బిగ్ బాస్ 9 తెలుగు తుది ఘట్టానికి చేరువైంది. మరి కొన్ని రోజుల్లో బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ పూర్తి కానుంది. ఈ వారం టికెట్ టు ఫినాలే పొంది కల్యాణ్ పడాల ఫైనల్స్‌కు వెళ్లిన మొదటి కంటెస్టెంట్‌గా నిలిచాడు. దాంతో టికెట్ టు ఫినాలే గెలుచుకునేందుకు మిగతా కంటెస్టెంట్స్ మధ్య పోటీ నెలకొంది.
డబుల్ ఎలిమినేషన్ ఛాన్స్

ఇక ఈ వీకెండ్‌తో బిగ్ బాస్ తెలుగు 9 పదమూడో వారం కూడా పూర్తి కానుంది. అయితే, బిగ్ బాస్ 9 తెలుగు ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్‌కు ఛాన్స్ ఉందని బీబీ వర్గాల నుంచి వచ్చిన కొన్ని లీక్స్ చెబుతున్నాయి. అలాగే, ఈ వారం ఎలిమినేషన్‌కు డేంజర్‌లో నలుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు.
నామినేషన్స్‌లో ఆరుగురు
బిగ్ బాస్ 9 తెలుగు 13వ వారం ఆరుగురు నామినేషన్స్‌లోకి వచ్చారు. తనూజ పుట్టస్వామి, భరణి శంకర్, సంజన గల్రాని, సుమన్ శెట్టి, డిమాన్ పవన్, రీతూ చౌదరి ఆరుగురు నామినేట్ అయ్యారు. వీరిలో మొదటి నుంచి బిగ్ బాస్ ఓటింగ్‌లో టాప్ 1 ప్లేసులో సీరియల్ హీరోయిన్ తనూజ గౌడ దూసుకుపోతోంది.
మొదటి స్థానంలో తనూజ
27.99 శాతం ఓటింగ్ (50,386 ఓట్లు)తో తనూజ పుట్టస్వామి మొదటి స్థానంలో నిలవగా.. 15.52 శాతం ఓటింగ్ (27,947 ఓట్లు)తో డిమాన్ పవన్ రెండో ప్లేసులో ఉన్నాడు. 15.28 శాతం ఓటింగ్ (27,13 ఓట్లు)తో భరణి శంకర్ 3వ స్థానంలో, 14.11 శాతం ఓటింగ్ (25,399 ఓట్లు)తో నాలుగో ప్లేసులో రీతూ చౌదరి ఉన్నారు.
డేంజర్ జోన్‌లో నలుగురు
ఇక చివరి రెండు స్థానాలు అయిన ఐదారు స్థానాల్లో సుమన్ శెట్టి, సంజన గల్రాని ఉన్నారు. 13.89 శాతం ఓటింగ్ (24,998 ఓట్లు)తో ఐదో స్థానంలో సుమన్ శెట్టి ఉంటే 13.21 శాతం ఓటింగ్ (23,773 ఓట్లు)తో ఆరో ప్లేసులో సంజన ఉంది. వీరిలో చివరి బాటమ్ నాలుగు స్థానాల్లో ఉన్న భరణి, రీతూ, సుమన్ శెట్టి, సంజన డేంజర్ జోన్‌లో ఉన్నారని టాక్.
ఒక్కో పోల్స్‌లో ఒక్కోలా
{{/usCountry}}ఇక చివరి రెండు స్థానాలు అయిన ఐదారు స్థానాల్లో సుమన్ శెట్టి, సంజన గల్రాని ఉన్నారు. 13.89 శాతం ఓటింగ్ (24,998 ఓట్లు)తో ఐదో స్థానంలో సుమన్ శెట్టి ఉంటే 13.21 శాతం ఓటింగ్ (23,773 ఓట్లు)తో ఆరో ప్లేసులో సంజన ఉంది. వీరిలో చివరి బాటమ్ నాలుగు స్థానాల్లో ఉన్న భరణి, రీతూ, సుమన్ శెట్టి, సంజన డేంజర్ జోన్‌లో ఉన్నారని టాక్.
ఒక్కో పోల్స్‌లో ఒక్కోలా
{{/usCountry}}అయితే, ఒక్కో పోల్స్‌లో ఒక్కోలా బిగ్ బాస్ ఓటింగ్ ఉంది. ఒకదాంట్లో బాటమ్ 3లో రీతూ, సంజన, సుమన్ ఉంటే మరోదాంట్లో రీతూ, భరణి, సుమన్ ఉంటున్నారు. అంతేకాకుండా కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయినట్లు బిగ్ బాస్ వర్గాల నుంచి ఓ లీక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సుమన్ శెట్టి ఎలిమినేట్
బిగ్ బాస్ 9 తెలుగు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని, అందులో భాగంగా సుమన్ శెట్టి ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఎలిమినేట్ అయిన తర్వాత ప్లే చేసే బిగ్ బాస్ జర్నీ వీడియోను ముందుగానే రెడీ చేస్తారు. దీని ఆధారంగా ఈ వారం సుమన్ శెట్టి ఎలిమినేట్ అయినట్లు టాక్ నడుస్తోంది.