Ananya Panday With Aarav Bhatia In London: బాలీవుడ్ భామ, లైగర్ హీరోయిన్ అనన్య పాండే సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా దంపతుల కుమారుడు ఆరవ్ భాటియాతో కలసి అనన్య గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకున్నారు.
లండన్ వెకేషన్‌లో

లండన్ వెకేషన్‌లో వీరిద్దరూ తమ స్నేహితులతో సరదాగా సమయాన్ని గడిపారు. స్వయంగా తయారు చేసిన మఫిన్ కేకులను చేతిలో పట్టుకుని, ఎంతో క్యాజువల్ లుక్‌లో కనిపించిన ఆరవ్, అనన్య ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై పలువురు పలురకాలుగా స్పందిస్తున్నారు.
తెర వెనుకే ఉండటానికి మొగ్గు చూపుతున్న ఆరవ్
సాధారణంగా స్టార్ కిడ్స్ అనగానే సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం లేదా నిరంతరం వార్తల్లో నిలవడం చూస్తుంటాం. అయితే ఆరవ్ భాటియా వైఖరి ఇందుకు పూర్తి భిన్నం. 2002 సెప్టెంబర్ 15న జన్మించిన ఆరవ్, బాలీవుడ్‌లోని అత్యంత లీడింగ్ కుటుంబంలో పుట్టినప్పటికీ గ్లామర్ ప్రపంచానికి, కెమెరా వెలుగులకు దూరంగా ఉండటానికే ఇష్టపడతారు.
అప్పుడప్పుడు కుటుంబ సభ్యులతో బయట కనిపించినా, సోషల్ మీడియా హంగామాకు లేదా సినిమా ప్రచారాలకు ఆయన దూరంగా ఉంటారు. తన వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచుకోవడానికే ఆయన ప్రాధాన్యమిస్తారు.
బాక్సాఫీస్ నిరాశ నుంచి కొత్త ప్రాజెక్టుల వైపు
మరోవైపు అనన్య పాండే ఇటీవల 'తూ మేరీ మే తేరా' (కార్తీక్ ఆర్యన్‌తో), 'చాంద్ మేరా దిల్' (లక్ష్యతో) సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయాయి. దీంతో ప్రస్తుతం ఆమె ఓటీటీ ప్రాజెక్టులపై దృష్టి సారించారు.
ఓటీటీలో విశేష ఆదరణ పొందిన హిట్ వెబ్ సిరీస్ 'కాల్ మీ బే' (Call Me Bae) రెండో సీజన్ త్వరలోనే రానుంది. ఇందులో బెల్లా బే చౌదరి పాత్రలో అనన్య పాండే మరోసారి అలరించనున్నారు. ఈ ఓటీటీ సిరీస్ రెండో సీజన్‌లో నటి శ్రుతి హాసన్ కూడా ఒక కీలక పాత్రలో చేరడం విశేషం. జర్మనీలో జరిగిన అమెజాన్ ప్రైమ్ వీడియో ఈవెంట్లో ఈ సిరీస్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
'కాల్ మీ బే 2' లో సరికొత్త ట్విస్టులు
{{/usCountry}}ఓటీటీలో విశేష ఆదరణ పొందిన హిట్ వెబ్ సిరీస్ 'కాల్ మీ బే' (Call Me Bae) రెండో సీజన్ త్వరలోనే రానుంది. ఇందులో బెల్లా బే చౌదరి పాత్రలో అనన్య పాండే మరోసారి అలరించనున్నారు. ఈ ఓటీటీ సిరీస్ రెండో సీజన్‌లో నటి శ్రుతి హాసన్ కూడా ఒక కీలక పాత్రలో చేరడం విశేషం. జర్మనీలో జరిగిన అమెజాన్ ప్రైమ్ వీడియో ఈవెంట్లో ఈ సిరీస్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
'కాల్ మీ బే 2' లో సరికొత్త ట్విస్టులు
{{/usCountry}}"ఈ కొత్త సీజన్‌లో లవ్ ట్రయాంగిల్స్, ప్రేమ కోణాలు మరిన్ని ఉంటాయి. బే, నెయిల్, అగ్గీల మధ్య నడిచే డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బే పాత్ర ఈసారి మరింత పరిణతి చెందిన జర్నలిస్టుగా కనిపిస్తుంది" అని అనన్య పాండే పేర్కొన్నారు. కథనంలో డ్రామాతో పాటు మంచి సంగీతం కూడా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
యాంకర్‌గా కొత్త అవతారం
నటనతో పాటు సరికొత్త బాధ్యతలను స్వీకరించడానికి అనన్య సిద్ధమయ్యారు. ప్రతిష్టాత్మక ఐఐఎఫ్ఏ (IIFA) అవార్డుల వేడుకకు అనన్య పాండే మొదటిసారి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అబుదాబి వేదికగా జరగనున్న ఈ కార్యక్రమాన్ని కరణ్ జోహార్, వరుణ్ ధావన్, మనీష్ పాల్‌లతో కలసి అనన్య నడిపించనున్నారు.