Bigg Boss Telugu 10 Trigun Vs Aman Vs Temper Vamsi: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 10 రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటివరకు ఏ బిగ్ బాస్ సీజన్‌లో లేని విధంగా 10లో డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నారు నిర్వాహకులు.
బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ నుంచి

బిగ్ బాస్ 10 తెలుగు ఈ వారం టెంప్టేషన్ అండ్ టెన్షన్ అనే థీమ్ సాగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ టెంప్టేషన్‌లో భాగంగా హౌజ్‌మేట్స్‌కి రూ. 15 లక్షల ఆఫర్ ఇచ్చారు. అది బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతుందని కూడా చెప్పారు. దాంతో ఆ 15 లక్షలను రెండు రోజుల క్రితమే వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన మిథిలేష్ రెడ్డి తీసుకుని ఎలిమినేట్ అయ్యాడు.
అయితే, ఇదంతా జరిగే క్రమంలో మిథిలేషన్‌ను మిగతా కంటెస్టెంట్స్ వెళ్లకుండా ఉండేందుకు కన్విన్స్ చేయడంతోపాటు హౌజ్‌మేట్స్ ఒప్పుకునేందుకు మిథిలేష్ కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించడం వంటివి జరిగాయి. ఈ ప్రాసెస్‌లో మిథిలేష్ ఆ డబ్బు తీసుకోడానికి అంగీకరిస్తున్నట్లు సృష్టి, శాలిని, రోహిత్, రామ్ ప్రసాద్, వర్షిణి, చరణ్, అపూర్వ, అమన్ చేయి ఎత్తారు.
15 లక్షలతో మిథిలేష్ ఎలిమినేషన్
అంతేకాకుండా జబర్దస్త్ రామ్ ప్రసాద్ అయితే మనకు కావాల్సింది కప్ గానీ డబ్బు కాదు అని మరి మిథిలేష్ చేతిలే 15 లక్షల సూట్‌కేస్ పెట్టి పంపించాడు. మిథిలేష్ వెళ్లిపోయాడు. దీని తర్వాత హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య అగ్గి రాజుకుంది. రామ్ ప్రసాద్‌ను నిల్చోబెట్టి త్రిగుణ్, ముఖేష్ కడిగేశారు.
"అతను తీసుకెళ్తుంది విన్నర్ డబ్బులు. అలా ఎలా పంపిస్తావ్" అని ముఖేష్ అంటే.. "వాడిని లోపల నుంచి నామినేట్ చేసి బయటకు పంపాలి గానీ డబ్బులతో ఎలా పంపిస్తావ్" అని త్రిగుణ్ కోపంగా అన్నాడు. మరోవైపు "అతనికి ఆఫర్ ఇచ్చారు. అతను పిక్ చేసుకుని వెళ్లాడు" అని తన కామనర్స్ గ్యాంగ్‌తో రోహిత్ అన్నాడు. అంటే, బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్‌ని అతను తీసుకోవడాన్ని సమర్ధించాం. తప్పులేదన్నట్లుగా రోహిత్ మాటలు ఉన్నాయి.
సిగ్గు శరం లేదు
{{/usCountry}}"అతను తీసుకెళ్తుంది విన్నర్ డబ్బులు. అలా ఎలా పంపిస్తావ్" అని ముఖేష్ అంటే.. "వాడిని లోపల నుంచి నామినేట్ చేసి బయటకు పంపాలి గానీ డబ్బులతో ఎలా పంపిస్తావ్" అని త్రిగుణ్ కోపంగా అన్నాడు. మరోవైపు "అతనికి ఆఫర్ ఇచ్చారు. అతను పిక్ చేసుకుని వెళ్లాడు" అని తన కామనర్స్ గ్యాంగ్‌తో రోహిత్ అన్నాడు. అంటే, బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్‌ని అతను తీసుకోవడాన్ని సమర్ధించాం. తప్పులేదన్నట్లుగా రోహిత్ మాటలు ఉన్నాయి.
సిగ్గు శరం లేదు
{{/usCountry}}"వచ్చిన రెండు రోజుల్లో డబ్బులు తీసుకుని వెళ్తాడంట.. దీనికి వీళ్లు చేతులు ఎత్తుతారంట.. సిగ్గు శరం లేదు" అని టెంపర్ వంశీ ముందు త్రిగుణ్ చాలా కోపంగా అన్నాడు. తర్వాత అమన్ దగ్గరికి వెళ్లిన ముఖేష్.. "డబ్బులు తీసుకునేది ప్రొడక్షన్ నుంచి కాదు. ఒక విన్నర్ నుంచి" అని అన్నాడు. "నా డబ్బులు అవి" అని త్రిగుణ్ అన్నాడు.
"నాది కాదా" అని అమన్ రిప్లై ఇచ్చాడు. "అలా అయితే గేమ్ గెలిచి ఇవ్వాలి వాడికి" అని అమన్‌పై త్రిగుణ్, ముఖేష్ పడ్డారు. "ఒక్కొక్కడి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కడిది. వాడి థింగ్‌లో ఆలోచించా. నువ్వు మూసుకుని కూర్చో. చేతకాకుంటే పడుకో" అని అమన్ అన్నాడు.
త్రిగుణ్ వర్సెస్ అమన్ వర్సెస్ టెంపర్ వంశీ
దాంతో "జాగ్రత్తగా రాని మాటలు" అంటూ త్రిగుణ్ సీరియస్ అయ్యాడు. త్రిగుణ్, అమన్ ఏంట్రా, ఏంటీ అంటూ వాదించుకున్నారు. టెంపర్ వంశీ వచ్చి ఇద్దరిని కూల్ చేసేందుకు ట్రై చేశాడు. కానీ, ఎవరు వినలేదు. త్రిగుణ్ వెళ్తున్న అమన్ అరవడం వినకపోయేసరికి సహనం కోల్పోయిన టెంపర్ వంశీ "నన్ను రెచ్చగొట్టకు" అని వార్నింగ్ ఇచ్చాడు.
ఇలా మొత్తంగా హోస్ట్ నాగార్జున ద్వారా ఇచ్చిన 15 లక్షల టెంప్టేషన్ ఆఫర్ కంటెస్టెంట్స్ మధ్య అగ్గిరాజేసింది. చివరికి త్రిగుణ్ వర్సెస్ అమన్ వర్సెస్ టెంపర్ వంశీగా మారింది. ఇందులో రోహిత్, మిగతా కామనర్స్ ఇన్వాల్వ్ అయ్యారా లేదా అన్నది నేటి బిగ్ బాస్ తెలుగు 10 సెప్టెంబర్ 27 ఎపిసోడ్‌లో తెలుస్తుంది.