...
...
Next Story

రాజమౌళి తండ్రి కథలో చైల్డ్ ఆర్టిస్ట్- ఇప్పుడు బాలకృష్ణ అఖండ 2తో తెలుగులోకి ఎంట్రీ- ఎవరీ హర్షాలి మల్హోత్రా?

వారణాసి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన హర్షాలి మల్హోత్రా వెండితెరపై నేరుగా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. ఆ సినిమానే బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న అఖండ 2. మరి మున్నిగా ఆకట్టుకున్న హర్షాలి మల్హోత్రా గురించి తెలుసుకుందాం.

Published on: Nov 16, 2025, 11:47:52 IST
Advertisement

చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసి హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇవ్వడం సాధారణ విషయమే. అలా ఎంతోమంది ముద్దుగుమ్మలు వివిధ సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేశారు. అలానే తాజాగా మరొక చైల్డ్ ఆర్టిస్ట్ నటిగా ఎంట్రీ ఇవ్వనుంది. అయితే, బాలీవుడ్‌లో మున్నిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ బాల నటి నేరుగా టాలీవుడ్‌లో తెరంగేట్రం చేయడం విశేషంగా మారింది.

మున్నీగానే ఎక్కువ

రాజమౌళి తండ్రి కథలో చైల్డ్ ఆర్టిస్ట్- ఇప్పుడు బాలకృష్ణ అఖండ 2తో తెలుగులోకి ఎంట్రీ- ఎవరీ హర్షాలి మల్హోత్రా?
రాజమౌళి తండ్రి కథలో చైల్డ్ ఆర్టిస్ట్- ఇప్పుడు బాలకృష్ణ అఖండ 2తో తెలుగులోకి ఎంట్రీ- ఎవరీ హర్షాలి మల్హోత్రా?

ఆ చిన్నదే హర్షాలి మల్హోత్రా. హర్షాలి అంటే పెద్దగా ఎవరు గుర్తు పట్టరు. కానీ, మున్ని అంటే బాలీవుడ్ ఆడియెన్స్ ఎక్కువగా గుర్తు పడతారు. మున్నీగా హర్షాలి ఆకట్టుకున్న సినిమానే భజరంగీ భాయిజాన్. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా, బెబో కరీనా కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా హిందీ చిత్ర పరిశ్రమలో బ్లాక్ బస్టర్ హిట్.

హృదయాలను కొల్లగొట్టిన మూవీ

బాక్సాఫీస్ కలెక్షన్స్ తెచ్చిపెట్టడమే కాకుండా ఎంతోమంది ఆడియెన్స్ హృదయాలను కొల్లగొట్టింది ఈ సినిమా. హృద్యమైన కథతో తెరకెక్కిన ఈ సినిమాకు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అంతలా ఈ సినిమాలోని పాత్రలు ఆకట్టుకుంటాయి. అందులో ముఖ్యంగా మున్ని పాత్ర.

రాజమౌళి తండ్రి కథ

2015లో సూపర్ హిట్ అయిన ఈ భజరంగీ భాయిజాన్ సినిమాకు వారణాసి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించడం విశేషం. అయితే, ఇప్పుడు పదేళ్లకు నేరుగా తెలుగులో హర్షాలి మల్రోత్రా అరంగేట్రం చేస్తుంది. అది కూడా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మూవీతో.

అఖండ 2లో

అలాగే, ఈ ఈవెంట్‌లో బాలకృష్ణ-హర్షాలి మల్హోత్రా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం హర్షాలికి 17 ఏళ్లు. 2008 జూన్ 3న ముంబైలోని పంజాబీ కుటుంబంలో జన్మించింది. హర్షాలి కుటుంబం ఒక ఖత్రి తెగకు చెందింది.

హర్షాలి మల్హోత్రా సీరియల్స్

2012 నుంచి హిందీ బుల్లితెర సీరియల్స్‌లో హర్షాలి మల్హోత్రా నటిస్తోంది. కాబుల్ హై, లావుట్ ఆవో త్రిష, సావధాన్ ఇండియా వంటి సీరియల్స్‌తో ఆకట్టుకుంది హర్షాలి. అనంతరం 2017లో సబ్సే బడా కళాకార్ షోలో పాల్గొంది. 2015లో భజరంగీ భాయిజాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది హర్షాలి.

హర్షాలి మల్హోత్రా అవార్డ్స్

ఇక హర్షాలి తన నటనకు గానూ బిగ్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డ్స్, స్టార్ గైడ్, స్టార్‌డస్ట్, స్క్రీన్, జీ సినీ అవార్డ్స్‌ను గెలుచుకుంది. ఇవే కాకుండా పలు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, డ్యాన్స్ వీడియోలతో అలరించింది. ఇప్పుడు పదేళ్లకు బాలకృష్ణ అఖండ 2 మూవీతో తెలుగులో తానేంటో నిరూపించుకోనుంది హర్షాలి మల్హోత్రా.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe