...
...
Next Story

TV Actors: టీవీ అనేది చెత్తకుప్ప, సీరియల్ నటులు వింతగా ప్రవర్తిస్తారన్న సీనియర్ నటుడు- క్యాస్టింగ్ డైరెక్టర్ కౌంటర్లు

Mukesh Chhabra Slams Rohit Roy About TV Actors: టీవీ మాధ్యమాన్ని డస్ట్ బిన్ అని, టీవీ నటులకు హుందాతనం ఉండదని సీనియర్ నటుడు రోహిత్ రాయ్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. వాటిని తిప్పికొడుతూ స్టార్ కాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ ఛాబ్రా గట్టి కౌంటర్స్ ఇచ్చారు. దీంతో ఈ టాపిక్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Published on: Sep 13, 2026, 15:09:49 IST
Advertisement

Mukesh Chhabra Slams Rohit Roy Over TV Actors: బుల్లితెర (టెలివిజన్) పరిశ్రమ, అందులో పనిచేసే నటీనటులపై సీనియర్ నటుడు రోహిత్ రాయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. టీవీ మాధ్యమాన్ని ఒక డస్ట్ బిన్ (చెత్తబుట్ట)తో పోల్చడమే కాకుండా, పబ్లిక్ ఈవెంట్లలో టీవీ నటులు ప్రవర్తించే తీరు బాగోదని ఆయన విమర్శలు గుప్పించారు.

టీవీ అనేది చెత్తకుప్ప, సీరియల్ నటులు వింతగా ప్రవర్తిస్తారన్న సీనియర్ నటుడు- క్యాస్టింగ్ డైరెక్టర్ కౌంటర్లు
టీవీ అనేది చెత్తకుప్ప, సీరియల్ నటులు వింతగా ప్రవర్తిస్తారన్న సీనియర్ నటుడు- క్యాస్టింగ్ డైరెక్టర్ కౌంటర్లు

అయితే ఈ వ్యాఖ్యలపై ప్రముఖ క్యాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ ఛాబ్రా తక్షణమే స్పందించారు. టీవీ నటుల గొప్పదనాన్ని, వారి శ్రమను కొనియాడుతూ రోహిత్ రాయ్‌కి పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చారు.

రోహిత్ రాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు

యూట్యూబ్ టాక్ షో 'కిండిల్ కాస్ట్' ఇంటర్వ్యూలో రోహిత్ రాయ్ పాల్గొని టీవీ రంగంపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. "టీవీ అనేది ఒక డస్ట్ బిన్ లాంటి మాధ్యమం. ఈ రోజు చూసిన సీరియల్ రేపటికి పాత పేపర్ లాగా మారిపోతుంది. దాన్ని ఎవరూ గుర్తుపెట్టుకోరు. కానీ సినిమాలో నటించడం అనేది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది" అని రోహిత్ రాయ్ అన్నారు.

సినిమా నటులతో పోలిస్తే టీవీ నటులకు క్రమశిక్షణ, హుందాతనం తక్కువని రోహిత్ రాయ్ ఆరోపించారు. "సినిమా స్టార్లు బయటకు వస్తే ఎంతో హుందాగా, ఒక డిగ్నిటీతో, స్టైలిష్‌గా కనిపిస్తారు. కానీ టీవీ నటుల ఈవెంట్లను గమనిస్తే వారి ప్రవర్తన, వేసుకునే దుస్తులు వేరేలా ఉంటాయి. ఫొటోగ్రాఫర్లు కనిపించగానే విపరీతంగా అరుస్తూ, వింతగా ప్రవర్తిస్తుంటారు" అని రోహిత్ రాయ్ పేర్కొన్నారు.

సీరియళ్లతోనే పాపులర్ అయిన రోహిత్ రాయ్

రోహిత్ రాయ్ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారిన వేళ, బాలీవుడ్ స్టార్ కాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ ఛాబ్రా టీవీ నటులకు బహిరంగంగా మద్దతు పలికారు. 'జవాన్', 'దంగల్', 'ధురంధర్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు కాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన ముకేశ్, సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా టీవీ నటులను ప్రశంసల్లో ముంచెత్తారు.

"మేము వెతికి పట్టుకున్న నటులలో ఎక్కువ మంది టెలివిజన్ రంగానికి చెందినవారే. టీవీ నటులు నిజంగానే అద్భుతమైన ప్రతిభావంతులు" అని ముకేశ్ ఛాబ్రా స్పష్టం చేశారు. టీవీ నటీనటులకు ఉండే డైలాగ్ జ్ఞాపకశక్తి, ప్రతిరోజూ పనిచేసే ఓపిక, వేగంగా మారే పరిస్థితులకు అలవాటు పడే నైపుణ్యం అసాధారణమైనవని ఆయన కొనియాడారు.

కాస్తా అభిమానం ఎక్కువ

"వారు పనిపట్ల చూపించే క్రమశిక్షణ, అంకిత భావాన్ని నేను ఎంతగానో గౌరవిస్తాను. నాకు అందరి నటులూ ఇష్టమే, కానీ టీవీ నటులపై కాస్త ఎక్కువ అభిమానం ఉంటుంది" అని ముఖేశ్ ఛాబ్రా రాసుకొచ్చారు.

వెండితెరకు బాటలు వేస్తున్న బుల్లితెర

రోహిత్ రాయ్ టీవీ రంగాన్ని తక్కువ చేసి మాట్లాడినప్పటికీ, సినీ పరిశ్రమకు అత్యంత ప్రతిభావంతులైన నటులను అందించిన ఘనత టెలివిజన్ రంగానికే దక్కుతుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వంటి నటులు టీవీ సీరియళ్ల నుంచే వచ్చి వెండితెరపై సంచలనాలు సృష్టించారు.

సుశాంత్ చివరి చిత్రం 'దిల్ బెచారా'కి ముకేశ్ ఛాబ్రానే దర్శకత్వం వహించడం విశేషం. మన తెలుగు సినీ పరిశ్రమలో కూడా నేచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ వంటి హీరోలు లేదా రష్మి గౌతమ్, అనసూయ భరద్వాజ్ వంటి నటీనటులు మొదట బుల్లితెర, యాంకరింగ్ వేదికల ద్వారానే ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

కష్టపడే తత్వమే ముఖ్యం

ఆ తర్వాతే వెండితెరపై తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మాధ్యమం ఏదైనా నటుడి ప్రతిభ, కష్టపడే తత్వమే ముఖ్యమని, ఏ రంగాన్నీ తక్కువ చేసి చూడకూడదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks