...
...
Next Story

70 ఏళ్లలోనూ చిరంజీవి క్రేజ్- మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్స్ అదుర్స్- ప్రభాస్ రాజా సాబ్ కంటే 6 రెట్లు ఎక్కువ!

70 ఏళ్ల వయసులోనూ తన బాక్సాఫీస్ స్టామినా తగ్గలేదని మెగాస్టార్ చిరంజీవి నిరూపిస్తున్నారు. 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం 5వ రోజున భారీ వసూళ్లు సాధించడమే కాకుండా, ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా రూ. 226 కోట్లకు పైగా గ్రాస్ సాధించి సంచలనం సృష్టిస్తోంది.

Published on: Jan 18, 2026, 08:56:41 IST
Advertisement

వయసు కేవలం అంకె మాత్రమేనని, మాస్ ఇమేజ్ విషయంలో తనకు సాటి ఎవరూ లేరని మెగాస్టార్ చిరంజీవి (70) మరోసారి చాటి చెప్పారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (MSVPG) బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ ‘ది రాజా సాబ్’ నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ, అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది.

200 కోట్లు దాటి

70 ఏళ్లలోనూ చిరంజీవి క్రేజ్- మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్స్ అదుర్స్- ప్రభాస్ రాజా సాబ్ కంటే 6 రెట్లు ఎక్కువ!
70 ఏళ్లలోనూ చిరంజీవి క్రేజ్- మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్స్ అదుర్స్- ప్రభాస్ రాజా సాబ్ కంటే 6 రెట్లు ఎక్కువ!

మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 226 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటేసి రికార్డులు సృష్టిస్తోంది. అయితే, ట్రేడ్ విశ్లేషకుల సమాచారం ప్రకారం, ఈ యాక్షన్ కామెడీ చిత్రం 5వ రోజున ఇండియాలో ఏకంగా రూ. 19.5 కోట్ల షేర్‌ను సాధించింది.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అదే రోజున ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ వసూళ్ల కంటే ఇది ఆరు రెట్లు ఎక్కువ. వీక్‌డేస్‌లో కూడా ఈ స్థాయి వసూళ్లు రావడం మెగాస్టార్ మేనియాకు నిదర్శనం.

ఆరో రోజు కలెక్షన్స్

అలాగే, ఆరో రోజున మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు ఇండియాలో రూ. 18.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయినట్లు సమాచారం. ఈ లెక్కన ఇప్పటివరకు ఈ సినిమా మొత్తం భారతీయ నెట్ వసూళ్లు రూ. 139.85 కోట్లకు చేరాయి. రాబోయే వారాంతంలో ఈ సంఖ్య మరిన్ని రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

థియేటర్ ఆక్యుపెన్సీ

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి ఒకప్పటి నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఆపరేటివ్‌గా కనిపిస్తారు. నయనతారతో ప్రేమలో పడి, పూర్తిస్థాయి ఫ్యామిలీ మ్యాన్‌గా మారాలనుకునే క్రమంలో సాగే ఆయన ప్రయాణం ఆడియన్స్‌ను కడుపుబ్బ నవ్విస్తోంది.

ఇందులో విక్టరీ వెంకటేష్ చేసిన ఎక్స్‌టెండెడ్ క్యామియో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా మన శంకర వరప్రసాద్ చిత్రాన్ని నిర్మించాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks