...
...
Next Story

Bigg Boss 10: ఇవాళ బిగ్ బాస్ మినీ గ్రాండ్ లాంచ్- కొత్తగా 5గురు- నిన్ను కోరి సీరియల్ హీరో నుంచి కొరియోగ్రాఫర్ భార్య వరకు!

Bigg Boss Telugu 10 Mini Grand Launch Today: బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ సరికొత్తగా హంగులతో సాగిపోతుంది. ఇవాళ బిగ్ బాస్ నుంచి అపూర్వ, చరణ్ మహదేవ్ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. వీరి స్థానంలోకి కొత్తగా ఐదుగురు వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. మరి వారెవరు, వారు ఏం చేసేవారో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Oct 11, 2026, 15:44:59 IST
Advertisement

Bigg Boss 10 Telugu Mini Grand Launch Today: తెలుగు ఓటీటీ రియాలిటీ షో బిగ్ బాస్ జోరుగా సాగుతోంది. ఊహించని ట్విస్టులు, టాస్కులు, గొడవలతో అలరిస్తోంది. సెప్టెంబర్ 6న 16 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెట్టారు.

ఇవాళ ఇద్దరు ఎలిమినేట్

ఇవాళ బిగ్ బాస్ మినీ గ్రాండ్ లాంచ్- కొత్తగా 5గురు- నిన్ను కోరి సీరియల్ హీరో నుంచి కొరియోగ్రాఫర్ భార్య వరకు!
ఇవాళ బిగ్ బాస్ మినీ గ్రాండ్ లాంచ్- కొత్తగా 5గురు- నిన్ను కోరి సీరియల్ హీరో నుంచి కొరియోగ్రాఫర్ భార్య వరకు!

వారిలో మొదటి వారమే ఇంకా చెప్పాలంటే రెండు రోజులకే చరణ్ మహదేవ్ ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు. ఆ తర్వాత 2 రోజులకు చైత్ర రాయ్ ఎలిమినేట్ అయింది. మొదటి వారంలోనే ఇద్దరు ఎలిమినేట్ కాగా మూడో వారంలో చరణ్ రీ ఎంట్రీ ఇచ్చాడు.

అతనితోపాటు కామనర్స్ అయిన మిథిలేష్, అపూర్వ కూడా బిగ్ బాస్ 10 తెలుగు హౌజ్‍‌లోకి అడుగుపెట్టారు. కానీ, వచ్చిన రెండు రోజులకే రూ. 15 లక్షల ఆఫర్ అందుకుని మిథిలేష్ ఎగ్జిట్ అయ్యాడు. ఇక ఇవాళ (అక్టోబర్ 11) అపూర్వ, చరణ్ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు.

వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్‌తో

దీనికి సంబంధించిన బిగ్ బాస్ తెలుగు 10 అక్టోబర్ 11 ఎపిసోడ్ షూటింగ్ పూర్తి అయిపోయింది. ఇప్పటికే అపూర్వ ఎలిమినేట్ అయినట్లుగా తాజాగా విడుదల చేసిన ప్రోమోలో చూపించారు. అనంతరం చరణ్ ఎలిమినేట్ అవుతాడు. ఇద్దరు ఎలిమినేట్ కావడంతో హౌజ్‌లోకి కొత్తగా వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ వస్తున్నారంటూ నాగార్జున ప్రకటించాడు.

వారు అడుగుపెట్టడంతో పాటు కొంత డబ్బును కూడా హౌజ్‌లోకి తీసుకెళ్లారు. ఆ డబ్బుతో బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ పెరగనుంది. ఇదిలా ఉంటే, మరి ఇవాళ బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన ఆ కొత్త ఐదుగురు కంటెస్టెంట్స్ ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

శివకుమార్ మరిహాల్ (Shivakumar Marihal)

నిన్ను కోరి సీరియల్‌లో హీరో విరాట్ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటుడు శివకుమార్ మరిహాల్. కోయిలమ్మ వంటి సీరియల్స్ మాత్రమే కాకుండా బీబీ జోడీ షోలో కూడా పాల్గొన్నాడు శివకుమార్. అంతేకాకుండా ఇతను బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ లవర్ కావడం విశేషం. శివకుమార్ కూడా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

శ్వేతా నాయుడు (Swetha Naidu)

సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్, ఢీ షోలో డ్యాన్సర్‌గా మంచి పేరు తెచ్చుకుంది శ్వేతా నాయుడు. బిగ్ బాస్ తెలుగు 4 సీజన్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్ సేతో కలిసి సాంగ్స్, వీడియోలు చేసింది. డ్యాన్స్, ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు, రీల్స్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్వేతా నాయుడు వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టింది.

దక్షి గుత్తికొండ (Dakkshi Guttikonda)

దక్షి గుత్తికొండ ఒక తెలుగు సినిమా నటి. రామ్ గోపాల్ వర్మ నిర్మించిన కరోనా వైరస్ సినిమాలో రాణిగా దక్షి గుత్తికొండ నటించింది. అలాగే, ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్ సినిమాతోపాటు లివింగ్ మై డ్రీమ్ ఓటీటీ సిరీస్ కూడా చేసింది దక్షి. ఆర్జీవీ బ్యూటీగా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టింది దక్షి గుత్తికొండ.

కామనర్ రామకృష్ణ (Ramakrishna Koyya)

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2లో తన ఆటతో, నిజాయితీతో ఆకట్టుకున్నాడు రామకృష్ణ. బిగ్ బాస్ తెలుగు 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీ సమయంలో మిథిలేష్‌తో పోరాడి ఓడిపోయాడు. దాంతో రామకృష్ణ ఎంట్రీ అవ్వలేకపోయాడు. కానీ, ఇప్పుడు వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్‌లా రామకృష్ణ బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టాడు.

నీతూ నటరాజ్ (Neethu Natraj)

తెలుగులో కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న నటరాజ్ మాస్టర్ భార్య నీతూ నటరాజ్. ఈమె కూడా ఒక కొరియోగ్రాఫరే. పలు టీవీ షోలలో డ్యాన్స్ పర్ఫార్మ్ చేసింది. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో కూడా మెరిసిన నీతూ నటరాజ్ బిగ్ బాస్ 10లోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ ఓటీటీ నాన్‌స్టాప్ సీజన్‌‌లో నటరాజ్ మాస్టర్ పాల్గొన్న విషయం తెలిసిందే.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks