...
...
Next Story

Deepika Padukone: దువాకు చిట్టి చెల్లెలు.. రెండోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె.. రణ్‌వీర్ సింగ్ ఆలయాల సందర్శన

Deepika Padukone Ranveer Singh Blessed With Second Child Baby: బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ ఇంట మళ్లీ పండుగ వాతావరణం నెలకొంది. శనివారం (సెప్టెంబర్ 19) ఈ జంట రెండో సంతానంగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఈ సంతోషకరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

Published on: Sep 20, 2026, 06:38:08 IST
Advertisement

Deepika Padukone Ranveer Singh Blessed With Second Child Baby: బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ ఇంట మరోసారి మహాలక్ష్మి అడుగుపెట్టింది. వీరికి రెండో సంతానంగా పండంటి ఆడపిల్ల జన్మించింది. శనివారం (సెప్టెంబర్ 19, 2026) చిన్నారి తమ జీవితంలోకి అడుగుపెట్టినట్లు ఈ దంపతులు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.

చిన్నారి పాదాల ముద్రతో

దువాకు చిట్టి చెల్లెలు.. రెండోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె.. రణ్‌వీర్ సింగ్ ఆలయాల సందర్శన (Instagram)
దువాకు చిట్టి చెల్లెలు.. రెండోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె.. రణ్‌వీర్ సింగ్ ఆలయాల సందర్శన (Instagram)

పసిపాప చిన్నారి పాదాల ముద్రతో కూడిన ప్రత్యేక ఫొటోను షేర్ చేస్తూ.. రణ్‌వీర్, దీపికా, మొదటి కుమార్తె దువా పేర్లను ఆ పోస్టులో పొందుపరిచారు. దీంతో దీపికా కూతురు దువాకు చిట్టి చెల్లెలు వచ్చినట్లు అయింది. ఈ తీపి కబురు తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో ఈ దంపతులకు శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు.

వివాహ బంధం.. మొదటి కుమార్తె 'దువా'

అక్క కాబోతున్న సంతోషంలో చిన్నారి దువా ప్రెగ్నెన్సీ కిట్ పట్టుకున్న క్యూట్ ఫొటోను షేర్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ప్రసవానికి కొద్ది రోజుల ముందు ఈ జోడీ తీయించుకున్న ప్రత్యేక మదర్‌హుడ్ ఫొటోషూట్ చిత్రాలు నెట్టింట వైరల్ అయ్యాయి.

సిద్ధివినాయకుడి ఆశీస్సులు

డెలివరీకి ఒక్క రోజు ముందు దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ ముంబైలోని ప్రముఖ సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా దేవుడి దర్శనం కోసం వచ్చిన అభిమానులకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ కనిపించారు. అంతకుముందు గురువారం రణ్‌వీర్ సింగ్ ఒక్కడే లాల్‌బాగ్చా రాజా పండల్‌ను దర్శించుకున్నారు. తెల్లటి చిక్కన్‌కారీ కుర్తా పైజామా ధరించి వినాయకుడి ఆశీస్సులు అందుకున్నారు.

"మాతృత్వం నన్ను పూర్తిగా మార్చేసింది"

తల్లిగా మారడం వల్ల తన జీవిత దృక్పథం ఏ విధంగా మారిందో దీపికా గతంలో పలు సందర్భాల్లో పంచుకున్నారు. గతేడాది ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాతృత్వంపై స్పందిస్తూ.. "పిల్లలు పుట్టకముందు కూడా నాకు ఓపిక ఎక్కువే, కానీ తల్లి అయ్యాక నాలో ఆ సహనం, భావోద్వేగాల లోతు మరింత పెరిగాయి" అని దీపికా పదుకొణె చెప్పుకొచ్చారు.

"మాతృత్వం మనల్ని సౌకర్యవంతమైన గూడు నుంచి బయటకు తెస్తుంది. నేను ఎప్పుడూ అందరితో అంతగా కలిసిపోయే మనిషిని కాను. కానీ ఇతర తల్లిదండ్రులతో సంభాషించడం, పిల్లల ప్లేస్కూల్ విషయాలు చూసుకోవడం వల్ల నాలో సామాజిక దృక్పథం పెరిగింది. ఇది ఒక మంచి మార్పు" అని దీపికా వ్యాఖ్యానించారు.

అల్లు అర్జున్ సినిమా రాకాలో

ఇక సినిమాల విషయానికి వస్తే, దీపికా పదుకొణె వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌తో కలిసి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో 'కింగ్' చిత్రంలో నటిస్తున్నారు. దీనికితోడు స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కనున్న భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'రాకా' (Raaka)లో దీపికా హీరోయిన్‌గా అలరించనున్నారు.

మరోవైపు రణ్‌వీర్ సింగ్ చివరిగా 'ధురంధర్: ది రివెంజ్' చిత్రంలో కనిపించగా, ప్రస్తుతం పోస్ట్ అపోకలిప్టిక్ థ్రిల్లర్ 'ప్రళయ్' కోసం సిద్ధమవుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks