బిగ్ బాస్ 9 తెలుగు జోరుగా సాగుతోంది. ఊహించని ట్విస్టులు, ఎలిమినేషన్స్, మాజీ కంటెస్టెంట్స్ ఎంట్రీతో ఆకట్టుకుంటోంది. పదకొండో వారం ఫ్యామిలీ వీక్ సాగగా పన్నెండో వారం బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ వచ్చి ప్రస్తుత బిగ్ బాస్ సీజన్ 9 హౌజ్‌మేట్స్‌తో పోటీ పడుతూ టాస్క్‌లు ఆడారు.
మాజీ కంటెస్టెంట్స్ ఎంట్రీ

బిగ్ బాస్ తెలుగు 8 రన్నరప్ గౌతమ్ కృష్ణతో మొదలైన ఈ ఎంట్రీ బ్రహ్మముడి మానస్, ప్రేరణ కంబం, హీరో సయ్యద్ సోహైల్, దేత్తడి హారిక, ప్రిన్స్ యావర్, శోభా శెట్టితో సాగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే పన్నెండో వారం కూడా ముగిసిపోనుంది. అంటే ఈ వీకెండ్ కూడా కంటెస్టెంట్స్ ఎలిమినేషన్‌ను ఫేస్ చేయనున్నారు.
నామినేషన్స్‌లో 8 మంది
బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నామినేషన్స్‌లో 8 మంది ఉన్నారు. వారిలో కల్యాణ్ పడాల, తనూజ గౌడ, భరణి శంకర్, దివ్య నిఖితా, ఇమ్మాన్యూయెల్, సంజన గల్రాని, సుమన్ శెట్టి, డిమాన్ పవన్ ఇలా ఎనిమిది మంది బిగ్ బాస్ 9 తెలుగు 12వ వారం నామినేట్ అయ్యారు. వీరికి ఓటింగ్ పోల్ నిర్వహిస్తూనే ఇమ్యూనిటీ పెంచుకునే టాస్క్ ఆడించారు.
ఇద్దరు పోటాపోటీగా
అయితే, బిగ్ బాస్ ఓటింగ్‌లో కల్యాణ్ పడాల, సీరియల్ హీరోయిన్ తనూజ పుట్టస్వామి ఇద్దరు పోటాపోటీగా ఉంటున్నారు. ఒక్కోరోజు ఒకరు టాప్ 1 ఓటింగ్‌లో ఉంటున్నారు. ఈ వారం అంతా అలాగే సాగింది. అయితే, ఇద్దరి మధ్య అతి తక్కువ తేడాతో ఓటింగ్ నమోదు అవుతోంది.
కల్యాణ్‌ను దాటేసిన హీరోయిన్
మొన్నటి వరకు టాప్ 1లో కల్యాణ్ సాగుతూ వస్తున్నాడు. కానీ, ఈ మధ్య కల్యాణ్‌ను తనూజ దాటేసి ముందంజలోకి వచ్చేస్తోంది. ఇక యూట్యూబ్ పోల్స్‌లో అయితే కల్యాణ్ పడాల కంటే తనూజ పుట్టస్వామికి పది శాతం ఓట్లు అధికంగా పడుతున్నారు. ఈ లెక్కన ప్రస్తుతం టాప్ 1 స్థానంలో తనూజ గౌడనే ఉన్నట్లు తెలుస్తోంది.
మంచి కంటెస్టెంట్స్ డేంజర్‌లో
{{/usCountry}}మొన్నటి వరకు టాప్ 1లో కల్యాణ్ సాగుతూ వస్తున్నాడు. కానీ, ఈ మధ్య కల్యాణ్‌ను తనూజ దాటేసి ముందంజలోకి వచ్చేస్తోంది. ఇక యూట్యూబ్ పోల్స్‌లో అయితే కల్యాణ్ పడాల కంటే తనూజ పుట్టస్వామికి పది శాతం ఓట్లు అధికంగా పడుతున్నారు. ఈ లెక్కన ప్రస్తుతం టాప్ 1 స్థానంలో తనూజ గౌడనే ఉన్నట్లు తెలుస్తోంది.
మంచి కంటెస్టెంట్స్ డేంజర్‌లో
{{/usCountry}}ఇక డేంజర్ జోన్‌లో నలుగురు మంచి కంటెస్టెంట్సే ఉన్నారు. వారు కామనర్ డిమాన్ పవన్, సీరియల్ విలన్ భరణి శంకర్, బుజ్జిగాడు హీరోయిన్ సంజన గల్రాని, కమెడియన్ సుమన్ శెట్టి. ఈ నలుగురికి దాదాపుగా సమానంగా ఓటింగ్ పడుతోందట. వీరిలో ఎవరు ముందు ఉన్నారు ఎవరు చివరిలో ఉన్నారో చెప్పడం కష్టంగా ఉందని రివ్యూవర్స్ చెబుతున్నారు.
ఈ వారం డబుల్ ఎలిమినేషన్
దాంతో ఈ నలుగురిలోనే ఈ వారం ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. అంతేకాకుండా ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ చేసే ఛాన్స్ ఉందని ఇన్‌సైడ్ టాక్. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవనున్నారు అని తెలుస్తోంది.