సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. 'ఓ పిట్ట కథ', 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' సినిమాలకు దర్శకత్వం వహించిన చెందు ముద్దు నుంచి వస్తున్న తాజా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా 'రేపు ఉదయం 10 గంటలకు'. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో విడుదలవుతోన్న ఈ సినిమా ఇది.
రేపు ఉదయం 10 గంటలకు నటీనటులు

తాజాగా మార్చి 3 (మంగళవారం) 'రేపు ఉదయం 10 గంటలకు' మూవీ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. 'రేపు ఉదయం పది గంటలకు' సినిమాలో అభినవ్ గోమటం, హెబ్బా పటేల్, చైతన్య రావు, కిరీటి దామరాజు, వాసు ఇంటూరి, సాహితి అవంచ, మోహిత్ ప్రధాన పాత్రలు పోషించారు.
టైటిల్ వెనుక గడియారంలో
'రేపు ఉదయం 10 గంటలకు' ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే.. గడియారాన్ని హైలైట్ చేశారు. టైటిల్ వెనుక ఒక క్లాక్, నటీనటులు అందరి వెనుక మరొక క్లాక్ ఉన్నాయి. టైటిల్ వెనుక గడియారంలో పది గంటలు చూపిస్తే... ఆర్టిస్టుల వెనుక గడియారంలో రెండు గంటల సమయాన్ని చూపించారు. వీటి వెనుక కథ తెలియాలంటే 'రేపు ఉదయం 10 గంటలకు' టీజర్, ట్రైలర్ విడుదల వరకు వెయిట్ చేయాలి.
చెందు మొద్దు దర్శకత్వం
చెందు ముద్దు దర్శకత్వం వహించిన 'రేపు ఉదయం పది గంటలకు' సినిమాను రామ్ వీరపనేని నిర్మిస్తున్నారు. త్వరలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్ర బృందం బిజీగా ఉంది. త్వరలో విడుదల తేదీని వెల్లడించనున్నారు.
సినిమా టెక్నిషియన్స్
'రేపు ఉదయం పది గంటలకు' చిత్రానికి మాంగో మాస్ మీడియా సమర్పకులుగా ఉన్నారు. సినిమాటోగ్రాఫర్‌గా సునీల్ కుమార్ నామా వహించారు. ప్రిన్స్ హెన్రీ సంగీత దర్శకత్వం వహించనున్నారు. డి. వెంకట ప్రభు ఎడిటర్‌గా వర్క్ చేస్తున్న 'రేపు ఉదయం 10 గంటలకు' సినిమాకు రామ్ వీరపనేని నిర్మాతగా వ్యవహరించనున్నారు.
హెబ్బా పటేల్ సినిమాలు
{{/usCountry}}'రేపు ఉదయం పది గంటలకు' చిత్రానికి మాంగో మాస్ మీడియా సమర్పకులుగా ఉన్నారు. సినిమాటోగ్రాఫర్‌గా సునీల్ కుమార్ నామా వహించారు. ప్రిన్స్ హెన్రీ సంగీత దర్శకత్వం వహించనున్నారు. డి. వెంకట ప్రభు ఎడిటర్‌గా వర్క్ చేస్తున్న 'రేపు ఉదయం 10 గంటలకు' సినిమాకు రామ్ వీరపనేని నిర్మాతగా వ్యవహరించనున్నారు.
హెబ్బా పటేల్ సినిమాలు
{{/usCountry}}ఇకపోతే హెబ్బా పటేల్ ఇటీవల వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇటీవలే మ్యారియో సినిమాతో అలరించిన హెబ్బా పటేల్ గతేడాది ఈషా, థ్యాంక్యూ డియర్, ఓదెల 2, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమాలతో ఆకట్టుకుంది.
చైతన్య రావు సినిమాలు
అలాగే, చైతన్య రావు కూడా వరుసగా సినిమాలు చేస్తూ హీరోగా, విలన్‌గా ఆకట్టుకుంటున్నాడు. ఘాటి, అన్నపూర్ణ స్టూడియో, షరతులు వర్తిస్తాయి, తెప్ప సముద్రం, పారిజాత పర్వం, డియర్ నాన్న, కోడా కీలా సినిమాల్లో వివిధ రోల్స్ చేస్తూ అలరించాడు. వీటితోపాటు మయసభ ఓటీటీ సిరీస్‌తో డిజిటల్ స్ట్రీమింగ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు.
ఇది వరకు హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమాతో
ఇదిలా ఉంటే, హెబ్బా పటేల్, చైతన్య రావు ఇదివరకు కలిసి నటించిన సినిమా హనీమూన్ ఎక్స్‌ప్రెస్. రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ తర్వాత చైతన్య రావు, హెబ్బా పటేల్ కలిసి నటించిన రెండో సినిమానే ఈ రేపు ఉదయం 10 గంటలకు.