ఓటీటీలోకి నిన్న రిలీజైన ఛాంపియ‌న్‌, శంబాల‌, దండోరా-ఒక్కో ప్లాట్‌ఫామ్‌లో ఒక్కోటి-స్ట్రీమింగ్ ఎక్క‌డంటే?

క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న మూడు క్రేజీ తెలుగు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. ఇవి ఒక్కోటి ఒక్కో డిఫరెంట్ జోనర్లో తెరకెక్కాయి. అవే ఛాంపియన్, శంబాల, దండోరా. మరి ఈ మూడు చిత్రాలు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతాయో చూసేయండి. 

Published on: Dec 26, 2025, 13:42:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

థియేటర్లలో తెలుగు సినిమాల సందడి కొనసాగుతోంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఒకే రోజు మూడు క్రేజీ తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ మూడు డిఫరెంట్ జోనర్లలో తెరకెక్కాయి. ఒకటి పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ఛాంపియన్ కాగా, మరొకటి హారర్ థ్రిల్లర్ శంబాల, ఇంకోటి సోషల్ డ్రామా దండోరా. ఈ మూడు సినిమాలకు మంచి టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాల ఓటీటీ రిలీజ్ లపై ఓ లుక్కేయండి.

ఓటీటీలో ఛాంపియన్, శంబాల, దండోరా (x)
ఓటీటీలో ఛాంపియన్, శంబాల, దండోరా (x)

ఛాంపియన్ ఓటీటీ

సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ లీడ్ రోల్ ప్లే చేసిన మూవీ ఛాంపియన్. ఇది పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సమయంలోని స్పోర్ట్స్ స్టోరీగా ఛాంపియన్ మూవీ రిలీజైంది. డిసెంబర్ 25న ఇది థియేటర్లకు వచ్చింది.

ఛాంపియన్ మూవీ శాటిలైట్ రైట్స్ ను జీ నెట్ వర్క్ సొంతం చేసుకుంది. ఈ సినిమా టీవీలో అయితే జీ తెలుగులో రానుంది. ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సాధారణంగా నాలుగు వారాల విండో తర్వాత ఛాంపియన్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చే అవకాశముంది.

శంబాల ఓటీటీ

ఆది సాయి కుమార్ ఓ హిట్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు. సీనియర్ నటుడు సాయి కుమార్ తనయుడైన ఆదికి శంబాలతో హిట్ దక్కినట్లే కనిపిస్తోంది. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ గా శంబాల తెరకెక్కింది. ఈ మూవీ కూడా గురువారం రిలీజైంది.

శంబాల సినిమా ఓటీటీ రైట్స్ ను ఆహా ఓటీటీ సొంతం చేసుకుంది. ఈ సినిమా కూడా నాలుగు వారాల థియేట్రికల్ విండో తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.

దండోరా ఓటీటీ

శివాజీ కాంట్రవర్సీ కామెంట్లు ఇంకా ఇంటర్నెట్ ను షేక్ చేస్తూనే ఉన్నాయి. ఈ కామెంట్లు దండోరా మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లోనే చేశారు. ఇలా దండోరా సినిమాపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. గురువారం థియేటర్లకు వచ్చిన ఈ సోషల్ డ్రామా దండోరా ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇందులో శివాజీ, బిందు మాధవి, నవదీప్ కీలక పాత్రలు పోషించారు.

దండోరా సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో కైవసం చేసుకుంది. ఈ సోషల్ డ్రామా నాలుగు వారాల థియేట్రికల్ రన్ తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. అంటే ఛాంపియన్, దండోరా, శంబాల సినిమాలు జనవరి 20 నుంచి 28 మధ్య ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More