Dhamaal 4 Trailer Released: సినిమా ఏదైనా.. థియేటర్లలో నవ్వులు పూయించే అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఉండే క్రేజ్ ప్రత్యేకమైనది. 'వెంకీ', 'ఢీ' లాంటి సినిమాలను మనవాళ్లు ఎలాగైతే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారో.. బాలీవుడ్‌లో 'ధమాల్' సిరీస్‌కు కూడా ఇక్కడ భారీ ఫ్యాన్ బేస్ ఉంది.
ఐకానిక్ ఫ్రాంచైజీ

ఇన్నాళ్లుగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ఐకానిక్ ఫ్రాంచైజీ నుంచి నాలుగో భాగం 'ధమాల్ 4' (Dhamaal 4) నవ్వించేందుకు రెడీ అయింది. తాజాగా చిత్ర మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ధమాల్ 4 అల్టిమేట్ కామెడీ ట్రైలర్‌ను విడుదల చేశారు.
జూన్ 12న విడుదలైన ధమాల్ 4 ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇటీవల అక్షయ్ కుమార్ నటించిన 'వెల్‌కమ్ టు ది జంగిల్' ట్రైలర్ వచ్చిన కొద్దిరోజులకే ఈ మరో క్రేజీ కామెడీ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం.
ధమాల్ 4 ట్రైలర్
గతంలో వచ్చిన 'ధమాల్', 'డబుల్ ధమాల్', 'టోటల్ ధమాల్' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించడమే కాకుండా, బుల్లితెరపై, యూట్యూబ్‌లోనూ మిలియన్ల కొద్దీ వీక్షణలతో దూసుకుపోయాయి. ఇప్పుడు అదే క్రేజీ కాంబినేషన్‌ను దర్శకుడు ఇంద్ర కుమార్ మరింత భారీ స్థాయిలో వెండితెరకు ఎక్కించారు.
ఈసారి కథ మొత్తం ఒక రహస్యమైన లంకెబిందెలు లేదా బంగారు నిధి (Treasure Hunt) చుట్టూ తిరుగుతుందని ధమాల్ 4 ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన అజయ్ దేవగన్ ఈ చిత్రంలో తన మార్క్ కామెడీ టైమింగ్‌తో ఇరగదీశారు.
నిధి కోసం క్రేజీ వేట..
ధమాల్ 4 ట్రైలర్ ప్రారంభంలోనే అజయ్ దేవగన్, అర్షద్ వార్సి ఒక దెయ్యాల ఇంట్లోకి అడుగుపెట్టడం, అక్కడ కాలింగ్ బెల్ నొక్కగానే కరెంట్ షాక్ కొట్టే సీన్‌తోనే నవ్వులు మొదలవుతాయి. ఆ తర్వాత అజయ్, రితేష్ దేశ్‌ముఖ్, జావేద్ జాఫ్రీ, అర్షద్ వార్సి అంతా కలిసి ఒక హ్యూమన్ చైన్‌లా మారి, చెట్టుకు వేలాడుతున్న ఉపేంద్ర లిమాయే అనే క్యారెక్టర్‌ను నిధి ఎక్కడుందో చెప్పమని అడుగుతారు.
{{/usCountry}}ధమాల్ 4 ట్రైలర్ ప్రారంభంలోనే అజయ్ దేవగన్, అర్షద్ వార్సి ఒక దెయ్యాల ఇంట్లోకి అడుగుపెట్టడం, అక్కడ కాలింగ్ బెల్ నొక్కగానే కరెంట్ షాక్ కొట్టే సీన్‌తోనే నవ్వులు మొదలవుతాయి. ఆ తర్వాత అజయ్, రితేష్ దేశ్‌ముఖ్, జావేద్ జాఫ్రీ, అర్షద్ వార్సి అంతా కలిసి ఒక హ్యూమన్ చైన్‌లా మారి, చెట్టుకు వేలాడుతున్న ఉపేంద్ర లిమాయే అనే క్యారెక్టర్‌ను నిధి ఎక్కడుందో చెప్పమని అడుగుతారు.
{{/usCountry}}అయితే అతను పూర్తి వివరాలు చెప్పకుండానే లోయలో పడిపోవడంతో, అసలు గందరగోళం మొదలవుతుంది. ఆ బంగారు కొండను దక్కించుకోవడానికి ఈ గ్యాంగ్ చేసే విన్యాసాలు థియేటర్లలో నవ్వుల పండగ తెచ్చేలా ఉన్నాయి.
'జాక్ స్పారో'గా రవి కిషన్!
ఈ నిధి వేటలో భాగంగా సముద్ర ప్రయాణాలు, పైరేట్ షిప్ హంగామా వంటి సీన్లు ఆకట్టుకుంటున్నాయి. తెలుగులో 'రేసుగుర్రం' సినిమాలో మద్దాలి శివారెడ్డిగా అలరించిన స్టార్ నటుడు రవి కిషన్, ఈ చిత్రంలో హాలీవుడ్ ప్రసిద్ధ క్యారెక్టర్ 'జాక్ స్పారో' గెటప్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేశారు.
మొసళ్లతో ఫైట్ చేయడం, సముద్రపు తుఫానులను తట్టుకోవడం, దెయ్యాల బంగ్లాలో ఇరుక్కోవడం, పులులు వేటాడం వంటి ఎన్నో ఫాంటసీ సన్నివేశాలను మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా స్క్రీన్‌పై చూపించనున్నారు.
ఓల్డ్ ఈజ్ గోల్డ్.. సెల్ఫ్ ట్రోలింగ్‌తో అజయ్ దేవగన్
ట్రైలర్ చివర్లో అజయ్ దేవగన్ తన పాత సినిమాలపైనే సెల్ఫ్ ట్రోలింగ్ వేసుకోవడం హైలైట్‌గా నిలిచింది. తన డెబ్యూ సినిమా 'ఫూల్ ఔర్ కాంటే'లో రెండు బైక్‌లపై కాళ్లు పెట్టి నిలబడే ఐకానిక్ స్టంట్‌ను, ఈ సినిమాలో రెండు డాల్ఫిన్ చేపలపై చేసి చూపించారు. కానీ ఆ స్టంట్ కాస్త వికటించి ఆయనకు దెబ్బలు తగలడంతో ట్రైలర్ ముగుస్తుంది.
ఈ సినిమాలో అజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా నటిస్తుండగా, ఆమె ఇద్దరు పిల్లల తల్లిగా కనిపించనుంది. సంజయ్ మిశ్రా, సంజీదా షేక్, అంజలి దినేష్ ఆనంద్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
మేము వండిన కామెడీ
"దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులు ధమాల్ సిరీస్‌పై చూపిస్తున్న ప్రేమ అపూర్వమైనది. ఈ నాలుగో భాగంలో మేము వండిన కామెడీ అంతకు మించి ఉంటుంది" అని రితేష్ దేశ్‌ముఖ్ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు.
బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్‌లను తట్టుకుని నిలబడేందుకు వీలుగా 'ధమాల్ 4' విడుదలను జూలై 10, 2026కి ఖరారు చేశారు. ఈ క్రేజీ కామెడీ ఎంటర్‌టైనర్‌ను టి-సిరీస్, దేవగన్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.