...
...
Next Story

OTT Crime: మీరు ఇన్వేస్టిగేటర్‌లా మారిపోతారు- ఓటీటీలో పిచ్చెక్కించే క్రైమ్ థ్రిల్లర్- యువతి మరణం, 16 లింకులు- తెలుగులో!

D 16 OTT Streaming On 2 Platforms: ఈ వీకెండ్‌లో ఎలాంటి లవ్ ట్రాక్‌లు, అనవసర పాటలు లేని పక్కా గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకుంటున్నారా? అయితే 'డి-16' సినిమాను అస్సలు మిస్ కాకండి. 8.2 ఐఎమ్‌డీబీ రేటింగ్‌తో 2 ఓటీటీల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం.

Published on: Sep 13, 2026, 12:04:21 IST
Advertisement

D 16 OTT Streaming On 2 Platforms: సెలవు రోజుల్లో ఇంటి పట్టున ఉంటూ ఓటీటీ లవర్స్ ఎక్కువ భాగం సస్పెన్స్, మర్డర్, క్రైమ్, మిస్టరీ చిత్రాల వైపే మొగ్గు చూపుతుంటారు. అయితే దొరికే ప్రతీ సినిమా ఆకట్టుకోవాలని లేదు. ఫైట్లు, అనవసరమైన కామెడీ సన్నివేశాలు లేకుండా, కథ ప్రారంభం నుంచి చివరి దాకా సీటు అంచున నిలిపే థ్రిల్లర్లు అరుదుగా వస్తుంటాయి.

22 ఏళ్ల కుర్రాడు సృష్టించిన సంచలనం

మీరు ఇన్వేస్టిగేటర్‌లా మారిపోతారు- ఓటీటీలో పిచ్చెక్కించే క్రైమ్ థ్రిల్లర్- యువతి మరణం, 16 లింకులు- తెలుగులో!
మీరు ఇన్వేస్టిగేటర్‌లా మారిపోతారు- ఓటీటీలో పిచ్చెక్కించే క్రైమ్ థ్రిల్లర్- యువతి మరణం, 16 లింకులు- తెలుగులో!

అటువంటి కేటగిరీలో మాస్టర్‌పీస్‌గా నిలిచిన సౌత్ ఇండియన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ 'డి-16' (ధ్రువంగల్ పతినారు). మరీ బీభత్సమైన స్టార్ డమ్ లేని నటీనటులు, భారీ బడ్జెట్ హంగులు లేకపోయినా కేవలం బలమైన స్క్రిప్టుతో థియేటర్లలో సంచలనం సృష్టించిన చిత్రమిది.

2016లో విడుదలైన డి 16 సినిమాను కార్తీక్ నరేన్ అనే 22 ఏళ్ల కుర్రాడు తెరకెక్కించాడు. కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసి, కేవలం సినిమాపై ఉన్న పిచ్చితో ఆయన రాసుకున్న ఈ కథ బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయం సాధించింది.

మౌత్ టాక్‌తోనే

ఏమాత్రం ప్రచార ఆర్భాటాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన డి 16 సినిమా, కేవలం ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైన స్పందన (Word of Mouth)తో ఘన విజయాన్ని అందుకుంది. సుమారు గంటన్నర పైగా సాగే ఈ చిత్రం ప్రతి క్షణం ఉత్కంఠకు గురిచేస్తుంది.

ఒక్క రాత్రి.. అనేక మలుపులు!

ఈ కథ అంతా సీనియర్ పోలీస్ ఆఫీసర్ దీపక్ (రషీన్ రెహమాన్) చుట్టూ తిరుగుతుంది. ఒక భయానక ఎన్‌కౌంటర్‌లో తన కుడి కాలును కోల్పోయిన దీపక్, సర్వీస్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకుంటాడు. ఐదేళ్ల తర్వాత, ఒక కొత్త పోలీస్ క్యాడెట్‌కు తన కెరీర్‌లోనే అత్యంత సంక్లిష్టంగా మారిన చివరి కేసు వివరాలను వివరిస్తాడు.

'ధ్రువంగల్ పతినారు' అంటే '16 కోణాలు' అని అర్థం. డి 16 సినిమాలో ప్రతీ పాత్రకు, ఆ రాత్రి జరిగిన సంఘటనలకు మధ్య ఉన్న సంబంధాన్ని దర్శకుడు చాలా తెలివిగా ముడిపెట్టాడు. కథ సాధారణంగా సాగుతున్నట్లే అనిపించినా, ప్రేక్షకుడు కూడా సినిమాలో ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌లా మారి క్లూస్ వెతికేలా స్క్రీన్‌ప్లేను డిజైన్ చేశారు.

ముఖ్యంగా చివరి 15 నిమిషాల్లో వచ్చే ట్విస్టులు ఊహించని రీతిలో ఉండి గుండె వేగాన్ని పెంచుతాయి. ఒకదాని వెనుక ఒకటి వెలుగుచూసే నిజాలు ప్రేక్షకుడిని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తాయి.

ఎందుకు చూడాలంటే?

మీకు పక్కా సస్పెన్స్, క్లూ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ చిత్రాలు ఇష్టమైతే 'డి-16' ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. అనవసరమైన లవ్ స్టోరీలు, పాటలతో సమయాన్ని వృథా చేయకుండా నేరుగా కథలోకి తీసుకెళ్లడం ఈ సినిమా ప్రధాన బలం.

ప్రస్తుతం ఈ చిత్రం ‘డి-16’ పేరుతో జియో హాట్‌స్టార్ (JioHotstar) ఓటీటీలో అందుబాటులో ఉంది. అయితే, జియోహాట్‌స్టార్‌లో హిందీ భాషలో మాత్రమే డి 16 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. కానీ, జీ5లో తెలుగు భాషలో డి 16 ఓటీటీ రిలీజ్ అయింది.

16 ఎవ్రీ డీటేల్ కౌంట్స్ ఓటీటీ స్ట్రీమింగ్

కాకపోతే 16 ఎవ్రీ డీటేల్ కౌంట్స్ టైటిల్‌తో తెలుగులో జీ5 ఓటీటీలో ఈ సినిమా ఏపీ, తెలంగాణ ఆడియెన్స్‌కు అందుబాటులో ఉంది. ఐఎమ్‌డీబీలో 8.2/10 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సౌత్ క్లాసిక్ మూవీని ఓటీటీ వీకెండ్ వాచ్‌లిస్ట్‌లో తప్పక చేర్చుకోవచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks