Bigg Boss 10 Telugu Voting Second Week: బిగ్ బాస్ షో రోజు రోజు మరింత ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. కంటెస్టెంట్ల మధ్య ఇగోలు, పోటీలు, గొడవలు, పగలు జోరుగానే సాగుతున్నాయి. అప్పటివరకు పోట్లాడిన కంటెస్టెంట్స్ గ్రూపులుగా మారడం వంటి ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.
బిగ్ బాస్ ఓటింగ్‌లో ట్విస్టులు

కంటెస్టెంట్ల ఆట తీరు మాత్రమే కాకుండా ఆడియెన్స్ వేసే బిగ్ బాస్ ఓటింగ్‌లో కూడా ట్విస్టులు జరుగుతున్నాయి. తాజాగా ఈ ఈవారం బిగ్ బాస్ ఓటింగ్ తారుమారైంది. అయితే, బిగ్ బాస్ తెలుగు 10 ఈ వారం నామినేషన్స్‌లో 11 మంది కంటెస్టెంట్స్ ఉన్న విషయం తెలిసిందే.
బిగ్ బాస్ 10 తెలుగు రెండో వారం త్రిగుణ్, రోహిత్, రామ్ ప్రసాద్, ముఖేష్ గౌడ, దేబ్జానీ మోదక్, వర్షిణి, సుధీర్, శాలిని పటేల్, సృష్టి, కృష్ణుడు, ఝాన్సీ 11 మంది నామినేట్ అయ్యారు. రెండో వారం నామినేషన్స్ పూర్తయిన వెంటనే వీరికి ఓటింగ్ పోల్ పెట్టారు బిగ్ బాస్ మేకర్స్.
టాప్ 1లోకి దూసుకెళ్లిన త్రిగుణ్
అయితే, ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు 10 ఓటింగ్‌లో టాప్ 1 ప్లేసులో కామనర్ అయిన రోహిత్ నాయుడు అత్యధిక ఓట్లతో నిలుస్తూ వచ్చాడు. కానీ, తాజాగా రోహిత్‌ను దాటుకుని టాప్ 2 నుంచి టాప్ 1 స్థానంలోకి ఎగబాకాడు సినీ హీరో త్రిగుణ్. 32.07 శాతం ఓటింగ్ (31,967 ఓట్లు)తో టాప్ 1 ప్లేసుతో దూసుకుపోతున్నాడు హీరో త్రిగుణ్.
త్రిగుణ్ తర్వాత 30.55 శాతం (30,451 ఓట్లు) ఓటింగ్‌తో రోహిత్ రెండో స్థానంలోకి పడిపోయాడు. త్రిగుణ్, రోహిత్ మధ్య కేవలం ఒకటిన్నర శాతం మాత్రమే తేడా ఉంది. ఇక మూడో స్థానంలో సీరియల్ హీరో ముఖేష్ గౌడ 10.03 శాతం ఓటింగ్- 9,999 ఓట్లతో నిలిచాడు. ఈ ముగ్గురి మధ్య టాప్ ప్లేస్‌కి గట్టి పోటీ నడుస్తోంది.
ఎవరికి ఎంత ఓటింగ్
{{/usCountry}}త్రిగుణ్ తర్వాత 30.55 శాతం (30,451 ఓట్లు) ఓటింగ్‌తో రోహిత్ రెండో స్థానంలోకి పడిపోయాడు. త్రిగుణ్, రోహిత్ మధ్య కేవలం ఒకటిన్నర శాతం మాత్రమే తేడా ఉంది. ఇక మూడో స్థానంలో సీరియల్ హీరో ముఖేష్ గౌడ 10.03 శాతం ఓటింగ్- 9,999 ఓట్లతో నిలిచాడు. ఈ ముగ్గురి మధ్య టాప్ ప్లేస్‌కి గట్టి పోటీ నడుస్తోంది.
ఎవరికి ఎంత ఓటింగ్
{{/usCountry}}7.59 శాతం ఓటింగ్ (7,564 ఓట్లు)తో జబర్దస్త్ రామ్ ప్రసాద్ 4వ స్థానంలో, 5.35 శాతం ఓటింగ్-5,330 ఓట్లతో సీరియల్ హీరోయిన్ దేబ్జానీ మోదక్ ఐదో ప్లేసులో, 3.84 శాతం ఓటింగ్-3,831 ఓట్లతో శాలిని ఆరో స్థానంలో, 2.4 శాతం ఓటింగ్-2,390 ఓట్లతో ఝాన్సీ 7వ ప్లేసులో ఉన్నారు.
అలాగే, సృష్టి వ్యాకరణం 2.24 శాతం ఓటింగ్-2,235 ఓట్లతో 8వ స్థానంలో ఉంటే యాంకర్ సుధీర్ రెడ్డి 2.06 శాతం ఓటింగ్-2,055 ఓట్లతో 9వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇక చివరి రెండు 10, 11 స్థానాల్లో నటుడు కృష్ణుడు, యాంకర్ వర్షిణి ఉన్నారు. 1.96 శాతం ఓటింగ్-1,953 ఓట్లు కృష్ణుడుకి వస్తే.. 1.9 శాతం ఓటింగ్-1,896 ఓట్లు వర్షిణి తెచ్చుకుంది.
చివరి రెండు స్థానాల వారికి ఎలిమినేషన్ గండం
ఇదిలా ఉంటే, ఈ వారం అంటే బిగ్ బాస్ 10 తెలుగు రెండో వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని సమాచారం. మొదటి వారం ఇద్దరి కంటెస్టెంట్స్‌ను మిడ్ వీక్‌లో ఎలిమినేట్ చేసి ఒకరిని తిరిగి హౌజ్‌లోకి తీసుకొచ్చారు. అలాగే, రెగ్యులర్ వీకెండ్‌కి నో ఎలిమినేషన్ ట్విస్ట్ ఇచ్చారు.
కాబట్టి, ఈ కారణాలతో ఈ వారం బిగ్ బాస్‌లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ లెక్కన బిగ్ బాస్ ఓటింగ్‌లో చివరి రెండు 10, 11 స్థానాల్లో ఉన్న కృష్ణుడు, వర్షిణికి ఎలిమినేషన్ గండం పొంచి ఉందని తెలుస్తోంది. సింగిల్ ఎలిమినేషన్ ఉంటే వీరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే వీరిద్దరు ఇంటి నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది.