Bigg Boss Telugu 10 Elimination This Week: తెలుగు బుల్లితెర షో బిగ్ బాస్ మొదటి రోజు నుంచే జోరుగా సాగిపోతుంది. మొదటి వారం పూర్తి కాకముందే బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఊహించని విధంగా జరిగిన ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్స్‌లో ఒకరు కామనర్, మరొకరు సెలబ్రిటీ ఎలిమినేట్ అయ్యారు.
హై రిస్క్‌లో చైత్ర రాయ్

మొదటి వారం పూర్తి కాకముందే రెండ్రోజుల్లో ఇద్దరు ఎలిమినేట్ అవడం బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే తొలిసారిగా రికార్డుకెక్కింది. బిగ్ బాస్ 10 తెలుగు సెప్టెంబర్ 10వ తేది ఎపిసోడ్‌లో బ్లూ అండ్ రెడ్ టీమ్స్‌కి టాస్క్ ఇచ్చారు. దాంట్లో రెడ్ టీమ్ విన్ అయి సీరియల్ హీరోయిన్ చైత్ర రాయ్‌ను హై రిస్క్‌లో పెట్టారు రోహిత్, టెంపర్ వంశీ.
అలాగే, రోహిత్, టెంపర్ వంశీ హౌజ్‌మేట్స్ అయ్యారు. అంతకుముందు హై రిస్క్‌లో రామ్ ప్రసాద్, చరణ్ మహాదేవ్ ఉన్నారు. దాంతో ముగ్గురు హై రిక్స్ కంటెస్టెంట్స్ మధ్య ఎవరు సేవ్ అవ్వాలో నిర్ణయించుకోమని బిగ్ బాస్ చెప్పాడు. చాలా సేపు డిస్కషన్స్ తర్వాత రామ్ ప్రసాద్, చరణ్ కలిసి చైత్ర రాయ్‌ను ఎలిమినేష్ ప్రక్రియ నుంచి సేవ్ చేశారు.
చరణ్ మహాదేవ్ ఎలిమినేట్
కానీ, చైత్ర రాయ్ ఇంకా హై రిస్క్‌లోనే ఉన్నట్లు బిగ్ బాస్ తెలిపాడు. ఆ తర్వాత రామ్ ప్రసాద్, చరణ్ మహాదేవ్ ఇద్దరి మధ్య హౌజ్ కంటెస్టెంట్స్‌తో ఎలిమినేట్ ఎవరు అవ్వాలో ఓటింగ్ పెట్టారు. అందులో రామ్ ప్రసాద్ ఉండాలని ఏకంగా 10 ఓట్లు పడ్డాయి. చరణ్‌కు మాత్రం నాలుగు ఓట్లు వచ్చాయి. దాంతో కామనర్‌గా వచ్చిన చరణ్ మహాదేవ్ ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు.
తర్వాతి రోజు అయిన బిగ్ బాస్ 10 తెలుగు సెప్టెంబర్ 11వ తేది ఎపిసోడ్‌లో మహా పరీక్ష కొనసాగుతుందని, ఈజీ టాస్క్స్ ఎవరు, హార్డ్ టాస్క్‌లు ఎవరు చేస్తారో నిర్ణయించుకోమని అనౌన్స్మెంట్ వచ్చింది. హార్డ్ టాస్క్‌కు వారి వాదనలు విని అంతా కలిసి యాంకర్లు వర్షిణి సౌందరరాజన్, సుధీర్ రెడ్డిని దింపారు.
రెండ్రోజుల్లో ఇద్దరు అవుట్
{{/usCountry}}తర్వాతి రోజు అయిన బిగ్ బాస్ 10 తెలుగు సెప్టెంబర్ 11వ తేది ఎపిసోడ్‌లో మహా పరీక్ష కొనసాగుతుందని, ఈజీ టాస్క్స్ ఎవరు, హార్డ్ టాస్క్‌లు ఎవరు చేస్తారో నిర్ణయించుకోమని అనౌన్స్మెంట్ వచ్చింది. హార్డ్ టాస్క్‌కు వారి వాదనలు విని అంతా కలిసి యాంకర్లు వర్షిణి సౌందరరాజన్, సుధీర్ రెడ్డిని దింపారు.
రెండ్రోజుల్లో ఇద్దరు అవుట్
{{/usCountry}}కానీ ఆ హార్డ్ టాస్క్‌లో ఇద్దరు ఫెయిల్ అయ్యారు. దాంతో ఇద్దరు హై రిస్క్‌లోకి వెళ్లారు. ఇక హై రిస్క్‌లో ఉన్న చైత్ర రాయ్, వర్షిణి, సుధీర్‌కు ఎలిమినేషన్ ఓటింగ్‌ను వారిలోనే పెట్టాడు బిగ్ బాస్. వర్షిణి, సుధీర్ ఇద్దరు కలిసి చైత్ర రాయ్‌ను ఎలిమినేట్ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. దాంతో చైత్ర రాయ్ కూడా ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది.
అలా రెండు రోజుల్లో మిడ్ వీక్ ఎలిమినేషన్స్‌లో భాగంగా కామనర్ చరణ్ మహాదేవ్, సీరియల్ హీరోయిన్ చైత్ర రాయ్ ఎలిమినేట్ అయ్యారు. అయితే, వీరు రీ ఎంట్రీ కూడా ఇస్తారని ఒక టాక్ నడుస్తోంది. ఇక రేపు (సెప్టెంబర్ 13) అంటే ప్రతి వారం జరిగే ఎలిమినేషన్‌లో భాగంగా మరొకరు కూడా ఎలిమినేట్ కానున్నారు.
అతనే ఎలిమినేట్ అవుతాడంటూ
ఆడియెన్స్ వేసే బిగ్ బాస్ ఓటింగ్ ప్రకారం అధిక ఓట్స్‌తో టాప్ 1గా రోహిత్ ఉండగా.. చివరి మూడు స్థానాల్లో యాంకర్లు వర్షిణి సౌందర రాజన్, సుధీర్ రెడ్డి, నటుడు కృష్ణుడు ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా వీకెండ్ ఎలిమినేషన్‌లో యాక్టర్ కృష్ణుడు 99 శాతం ఎలిమినేట్ అవుతాడని పోల్స్ చెబుతున్నాయి. మరి చూడాలి రేపు ఎలాంటి ట్విస్టులు బిగ్ బాస్ తెలుగు 10లో చోటు చేసుకుంటాయనేది.