ఊహించని ఎలిమినేషన్స్, అనూహ్యమైన ట్విస్టులు, గొడవలు, అరుపులు, సోల్జర్ కార్డ్స్, సింపతీ గేమ్స్, ఏడుపులు, కన్నీళ్లు, టాస్క్‌లతో బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ బాగానే సాగింది. ఇక మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ముగిసిపోనుంది. అందుకు సుమారుగా ఇంకో వారం ఉందనుకోవచ్చు.
టాప్ 2 ఫైనలిస్ట్స్

మొన్నటి వరకు బిగ్ బాస్ హౌజ్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉండేవారు. వారిలో మొదటి ఫైనలిస్ట్‌గా కల్యాణ్ పడాల నిలిస్తే రెండో ఫైనలిస్ట్‌గా స్థానం సంపాదించుకుంది. ఇకపోతే గతవారం అంటే బిగ్ బాస్ 9 తెలుగు 14వ వారం డబుల్ ఎలిమినేషన్ చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
శనివారం నాటి ఎపిసోడ్‌లో కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వగా.. ఆదివారం నాడు సీరియల్ నటుడు భరణి శంకర్ రెండోసారి ఎలిమినేషన్‌కు గురయ్యాడు. బిగ్ బాస్ హౌజ్‌లో ఐదుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. వారిలో టాప్ 3 నుంచి టాప్ 5 ఫైనలిస్ట్‌లను హోస్ట్ నాగార్జున ప్రకటించారు.
ఈ ఇద్దరి మధ్య గట్టి పోటీ
టాప్ 3 ఫైనిలిస్ట్‌గా డిమాన్ పవన్ నిలవగా.. టాప్ 4లో ఇమ్మాన్యూయెల్ ప్లేస్ సంపాదించుకున్నాడు. ఇక టాప్ 5 ఫైనలిస్ట్‌గా బుజ్జిగాడు హీరోయిన్ సంజన గల్రానీ నిలిచింది. అయితే, ఈ టాప్ 5 ఫైనలిస్ట్‌లలో తనూజ గౌడ వర్సెస్ కల్యాణ్ పడాల మధ్యే బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్ రేసు గట్టిగా జరుగుతోంది.
ఈ ఇద్దరిలోనే బిగ్ బాస్ 9 తెలుగు టైటిల్ విన్నర్ రానున్నారని సమాచారం. అయితే, ఇప్పుడున్న టాప్ 5 ఫైనలిస్ట్‌లలో ముగ్గురు బిగ్ బాస్ తెలుగు 9 విజేతగా నిలిచి ట్రోఫీ ఎత్తితే బీబీ చరిత్రలోనే ఎవరు క్రియేట్ చేయని రికార్డ్ నమోదు అవుతుందని రివ్యూవర్స్ విశ్లేషిస్తున్నారు.
తనూజ గౌడ విన్నర్ అయితే!
{{/usCountry}}ఈ ఇద్దరిలోనే బిగ్ బాస్ 9 తెలుగు టైటిల్ విన్నర్ రానున్నారని సమాచారం. అయితే, ఇప్పుడున్న టాప్ 5 ఫైనలిస్ట్‌లలో ముగ్గురు బిగ్ బాస్ తెలుగు 9 విజేతగా నిలిచి ట్రోఫీ ఎత్తితే బీబీ చరిత్రలోనే ఎవరు క్రియేట్ చేయని రికార్డ్ నమోదు అవుతుందని రివ్యూవర్స్ విశ్లేషిస్తున్నారు.
తనూజ గౌడ విన్నర్ అయితే!
{{/usCountry}}ఒకవేళ బిగ్ బాస్ 9 తెలుగు టైటిల్ విజేతగా సీరియల్ హీరోయిన్ తనూజ పుట్టస్వామి నిలిస్తే.. టీవీ సీజన్‌లోనే (ఓటీటీ సీజన్‌లో బిందు మాధవి విజేత) మొదటి లేడి విన్నర్ అవుతుంది. తనూజపై సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ స్ప్రెడ్ అయింది. వాటన్నింటిని తట్టుకుని, గెలవాలనే పట్టుదల ఉంటే విజయం వరిస్తుందని తర్వాతి లేడి కంటెస్టెంట్స్‌కు ఉదాహరణగా నిలిస్తుందని ఓ రివ్యూవర్ చెప్పారు.
డిమాన్ పవన్ విజేతగా నిలిస్తే!
డిమాన్ పవన్ గనుక బిగ్ బాస్ విజేతగా నిలిస్తే పీఆర్ బ్యాచెస్‌కు గట్టి షాక్ తగిలినట్టే అని అంటున్నారు. సోల్జర్ కార్డ్, పూర్ ట్యాగ్ వేసుకున్న కల్యాణ్ పడాల పీఆర్ టీమ్ చాలా పెద్దదని, ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా ప్రమోట్ చేస్తారని రివ్యూవర్స్ చెబుతున్నారు. అలాంటి పీఆర్ టీమ్‌ను దాటి, ఏమాత్రం పీఆర్ లేకుండా జెన్యూన్ ఓట్లతో గెలిస్తే డిమాన్ పవన్ హిస్టరీ క్రియేట్ చేసినట్లే అంటున్నారు.
ఓ కమెడియన్ టైటిల్ విన్నర్ అయితే!
ఇక జబర్దస్త్ ఇమ్మాన్యూయెల్ బిగ్ బాస్ విన్నర్ అయితే ఒక కమెడియన్ బీబీ విజేత అవ్వలేడనే ట్యాగ్‌ను చెరిపేసి సరికొత్త చరిత్ర సృష్టించినాడు అవుతుడాని టాక్ నడుస్తోంది. ఇప్పటివరకు ఎంతోమంది కమెడియన్స్ బిగ్ బాస్ ఆడియెన్స్‌ను నవ్వించారు. కానీ, వారికి టైటిల్ విన్నర్ ట్రోఫీ అందలేదు.
అలాంటిది బిగ్ బాస్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు తన మాటలతో, చేతలతో నవ్వించడమే కాకుండా టాస్క్‌ల్లో కూడా రాణించి బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు ఇమ్మాన్యూయెల్. అలాంటి ఇమ్మాన్యూయెల్ విజేతగా నిలిస్తే కమెడియన్స్ అందరికి ఒక హోప్ ఇచ్చినట్లు అవుతుందని బీబీ విశ్లేషకుల అంచనా.