Dacoit OTT Release Details: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, బ్యూటిపుల్ మృణాల్ ఠాకూర్ జోడీగా నటించిన లేటెస్ట్ మూవీ 'డెకాయిట్: ఏ లవ్ స్టోరీ'. ఏప్రిల్ 10, 2026న థియేటర్లలో విడుదలైన బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. మొదటి రోజే సుమారు 6.55 కోట్ల రూపాయల ఓపెనింగ్స్‌తో అడివి శేష్ తన మార్కెట్ స్టామినాను నిరూపించుకున్నారు.
డెకాయిట్ కలెక్షన్స్

శని, ఆదివారాల్లో కూడా నిలకడగా రాణించడంతో మొదటి వారం ముగిసేసరికి డెకాయిట్ సినిమా 28.45 కోట్ల రూపాయలను ఖాతాలో వేసుకుంది. రెండో వారంలో 'ధురంధర్ 2', 'భూత్ బంగ్లా' వంటి పెద్ద సినిమాల నుంచి పోటీ ఎదురైనప్పటికీ, నిలకడగా ఆడి ప్రపంచవ్యాప్తంగా 55.23 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇందులో కేవలం ఇండియా నుంచే 41.65 కోట్ల రూపాయలు రావడం విశేషం.
ప్రేమ.. ప్రతీకారం.. 'డెకాయిట్' కథాంశం
దర్శకుడు షానియల్ డియో తెరకెక్కించిన డెకాయిట్ సినిమా పక్కా రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. తప్పు చేయకపోయినా జైలు శిక్ష అనుభవించిన ఒక వ్యక్తి, బయటకు వచ్చాక తన మాజీ ప్రేమికురాలిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనే అంశాన్ని దర్శకుడు ఉత్కంఠభరితంగా చూపించారు.
తెలుగు, హిందీలో
ఇందులో అడివి శేష్ తన మార్కు నటనతో ఆకట్టుకోగా, మృణాల్ ఠాకూర్ గ్లామర్, పర్ఫామెన్స్‌తో మెప్పించింది. అనురాగ్ కశ్యప్, అతుల్ కుల్‌కర్ణి, ప్రకాష్ రాజ్ వంటి హేమాహేమీలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించడం వల్ల ఈ సినిమాకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది.
ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!
తాజా సమాచారం, ప్రకారం డెకాయిట్ ఓటీటీలోకి త్వరలో ప్రీమియర్ అవనుంది. మే 8 నుంచి డెకాయిట్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని టాక్ నడుస్తోంది. అంటే థియేటర్లలో విడుదలైన సరిగ్గా నాలుగు వారాలకే ఈ సినిమా డిజిటల్ రంగప్రవేశం చేస్తోంది. తొలుత డెకాయిట్ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని వార్తలు వచ్చాయి.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి
{{/usCountry}}తాజా సమాచారం, ప్రకారం డెకాయిట్ ఓటీటీలోకి త్వరలో ప్రీమియర్ అవనుంది. మే 8 నుంచి డెకాయిట్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని టాక్ నడుస్తోంది. అంటే థియేటర్లలో విడుదలైన సరిగ్గా నాలుగు వారాలకే ఈ సినిమా డిజిటల్ రంగప్రవేశం చేస్తోంది. తొలుత డెకాయిట్ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని వార్తలు వచ్చాయి.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి
{{/usCountry}}కానీ, తాజా నివేదికల ప్రకారం డెకాయిట్ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. అంటే, నెట్‌ఫ్లిక్స్‌లోనే డెకాయిట్ ఓటీటీ రిలీజ్ అవనుందన్నమాట. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ వంటి ఐదు భాషల్లో కూడా డెకాయిట్ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది.
మారిన ఓటీటీ ప్లాట్‌ఫామ్
అయితే, డెకాయిట్ ఓటీటీ రిలీజ్‌పై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, లవర్‌పై హీరో ప్రతికారం తీర్చుకునే కథతో తెరకెక్కిన డెకాయిట్ మూవీ తన ఓటీటీ ప్లాట్‌ఫామ్ మార్చుకుని నెట్‌ఫ్లిక్స్‌లో మే 8 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి.