Bigg Boss Telugu 10 September 27 Episode: తెలుగు బుల్లితెర రియాలిటీ షో రోజుకోపుంతలు తొక్కుతోంది. ఊహించని వ్యూహాలతో అటు ఆడియెన్స్‌కు ఇటు కంటెస్టెంట్స్‌కు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తోంది బిగ్ బాస్ తెలుగు 10 సీజన్.
కంటెస్టెంట్స్ మధ్య తీవ్ర వాగ్వాదం

బిగ్ బాస్ 10 తెలుగులోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా వచ్చిన మిథిలేష్ రెడ్డి రూ. 15 లక్షలు తీసుకుని హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇదంతా శనివారం (సెప్టెంబర్ 26) నాటి ఎపిసోడ్‌లో జరిగింది. మిథిలేష్ వెళ్లగానే హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇక ఆదివారం నాటి బిగ్ బాస్ తెలుగు 10 సెప్టెంబర్ 27 ఎపిసోడ్‌లో ఎప్పుడు నిర్వహించే ఎలిమినేషన్ విధానాన్ని అమలుపరిచాడు హోస్ట్ నాగార్జున. ఒక్కొక్కరుగా సేవ్ అవుతూ ఎలిమినేషన్ గండం నుంచి తప్పించుకున్నారు. చివరికి ఇద్దరు మిగిలి ఆ తర్వాత ఒక్కరు ఎలిమినేట్ కావాలి. కానీ, ఈసారి ఒక చిన్న మెలికతో నాగార్జున ద్వారా ట్విస్ట్ ఇప్పించాడు బిగ్ బాస్.
ఎలిమినేషన్‌లో ఇద్దరు
బిగ్ బాస్ 10 తెలుగు మూడో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో చివరిగా యాంకర్ వర్షిణి సౌందరరాజన్, టాలీవుడ్ విలన్ టెంపర్ వంశీ ఇద్దరు మిగిలారు. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారని యాక్టివేట్ రూమ్‌కి పంపించాడు నాగార్జున. ఇక్కడ హాల్‌లో కొత్త కెప్టెన్ అయిన గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడతో నాగార్జున ఓ డీల్ మాట్లాడాడు.
"వర్షిణి, వంశీలో ఎవరైనా ఒక్కరు కచ్చితంగా ఎలిమినేట్ అవుతారు. వారిద్దరు అలా ఎలిమినేట్ కాకుండా ఉండాలంటే నువ్వో పని చేయాలి" అని నాగార్జున చెప్పాడు. దానికి ఏంటని ముఖేష్ అడిగాడు. "నీ కెప్టెన్సిషిప్ను కోల్పోవాలి. అలా చేస్తే నీ కెప్టెన్సీ పోతుంది. అలాగే, నీకు వచ్చిన ఇమ్యూనిటీ పోతుంది. దాంతోపాటు నెక్ట్స్ నామినేషన్స్‌కి డైరెక్ట్ నామినేట్ అవుతావ్" అని హోస్ట్ నాగార్జున వివరించాడు.
నాకు కెప్టెన్సీ వద్దు సార్
{{/usCountry}}"వర్షిణి, వంశీలో ఎవరైనా ఒక్కరు కచ్చితంగా ఎలిమినేట్ అవుతారు. వారిద్దరు అలా ఎలిమినేట్ కాకుండా ఉండాలంటే నువ్వో పని చేయాలి" అని నాగార్జున చెప్పాడు. దానికి ఏంటని ముఖేష్ అడిగాడు. "నీ కెప్టెన్సిషిప్ను కోల్పోవాలి. అలా చేస్తే నీ కెప్టెన్సీ పోతుంది. అలాగే, నీకు వచ్చిన ఇమ్యూనిటీ పోతుంది. దాంతోపాటు నెక్ట్స్ నామినేషన్స్‌కి డైరెక్ట్ నామినేట్ అవుతావ్" అని హోస్ట్ నాగార్జున వివరించాడు.
నాకు కెప్టెన్సీ వద్దు సార్
{{/usCountry}}"వర్షిణి, వంశీ ఇద్దరు పొటెన్షియల్ ఉన్న కంటెస్టెంట్సే. ఇద్దరు ఎలిమినేట్ అవడం నాకు ఇష్టం లేదు సర్. నేను నా కెప్టెన్సీని వదులుకుంటాను. నామినేషన్స్‌లో ఉండటానికి కూడా నాకు ఎలాంటి ఇబ్బందేం లేదు" అని ముఖేష్ గౌడ చెప్పాడు. "నాకు అలా వద్దు సర్. ఆడియెన్స్ ఎలాంటి తీర్పు ఇచ్చారో అదే ఫాలో అవుతా" అని వర్షిణి అంది.
"నువ్వు ఓకే.. కానీ వంశీ కూడా ఉన్నాడుగా. అయినా ఇది మీకు సంబంధం లేదు. ఇది ముఖేష్‌కు ఇచ్చే టెంప్టేషన్ అండ్ టెన్షన్. మీకు టెంప్టేషన్ ముఖేష్‌కి మాత్రమే టెన్షన్" అని నాగార్జున అన్నాడు. మరోసారి బాగా ఆలోచించుకుని చెప్పమని నాగార్జున అడగ్గా.. ముఖేష్ కెప్టెన్సీ వద్దని చెప్పాడు.
అపూర్వకు కెప్టెన్సీ బాధ్యతలు
దాంతో ఈసారి ఎలిమినేషన్ లేదు అని నాగార్జున ప్రకటించాడు. అలా తన కెప్టెన్సీషిప్‌ను త్యాగం చేసి వర్షిణి, వంశీని ఎలిమినేషన్ నుంచి కాపాడాడు సీరియల్ హీరో ముఖేష్ గౌడ. ఆ తర్వాత ముఖేష్‌కు ఉన్న కెప్టెన్సీ బ్యాడ్జ్‌ను తీయమని అపూర్వను ఆదేశించాడు నాగార్జున. ఆ బ్యాడ్జ్‌ని అపూర్వకు కట్టమని అమన్‌కి చెప్పాడు నాగార్జున.
అంటే, నెక్ట్స్ వీక్ కెప్టెన్‌గా ముఖేష్ స్థానంలోకి అపూర్వ తుంగతుర్తి వచ్చింది. కెప్టెన్సీ కోసం పోటీ పడిన టాస్క్‌లో ముఖేష్, అపూర్వ ఇద్దరు జంటగా ఆడారు. అంటే, ఇద్దరు గెలిచినట్లు. ఇక ముఖేష్ త్యాగం చేయడంతో అపూర్వకు కెప్టెన్ పదవి అనే జాక్‌పాట్ తగిలింది.
వెనువెంటనే జాక్‌పాట్
బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చిన రోజే కెప్టెన్సీ కంటెండర్‌గా మారడం, అందులో గెలిచి ఇమ్యూనిటీ పొందడమే కాకుండా ఇప్పుడు కెప్టెన్‌గా కూడా అయింది అపూర్వ. ఇలా వెనువెంటనే జాక్‌పాట్ కొట్టింది లేడి కామనర్ కంటెస్టెంట్ అపూర్వ తుంగతుర్తి.