...
...
Next Story

OTT Romantic Series: ఓటీటీ రొమాంటిక్ సిరీస్‌లో నటనపై విమర్శలు- అందుకే 9 నెలలు సినిమాలకు దూరం- హీరోయిన్ భూమి ఎమోషనల్

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ ది రాయల్స్‌. ఇషాన్ ఖట్టర్, భూమి పెడ్నెకర్ జోడీగా నటించిన ఈ సిరీస్‌ పర్వాలేదనిపించుకుంది. ఈ ఓటీటీ సిరీస్‌లో భూమి పెడ్నేకర్ నటన బాగా లేదని తెగ విమర్శలు వచ్చినట్లు, అందుకే 9 నెలలు బ్రేక్ ఇచ్చినట్లు హీరోయిన్ భూమి ఎమోషనల్‌గా చెప్పారు.

Published on: Jan 22, 2026, 20:00:52 IST
Advertisement

ఓటీటీ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ 'ది రాయల్స్'. ఈ ఓటీటీ సిరీస్‌లో తన నటనపై వచ్చిన విమర్శలు తనను తీవ్రంగా కలిచివేశాయని బ్యూటిపుల్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విమర్శల వల్ల కలిగిన మొద్దుబారిన స్థితి (మైండ్ బ్లాక్) నుంచి కోలుకోవడానికే తాను 9 నెలల పాటు నటనకు విరామం తీసుకున్నానని భూమి వెల్లడించారు.

ఓటీటీ రొమాంటిక్ సిరీస్‌లో నటనపై విమర్శలు- అందుకే 9 నెలలు సినిమాలకు దూరం- హీరోయిన్ భూమి ఎమోషనల్
ఓటీటీ రొమాంటిక్ సిరీస్‌లో నటనపై విమర్శలు- అందుకే 9 నెలలు సినిమాలకు దూరం- హీరోయిన్ భూమి ఎమోషనల్

బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ తన కెరీర్‌లో ఎప్పుడూ లేనంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నారు. 2025 మే నెలలో విడుదలైన ‘ది రాయల్స్’ సిరీస్ మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ, అందులో భూమి నటనపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. తాజాగా ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ చేదు జ్ఞాపకాలను భూమి పెడ్నేకర్ పంచుకున్నారు.

విమర్శల ధాటికి విలవిల..

ఓటీటీ సిరీస్ తర్వాత తనపై వచ్చిన విమర్శలు చూసి పూర్తిగా మొద్దుబారిపోయానని భూమి చెప్పారు. "చాలామంది నన్ను ట్రోల్ చేశారు, మరికొందరు నిర్మాణాత్మకమైన విమర్శలు చేశారు. కానీ, ఆ అనుభవం నన్ను తీవ్రంగా కలచివేసింది. 2025లో నేను కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి అదే కారణం" అని భూమి వివరించారు.

9 నెలల విరామం.. హార్వర్డ్‌లో చదువు!

ఆ విమర్శల తాకిడికి తాను ఒక నటిగా, ఒక వ్యక్తిగా తన అస్తిత్వాన్ని కోల్పోయినట్లు అనిపించిందని భూమి పెడ్నేకర్ ఎమోషనల్ అయ్యారు. "నేను జూన్ నుంచి సెట్స్‌లోకి వెళ్లలేదు. ఆ బ్రేక్‌ను నేను కావాలనే తీసుకున్నాను. దీని గురించి ఎటువంటి హడావుడి చేయకూడదని నిర్ణయించుకున్నాను. నాలోని ఎమోషన్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి. నేను అసలు నటించగలనా? నాలో ఆ సత్తా ఉందా? అని నాపై నాకే సందేహం కలిగింది" అని భూమి పేర్కొన్నారు.

"నాలో ఎప్పుడూ ఒక భయం ఉంటుంది.. నేను ఒక సాదాసీదా నటిగా మిగిలిపోకూడదని. కానీ, ఆ సమయంలో నేను అక్కడికే చేరుకున్నానని అనిపించింది. దానిని అంగీకరించి, నా తప్పులను సరిదిద్దుకోవడం ముఖ్యం అనిపించింది. అందుకే నా పాత సినిమాలను మళ్లీ చూసుకున్నాను" అని భూమి చెప్పుకొచ్చారు.

ఏమిటీ ‘ది రాయల్స్’?

కాగా, గత ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో ది రాయల్స్ ఓటీటీ స్ట్రీమింగ్‌‌కు వచ్చింది. ఈ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక రాజకుటుంబం తమ వారసత్వ భవనాన్ని లగ్జరీ రిసార్ట్‌గా మార్చే కథాంశంతో సాగుతుంది. ఇందులో ఇషాన్ ఖట్టర్, జీనత్ అమన్ వంటి హేమాహేమీలు నటించారు. కాగా, ఈ సిరీస్ రెండో సీజన్‌ కూడా ఓటీటీ ప్రీమియర్ కానుంది.

పోలీస్ ఆఫీసర్‌గా భూమి రీ-ఎంట్రీ

సుదీర్ఘ విరామం తర్వాత భూమి పెడ్నేకర్ మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాబోతున్న ‘దల్ దల్’ ఓటీటీ సిరీస్‌లో భూమి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. విశ్వ ధమీజా రాసిన 'భెండి బజార్' పుస్తకం ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ జనవరి 30న అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ రిలీజ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks