికి స్టార్‌డమ్ ఇవ్వడం ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ. ముంబై, కేరళ, కర్ణాటక నుంచి వచ్చే భామలే కాకుండా ఇటీవల కాలంలో ఈశాన్య రాష్ట్రాల ముద్దుగుమ్మలు కూడా టాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారు.

అస్సాం నుంచి వచ్చిన బ్యూటీ

టాలీవుడ్‌లోకి మరో రష్మిక మందన్నా? కొత్త మలుపుతో హీరోయిన్‌గా అస్సాం బ్యూటీ భైరవి- సింగర్ సునీత కొడుకు హీరో!
టాలీవుడ్‌లోకి మరో రష్మిక మందన్నా? కొత్త మలుపుతో హీరోయిన్‌గా అస్సాం బ్యూటీ భైరవి- సింగర్ సునీత కొడుకు హీరో!

ఈ క్రమంలోనే 'కొత్త మలుపు' చిత్రంతో భైరవి అనే కొత్త హీరోయిన్ తెలుగు తెరకు పరిచయమవుతోంది. అస్సాం నుంచి వచ్చిన ఈ నయా బ్యూటీ, సినిమా విడుదలకు ముందే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించింది.

ఇటీవల విడుదలైన కొత్త మలుపు సినిమా టీజర్‌, ట్రైలర్‌లలో భైరవి కనిపించిన తీరు, స్క్రీన్‌ ప్రెజెన్స్ చూసిన వారంతా టాలీవుడ్‌కు మరో ప్రామిసింగ్ హీరోయిన్ దొరికిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్‌తో పోలికలు

కొత్త మలుపు ట్రైలర్‌లో భైరవి క్యూట్ లుక్స్, ఆమె పలికించిన నేచురల్ ఎక్స్‌ప్రెషన్స్ చూసిన కొందరు నెటిజన్లు అప్పుడే ఆమెను నేషనల్ క్రష్ రష్మిక మందన్నాతో పోల్చడం మొదలుపెట్టారు. ముఖ్యంగా భైరవి నవ్వు, ఆమె ఫేస్ కట్ రష్మికను పోలి ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

కేవలం గ్లామర్ బొమ్మలా కాకుండా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలోనే భైరవి కనిపించనుందని ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చింది. అందంతో పాటు అభినయం కూడా ఉన్న హీరోయిన్ అనే టాక్ అప్పుడే ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో కాయదు లోహర్ లాంటి పరభాషా నటీమణులను తెలుగు ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకున్నట్లే, ఇప్పుడు భైరవి కూడా యువతకు కొత్త క్రష్‌గా మారిపోయింది.

తెలుగు భాషపై చూపించిన ప్రేమకు ప్రశంసలు

ఇతర భాషల నుంచి వచ్చినప్పటికీ స్థానిక ప్రేక్షకులను అలరించడానికి, వారి భాషలోనే మాట్లాడాలని భైరవి చూపించిన శ్రద్ధను నెటిజన్లు సైతం అభినందిస్తున్నారు. క్యూట్‌నెస్‌తో పాటు ఈ విధమైన డెడికేషన్ ఉంటే టాలీవుడ్‌లో లాంగ్ రన్ సొంతం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సింగర్ సునీత కుమారుడు హీరోగా

టీజర్, ట్రైలర్లతో క్రియేట్ అయిన పాజిటివ్ వైబ్స్ కొత్త మలుపు సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఒకవేళ థియేటర్లలో కూడా భైరవి తన నటనతో మెప్పిస్తే తెలుగులో ఆమెకు మరిన్ని ఆఫర్లు రావడం ఖాయమని తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా కొత్త మలుపు తెరకెక్కుతోంది.

జూన్ 12న వస్తున్న 'కొత్త మలుపు'

లవ్, ఎమోషన్స్ కలబోసిన ఈ 'కొత్త మలుపు' చిత్రం జూన్ 12న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. అటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు, ఇటు యూత్‌కు కనెక్ట్ అయ్యే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. అస్సాం నుంచి టాలీవుడ్ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్న భైరవికి ఈ సినిమా ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe