బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్ సీజన్ 4తో మంచి క్రేజ్ తెచ్చుకున్న తెలుగు అందం దివి వాద్యా. బిగ్ బాస్ అనంతరం వరుస సినిమాల్లో నటిస్తూ అలరిస్తోంది దివి వాద్య. తాజాగా బిగ్ బాస్ దివి కీలక పాత్ర పోషించిన తెలుగు హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ హనీ.
పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం

టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన హనీ సినిమాలో దివితోపాటు సీనియర్ నటుడు రాజా రవీంద్ర కూడా కీలక పాత్ర పోషించారు. పలాస ఫేమ్ కరుణ కుమార్ రచన, దర్శకత్వం వహించిన హనీ మూవీ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా హనీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు రాజా రవీంద్రపై బిగ్ బాస్ దివి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. దీంతో బిగ్ బాస్ దివి వాద్య కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అప్పుడు కుదరలేదు
మొదటగా హీరోయిన్ దివి మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. కరుణ కుమార్ గారితో పని చేయాలని నాకు ఎప్పటినుంచో ఉండేది. పలాస సినిమా సమయంలో కలిశాను. కానీ, కుదరలేదు. ఆయన నుంచి కాల్ వచ్చిన వెంటనే వెళ్లాను. ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైటెడ్‌గా ఫీలయ్యాను" అని అన్నారు.
"ఇందులో నవీన్ గారు, దివ్య, రాజా రవీంద్ర గారు ఇలా అందరూ ఒకరికి మించి ఒకరు పర్ఫామెన్స్ ఇచ్చే నటుల మధ్య నటించడం చాలా ఆనందంగా ఉంది. ఇది మీ అందరిని వెంటాడే సినిమా అవుతుంది. అందరూ ఫిబ్రవరి 6న థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలని కోరుకుంటున్నాను" అని బిగ్ బాస్ దివి తెలిపింది.
డార్క్ సైడ్ ఎక్స్‌ప్లోర్ అయినట్లు
దివి వాద్య స్పీచ్ తర్వాత హనీ మూవీలో క్యారెక్టర్ గురించి మీడియా పర్సన్ ప్రశ్నించారు. "మీ క్యారెక్టర్ డార్క్ సైడ్ ఉంటుందా. ట్రైలర్లో చూస్తున్నంత వరకు ఒక డార్క్ సైడ్ ఎక్స్‌ప్లోర్ అయినట్లు అనిపిస్తుంది" అని జర్నలిస్ట్ అడిగారు. దానికి సింపుల్‌గా దివి "అవునండి" అని అనేసింది.
{{/usCountry}}దివి వాద్య స్పీచ్ తర్వాత హనీ మూవీలో క్యారెక్టర్ గురించి మీడియా పర్సన్ ప్రశ్నించారు. "మీ క్యారెక్టర్ డార్క్ సైడ్ ఉంటుందా. ట్రైలర్లో చూస్తున్నంత వరకు ఒక డార్క్ సైడ్ ఎక్స్‌ప్లోర్ అయినట్లు అనిపిస్తుంది" అని జర్నలిస్ట్ అడిగారు. దానికి సింపుల్‌గా దివి "అవునండి" అని అనేసింది.
{{/usCountry}}అది విన్న వెంటనే పక్కనే ఉన్న సీనియర్ యాక్టర్ రాజా రవీంద్ర "ఏయ్.." అని వారిస్తూ అరిచాడు. "చెప్పొద్దా" అని దివి అంది. రాజా రవీంద్ర సైలెంట్‌గా ఉన్నాడు. "చెప్పండి కదా.. ఏంటండి.. ఇలా అందరిముందు బెదిరిస్తారు.. ఎవరు లేనప్పుడు మామిడి కాయలు ఇస్తారు" అని దివి వాద్య అంది.
రాజా రవీంద్ర వివరణ
దాంతో అక్కడున్న వాళ్లంతా ఒకేసారి నవ్వేశారు. దివి మాత్రం సిగ్గుతో తల దించుకుంది. "షూటింగ్ సమ్మర్‌లో జరిగింది" అని రాజా రవీంద్ర వివరణ ఇచ్చాడు. "ఎవరిచ్చారు సర్ మామిడి కాయలు" అని రిపోర్టర్ అడిగారు. "సెట్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు రాజా రవీంద్ర గారి హాస్పిటాలిటీ చాలా బాగుండేది. అదే నేను చెప్పాను, ఓకే" అని దివి వాద్య తెలిపింది.
ఇక జర్నలిస్ట్ మొదట అడిగిన ప్రశ్నకు.. "అవునండి, డార్క్ సైడ్ ఉంటుంది. ఈ సినిమా నుంచి డార్క్, ఇలాంటి నెగెటివ్ రోల్స్ ఇంకా వస్తాయని నేను అనుకుంటున్నాను. కరుణ కుమార్ గారు చాలా బాగా చేయించారు. నేనేనా ఇదంతా చేశాను అనిపించింది" అని బిగ్ బాస్ దివి వాద్య చెప్పుకొచ్చింది.