తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన సినిమా ‘బాహుబలి’. పదేళ్ల క్రితం మొదలైన ఈ సంచలనం ఇప్పుడు సరికొత్త రూపంలో మన ముందుకు వస్తోంది. బాహుబలి మొదటి భాగం విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళి రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ (Baahubali: The Epic) పేరుతో ఒకే సినిమాగా రూపొందించిన సంగతి తెలిసిందే.
ఓటీటీ తెరపై

థియేటర్లలో రికార్డులు సృష్టించిన ఈ స్పెషల్ వెర్షన్ బాహుబలి ది ఎపిక్ ఓటీటీ తెరపై రచ్చ చేసేందుకు సిద్ధమైంది. అది కూడా మరికొన్ని గంటల్లోనే బాహుబలి ది ఎపిక్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తన సబ్‌స్క్రైబర్స్‌కు భారీ క్రిస్మస్ గిఫ్ట్ ప్రకటించింది.
బాహుబలి ది ఎపిక్ ఓటీటీ స్ట్రీమింగ్
‘బాహుబలి: ది ఎపిక్’ వెర్షన్‌ను డిసెంబర్ 25 (గురువారం) అర్థరాత్రి నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడించింది. అంటే, దానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. థియేటర్లలో ఈ ఎపిక్ అనుభూతిని మిస్ అయిన వారికి, అలాగే మళ్లీ మళ్లీ చూడాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం అని తెలిపింది.
రాజమౌళి మార్క్ ‘రిమాస్టరింగ్’
దాదాపు 3 గంటల 40 నిమిషాల నిడివితో ఉండే ఈ వెర్షన్ ప్రేక్షకులకు ఏమాత్రం విరామం లేని ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుంది. కేవలం రెండు సినిమాలను కలపడం మాత్రమే కాకుండా ఈ ఎపిక్ వెర్షన్ కోసం రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
రీ రిలీజ్ కలెక్షన్స్‌లో
అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి విజువల్స్, సౌండ్ క్వాలిటీని మరింతగా మెరుగుపరిచారు. డాల్బీ అట్మాస్ సౌండ్, సరికొత్త కలర్ గ్రేడింగ్‌తో బాహుబలి ది ఎపిక్ సరికొత్త అనుభూతి పంచనుంది. గత అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన బాహుబలి ది ఎపిక్ దాదాపు రూ. 50 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి రీ-రిలీజ్ సినిమాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది.
పాత కథ-కొత్త కోణం
{{/usCountry}}అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి విజువల్స్, సౌండ్ క్వాలిటీని మరింతగా మెరుగుపరిచారు. డాల్బీ అట్మాస్ సౌండ్, సరికొత్త కలర్ గ్రేడింగ్‌తో బాహుబలి ది ఎపిక్ సరికొత్త అనుభూతి పంచనుంది. గత అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన బాహుబలి ది ఎపిక్ దాదాపు రూ. 50 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి రీ-రిలీజ్ సినిమాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది.
పాత కథ-కొత్త కోణం
{{/usCountry}}ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ వంటి స్టార్ యాక్టర్స్ నటనను నిరంతరాయంగా బాహుబలి ది ఎపిక్ ఓటీటీ రిలీజ్ ద్వారా చూసేయొచ్చు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? శివుడు మహిష్మతి రాజ్యాన్ని ఎలా దక్కించుకున్నాడు? అనే కథను మళ్లీ కొత్త కోణంలో చూడొచ్చు.
జియో హాట్‌స్టార్ ఓటీటీలో కూడా
ఇకపోతే నెట్‌ఫ్లిక్స్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో జియో హాట్‌స్టార్ ఓటీటీలో కూడా బాహుబలి ది ఎపిక్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అంటే, రెండు ఓటీటీల్లో మరికొన్ని గంటల్లో బాహుబలి ది ఎపిక్ ఓటీటీ రిలీజ్ కానుంది.