బాలీవుడ్ లవ్లీ కపుల్ దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్‌కమ్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ జంట అమెరికాలోని న్యూయార్క్ నగరంలో విహరిస్తోంది. శుక్రవారం (జనవరి 2) రాత్రి అక్కడి ప్రసిద్ధ మేడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జరిగిన ఎన్‌బీఏ (NBA) బాస్కెట్‌బాల్ మ్యాచ్‌కి డేట్ నైట్‌లో భాగంగా వెళ్లిన దీపిక-రణ్‌వీర్ ప్రత్యక్షంగా వీక్షించారు.
కోర్టుసైడ్‌లో తారల మెరుపులు

న్యూయార్క్ నిక్స్, అట్లాంటా హాక్స్ జట్ల మధ్య జరిగిన బాస్కెట్‌బాల్ హోరాహోరీ పోరును దీపికా, రణ్‌వీర్ ఆస్వాదించారు. అక్కడ ఉన్న కొందరు భారతీయ అభిమానులు ఈ జంటను గుర్తించి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
దీపికా బ్లాక్ లెదర్ జాకెట్, స్మోకీ ఐస్ లుక్‌లో ఎంతో స్టైలిష్‌గా కనిపించగా, రణ్‌వీర్ బ్లాక్ కోట్, బీనీ క్యాప్‌తో తనదైన ఫ్యాషన్ టేస్ట్‌ను చాటుకున్నారు. అయితే, వీరి గారాల పట్టి దువా ఈ మ్యాచ్‌లో వీరితో పాటు కనిపించలేదు.
ఎమోషనల్ పోస్ట్
వీరిని కలిసిన ఒక అభిమాని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. "నా జీవితంలో ఇద్దరు నటీమణులను అమితంగా ఇష్టపడతాను. ఒకరు ఐశ్వర్యరాయ్, మరొకరు దీపికా పదుకొణె. దీపికా, రణ్‌వీర్‌లను చూడగానే నా గుండె కొన్ని క్షణాలు ఆగిపోయినంత పని అయింది" అంటూ ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు.
బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ సునామీ
ఒకవైపు వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూనే, మరోవైపు రణ్‌వీర్ సింగ్ తన కెరీర్‌లో అత్యంత భారీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘ధురంధర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.
దురంధర్ సినిమా ఇప్పటివరకు రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. కేవలం అమెరికాలోనే 17 మిలియన్ డాలర్ల మార్కును దాటడం విశేషం. దురంధర్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న రణ్‌వీర్ సింగ్ భార్య దీపికా పదుకొణెతో ఎన్‌బీఏ డేట్ నైట్‌కు వెళ్లడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అండర్ కవర్ స్పైగా
{{/usCountry}}దురంధర్ సినిమా ఇప్పటివరకు రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. కేవలం అమెరికాలోనే 17 మిలియన్ డాలర్ల మార్కును దాటడం విశేషం. దురంధర్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న రణ్‌వీర్ సింగ్ భార్య దీపికా పదుకొణెతో ఎన్‌బీఏ డేట్ నైట్‌కు వెళ్లడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అండర్ కవర్ స్పైగా
{{/usCountry}}ఇకపోతే ధురంధర్ సినిమాలో పాకిస్థాన్‌లో అండర్ కవర్ స్పైగా రణ్‌వీర్ సింగ్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, మాధవన్ వంటి ఉద్దండులు నటించిన ఈ చిత్రం విడుదలైన నాలుగో వారంలో కూడా రూ. 100 కోట్లు వసూలు చేసిన మొదటి హిందీ సినిమాగా చరిత్రకెక్కింది.
దురంధర్ చిత్రానికి సీక్వెల్ కూడా ఉందని తెలిసిందే. 2026 ఈద్ కానుకగా మార్చి 19న విడుదల కానుందని సమాచారం. మరోవైపు దీపికా పదుకొణె కూడా తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
అల్లు అర్జున్ సినిమాలో
షారుక్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’ చిత్రంలో దీపిక పదుకొణె హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రంలోనూ దీపికా హీరోయిన్‌గా సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే.